ఆ షోలో ఎలిమినేషన్.. ఎంత ఏడ్చానో.. సాయిపల్లవిని వెంటాడే జ్ఞాపకం
తన సహజ నటితో లేడీ పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి. డాక్టర్ చదివిన ఈ ముద్దుగుమ్మ యాక్టర్‌గా మారారు. డ్యాన్సర్ స్థాయి నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సాయిపల్లవి జీవితం ఎందరికో ఆదర్శం. గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన సినీ పరిశ్రమలో తను పెట్టుకున్న కట్టుబాట్లను మీరకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం తెలుగు వార్తా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన కెరీర్, సినిమాలు, ఇతర ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు నా ఫేవరెట్
'తెలుగు భాష అంటే తెలియని ఇష్టం. ఫిదా నుంచి తెలుగు నేర్చుకుంటూ వస్తున్నాను, ఇక్కడ ఏ సినిమా చేసినా తెలుగు అమ్మాయినే అనుకున్నాను. తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని అమ్మానాన్న ఏడిపిస్తుంటారు. నా మాతృభాష బడగ.. ఇంట్లో మాటల సందర్భంలో తెలుగు పదాలు రావడంతో నాన్న టెన్షన్ పడుతుంటారు. కన్నడ-కొంకణ్ మిక్సయి బడగ రూపాంతరం చెంది ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలన్నది కల, డ్యాన్స్ అంటే పిచ్చి. బయాలజీలో 80 మార్కులొస్తే, ఫిజిక్స్, కెమెస్ట్రీలో 60 మార్క్స్ రావడంతో సీటు రాదని ఫిక్సయై డ్యాన్స్ చేద్దామని అనుకున్నా. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో జాయిన్ అయితే నాకు అది సెట్ అవ్వదని అమ్మ గ్రహించింది. ఇండియాలో అప్పటికే క్లాసులు స్టార్ట్ అవ్వగా.. నా కజిన్ సిస్టర్ జార్జియాలో చదువుకోవడానికి వెళ్లారు. మెడిసిన్ చేయాలని నీకు ఆశగా ఉంటే జార్జియా వెళ్లమని ఇంట్లో వాళ్లు అడిగారు' అని సాయిపల్లవి గుర్తుచేసుకున్నారు.

పుట్టపర్తి సాయిబాబా చేతుల మీదుగా నామకరణం
' సినిమాలు నా మైండ్‌లోనే లేదు. కావాలంటే చదువు పూర్తయ్యాకే ఇండస్ట్రీలోకి వెళ్దామని అనుకున్నా. ఎప్పటి వరకు సినిమాలో నేను నటిస్తానో అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉంటా. తర్వాత మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాను. ముందు కార్డియాలజీ చేయాలనుకున్నా.. ఇప్పుడు గైనకాలజీ కూడా చేయాలనుకుంటున్నా. అమ్మవాళ్లు పుట్టపర్తిలోనే చదువుకోవడంతో నన్ను చిన్నప్పటి నుంచి అక్కడికి తీసుకెళ్తూ ఉండేవారు. సత్యసాయినే నాకు పేరు పెట్టారు. చిన్నప్పుడు నా పేరు నాకు నచ్చేది కాదు, కానీ 14 ఏళ్లు వచ్చేసరికి నా పేరు నాకు నచ్చేది' అని సాయిపల్లవి తెలిపారు.
మొటిమలు ఉన్నా ఇష్టపడ్డారు
'ఢీ షో చేసిన తర్వాత జార్జియా వెళ్లిపోయా. అప్పుడు హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ రెండింట్లో ఒకదాని కోసం అమ్మకి శేఖర్ గారు కాల్ చేసి అడిగారు. నేను జార్జియాలో చదువుకుంటూ ఉండటంతో శేఖర్ గారికి అమ్మ నో చెప్పేశారు. ప్రేమమ్ చూసిన తర్వాత మరోసారి నన్ను కాంటాక్ట్ అడిగారు. నేను ఆరు నెలల తర్వాత జాయిన్ అవుతానని చెప్పడంతో శేఖర్ గారు చదువు పూర్తి చేసుకుని వచ్చాక కలవమన్నారు. నేను మలయాళం ఇండస్ట్రీతో కెరీర్ స్టార్ట్ చేశా, అక్కడ అంతా నేచురల్‌గా ఉంటారు. నా ముఖానికి మొటిమలు ఉన్నా ఆ ఇండస్ట్రీ వాళ్లు నన్ను యాక్సెప్ట్ చేశారు' అని సాయిపల్లవి గుర్తుచేసుకున్నారు.

ఆ షోలో ఎలిమినేట్ అయ్యాక దేవుడిని తిట్టుకున్నా
'కంఫర్ట్ లేకుంటే మనం సరిగా చేయలేం. నా దర్శకులు కూడా నేనే కంఫర్ట్‌గా ఫీలయ్యే కాస్ట్యూమ్స్ ఇస్తే బాగా చేయగలదనే నమ్మకంతో వదిలేశారు. స్కిన్, మొటిమలు కవర్ చేయకూడదనే చెప్పినవారు ఉన్నారు. ఢీ షోలో చేసినప్పుడే జనాలు నన్ను ఇష్టపడ్డారని, కానీ ఢీ షోలో ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు ఇలా చేశావని దేవుడిని అడిగాను. ప్రభుదేవా షోలో ఓడిపోయినప్పుడు పదేళ్ల తర్వాత అదే సెట్‌లో ప్రభుదేవా మాస్టర్ రౌడీ బేబీ సాంగ్‌కి కొరియోగ్రఫి చేశారు. దేవుడు ఏం చేసినా అంతా మన మంచికే, ఇవాళ ఓడిపోయామంటే రేపు మన కోసం భారీ గెలుపు వెయిట్ చేస్తుంటుంది' అని సాయిపల్లవి తెలిపారు.
త్రిపురనేని సాయిచంద్‌తో బాండింగ్
'అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆమె డ్యాన్స్ చేసేదట. నువ్వు గత జన్మలో ఒక డ్యాన్సర్ అయ్యుంటావని, అందుకే నాకు డ్యాన్స్ చేయాలని అనిపించేదని అమ్మ చెప్పింది. నా డ్యాన్స్‌కి అమ్మే పెద్ద క్రిటిక్. ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్‌ల డ్యాన్స్ చూసే పెరిగా. నేను సంతోషంగా డ్యాన్స్ చేస్తాను, అది ఎలా వస్తుందో తెలియదు.. అంతా దేవుడి గిఫ్ట్. రౌడీ బేబీ సాంగ్ చేసినప్పుడు ధనుష్ ఎంతో మెచ్చుకున్నారు. త్రిపురనేని సాయిచంద్‌తో తండ్రి లాంటి ఫీలింగ్ ఉంది. ఫిదాలో చేసేటప్పుడు కొన్ని సన్నివేశాల్లో ఆయన మా నాన్నగారిలాగే అనిపించింది' అని ఫిదా నాటి అనుభవాలు పంచుకున్నారు సాయిపల్లవి.

అమ్మమ్మ పుట్టపర్తిలో.. నానమ్మ కోయంబత్తూరులో
'నాన్న గ్రామంలో పెరగడంతో ఆయన కొంచెం కట్టుబాట్లు అంటారు. అమ్మ చాలా లిబరల్‌గా ఉంటారు. ప్రేమమ్ రిలీజయ్యాక అమ్మానాన్న ఇద్దరు నా కెరీర్‌గా అండగా నిలబడ్డారు. నాన్న జీఎస్టీ ఆఫీసర్, అమ్మానాన్నలతో కలిసి మేం కోయంబత్తూరులో ఉంటాం. నానమ్మ- తాతయ్య కోటగిరిలో.. అమ్మమ్మ- తాతయ్య పుట్టపర్తిలో ఉంటారు. ఫిదా చేసేటప్పుడు తెలుగులో డబ్బింగ్ చెప్పేటప్పుడు శేఖర్ సార్ ఎంతో సాయం చేశారు. శ్యామ్ సింగ రాయ్‌లో క్లాసికల్ డ్యాన్స్ చేసేటప్పుడు ట్రైనింగ్ కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టా. ఎంత డ్యాన్స్ చేసినా ఆ సాంగ్‌కి కొత్త మూవ్‌మెంట్స్ వస్తూనే ఉన్నాయి. క్లాసికల్ డ్యాన్స్‌లోనే శరీరంలోని అన్ని కండరాలు పనిచేస్తూ, చాలా ఫోకస్డ్‌గా ఉంటాం' అని సాయిపల్లవి వెల్లడించారు.
ఏ దేశంలో ఉంటే అక్కడి కల్చర్ ఫాలో అవ్వాల్సిందే
'నాకు సీరియస్ రోల్స్, బరువైన పాత్రలు చేయడం ఇష్టం. అమ్మానాన్నలు మాత్రం సరదాగా ఉండే రోల్స్ చేయమంటారు. సీరియస్ రోల్స్ అందరికీ పడవు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయంటే నేను అదృష్టవంతురాలినే. జార్జియా వెళ్లినప్పుడు ఒక డ్యాన్స్ నేర్పిస్తామని అక్కడి వాళ్లు చెప్పారు.. అయితే దానికి తగ్గ కాస్ట్యూమ్స్ ఉండాలి. నేను ఈ విషయం అమ్మనాన్నలకి ఫోన్ చేసి చెబితే అమ్మ మాత్రం అలాంటి బట్టలు వద్దనగా, నాన్న మాత్రం ఫారినర్స్ ఇండియా వచ్చినప్పుడు మన బట్టలు వేసుకుంటారు. నువ్వు జార్జియాలో ఉన్నప్పుడు అక్కడి కల్చర్ ఫాలో అవ్వమని చెప్పారు. ప్రేమమ్ రిలీజ్ అయ్యాక నా పాత వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. జనం ఆ వీడియోలను ఫ్రేమ్ టూ ఫ్రేమ్ చెక్ చూసి చూడటంతో సిగ్గు వేసింది' అని సాయిపల్లవి జార్జియా గురించి చెప్పారు.


Click it and Unblock the Notifications











