twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Pallavi అలాంటి పాత్రలు చేసి డిప్రెషన్‌ గురయ్యా..చీరకట్టుతో డ్యాన్సులా? సాయిపల్లవి కామెంట్

    |

    విరాటపర్వం సినిమా తర్వాత సాయిపల్లవి నటించిన చిత్రం గార్గీ. గౌతమ్ రామచంద్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గార్గీ సినిమా జూలై 15న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాకు కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం. నాకు కూడా భారమైన పాత్రలు చేయడం ద్వారా ఒక రకమైన డిప్రెషన్‌కు లోనవుతున్నాను. ఇక ముందు గ్లామర్ పాత్రల్లో కనిపించడానికి ప్రయత్నిస్తాను అని సాయిపల్లవి చెప్పారు. ఇంకా గార్గీ సినిమా గురించి వెల్లడిస్తూ..

     ఆ సినిమాతో సంతృప్తి

    ఆ సినిమాతో సంతృప్తి


    కరోనా లాక్‌డౌన్‌కు ముందు నేను ముందుగా విరాటపర్వం సినిమా ఒప్పుకొన్నాను. ఆ తర్వాత లవ్ స్టోరి, గార్గీ, ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాలను అంగీకరించాను. అయితే పరిస్థితుల కారణంగా సినిమాలు అటు ఇటు అయిపోయి ఇప్పుడు గార్గీ రిలీజ్ అవుతున్నది. శ్యామ్ సింగరాయ్ నాకు మంచి కమర్షియల్ సినిమాగా మంచి సంతృప్తిని ఇచ్చింది అని సాయిపల్లవి అన్నారు.

     రకరకాల అభిప్రాయాలు

    రకరకాల అభిప్రాయాలు


    విరాటపర్వం సినిమా ఇచ్చిన ఫలితంతో నేను కొంత నిరుత్సాహపడ్డాను. అయితే నేను ప్రతీ సినిమా విషయంలో నేను పాత్రలో కనిపించాలని కోరుకొంటాను. ఆడియెన్స్ ఏం కోరుకొంటారో తెలియదు. నా ఇంటిలోనే నలుగురం కలిసి ఉంటే.. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మేము సినిమాను పలు కోణాల్లో ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి పరిస్థితి కమర్షియల్ సినిమా సక్సెస్ గురించి పెద్దగా ఆలోచించను. మంచి పాత్ర, మంచి సినిమాను అందించాలని కోరుకొంటాను అని సాయిపల్లవి చెప్పారు.

    రానా దగ్గుబాటికి ఫోన్ చేస్తే..

    రానా దగ్గుబాటికి ఫోన్ చేస్తే..


    గార్గీ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో సూర్య, జ్యోతిక మాదిరిగా రానా ఈ బాధ్యతను తీసుకొన్నారు. గార్గీ సినిమా గురించి చెప్పడానికి రానాకు ఫోన్ చేశాను. ఈ సినిమా గురించి ఫోన్‌లో చెప్పడటం మొదలు పెట్టి ముగించకుండానే.. నేను ఈ సినిమాకు సపోర్ట్ చేస్తాను. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను ఉన్నానని మంచి హృదయంతో చెప్పారు. నటిగా నాకు మంచి గౌరవాన్ని తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. ఆ ప్రేమకు తగినట్టుగా మంచి కథ లభిస్తే.. నేను ఓ సినిమాను నిర్మించడానికి ముందుకొస్తాను అని సాయిపల్లవి చెప్పారు.

    చీరకట్టుతో డ్యాన్సులా?

    చీరకట్టుతో డ్యాన్సులా?


    గార్గీ సినిమాలో డ్యాన్సులు ఉండవు. టీచర్‌గా, చీరకట్టుతో ఉంటే మహిళ డ్యాన్స్ చేస్తే చూడటానికి బాగుండదు. లవ్ స్టోరి సినిమాలో నేను బాగా డ్యాన్సులు చేశాను. కొన్నాళ్లు నేను డ్యాన్సుల చేయకూడదని అనుకొన్నాను. గార్గీ ఎమోషనల్ కథ. దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ స్వతహాగా లాయర్. ఆయన ఈ సినిమాను బాగా తెరకెక్కించారు అని సాయిపల్లవి తెలిపారు.

     హిందీ, మరాఠీ భాషల నుంచి ఆఫర్లు

    హిందీ, మరాఠీ భాషల నుంచి ఆఫర్లు


    తెలుగులో ఓ సినిమాను ఒప్పుకోవాల్సి ఉంది. తమిళంలో శివకార్తీకేయన్‌తో సినిమా చేస్తున్నా. మరాఠీ, హిందీ భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. వాటికి సంబంధించిన కథలు వింటున్నాను. త్వరలో అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. భవిష్యత్‌లో నేను దర్శకత్వం చేస్తానో లేదో తెలియదు. ప్రస్తుతం నటిగా నేను నా ప్రతిభను పూర్తిస్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను అని సాయిపల్లవి అన్నారు.

    English summary
    After Virataparvam, Sai Pallavi's new movie is Gargi. It is releasing on July 15th. Here is the exclusive interview of Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X