ఎంసీఏలో నటించకుండా ఉండాల్సింది.. నానితో అలాంటి పరిస్థితి.. శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్‌లో సాయిపల్లవి క్లారిటీ
స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సినిమా వస్తుందంటే..ఆ మూవీలో బలమైన ఎమోషన్స్, ఆమెకు సంబంధించిన పాత్ర స్ట్రాంగ్‌గా ఉంటుందనే ఫీలింగ్ సాధారణంగా కలుగుతుంది. అందుకు తగినట్టే ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా దేవదాసి పాత్రతో శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు కూడా అలాంటి ఫీలింగ్‌ను కల్పించాయి. అయితే ఈ సినిమాలో దేవదాసి పాత్ర, తన సినిమాల గురించి సాయిపల్లవి మాట్లాడుతూ..

దర్శకుడు చెప్పే కథను నమ్మి
ప్రతీ మూవీ చేసేటప్పుడు స్క్రిప్టును నమ్మి, డైరెక్టర్ విజన్‌ను దృష్టిలో పెట్టుకొంటాం. దర్శకుడు రాహుల్ స్క్రిప్టు ఇచ్చినప్పుడు దేవదాసి పాత్ర నన్ను ఆకట్టుకొన్నది. అనేక కోణాల్లో సినిమాలోని పాత్ర గురించి ఆలోచించాను. క్యారెక్టర్‌ను రాయడం కంటే పాత్ర సైకాలజీ రాయడం నన్ను బాగా ఆకట్టుకొన్నది. ప్రతీ పాత్రను నమ్మి చేస్తాను. అదీ అందరికి నచ్చడం నా అదృష్టం. నాకు బలంగా మారిన డ్యాన్స్ నేను పోషించిన పాత్రలకు అదనపు ఆకర్షణగా మారింది. అయితే నా డైరెక్టర్లు నా పాత్రలకు ఎంత డ్యాన్స్ పెట్టాలో అంతే పెట్టడం, బ్యాలెన్స్ చేయడం ప్రేక్షకులను మెప్పిస్తున్నది. శ్యామ్ సింగరాయ్‌లో నా పాత్రకు ఎంత పెట్టాలో అంతే డ్యాన్స్ పెట్టారు. నాకు క్లాసికల్ డ్యాన్స్ రాదు. కానీ నాపై రాహుల్ నమ్మకం పెట్టుకొన్నారు అని సాయిపల్లవి తెలిపారు.

ఎంసీఏ సమయంలో అలాంటి పరిస్థితి
ఎంసీఏ తర్వాత మళ్లీ శ్యామ్ సింగరాయ్‌లో నానితో కలిసి నటిస్తున్నాను. ఎంసీఏలో మా మధ్య పెద్దగా సీన్లు లేవు. ఆ సినిమా షూట్ సమయంలో నేను నా మాదిరిగా, నాని తన మాదిరిగా పనిచేసుకొంటూ వెళ్లాం. ఈ సినిమాలో మా మధ్య ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. మా పాత్రలను పండించడానికి ఏం చేయాలనే డిస్కషన్ మా మధ్య జరిగాయి. అయితే పాత్రలకు తగినట్టుగానే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. దేవదాసి పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్ కంటే ఎమోషనల్ అంశాలు ఎక్కువగా ఉంటాయి అని సాయిపల్లవి చెప్పారు.

ఏంసీఏలో నటించాల్సింది కాదు..
ఫిదా మూవీ తర్వాత ఎంసీఏ చేయాల్సి వచ్చింది. కానీ ఆ సినిమాలో నటించడం తప్పని ఆ తర్వాత అర్ధమైంది. అందుకే నా ఇమేజ్, నా నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారనే విషయాలను దృష్టిలో పెట్టుకొని పాత్రలను ఎంపిక చేసుకొంటున్నాను. నా మనసుకు నచ్చితే తప్ప నేను నటించడం లేదు. ఏదైనా ప్రభావం వంతంగా ఉంటే తప్ప డైరెక్టర్ ఆఫర్లను ఒప్పుకోవడం లేదు. స్టార్ హీరోలకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకొంటారనడం తప్పు. డైరెక్టర్లు వాళ్లు ఊహించుకొని నా కోసం రాస్తున్నారు. అవి నచ్చితేనే నేను చేస్తున్నాను అని సాయిపల్లవి అన్నారు.

ప్రతీ సినిమాకు అలాంటి ఒత్తిడే
యాక్టింగ్ ప్రొఫెషనల్‌లో ప్రతీ రోజు ఒక రకంగా ఉంటాం. పాత్రలు మాపై ప్రభావం చూపుతుంటాయి. పాత్రలను బట్టి మా మూడ్స్ మారుతుంటాయి. దానికోసం మెడిటేషన్ చేశాను. కొన్ని హెల్త్ సెంటర్‌కు వెళ్లి తగిన ట్రీట్‌మెంట్ తీసుకొంటాం. మాపై ఒత్తిడి భారీగా ఉండటం కారణంగా కొన్నిసార్లు కష్టం అనిపిస్తాయి అయినా నేను వాటిని అధిగమించడానికి ఏదో రకాలుగా ప్రయత్నిస్తున్నాం అని సాయిపల్లవి అన్నారు.

శ్యామ్ సింగరాయ్ మూవీ నా కథ కాదు
దేవదాసి పాత్రను పోషించే సమయంలో నాకు ఎలాంటి పరిమితులు నాపై పెట్టలేదు. పాత్ర పరిధి మేరకు చేశాం. శ్యామ్ సింగరాయ్ సినిమాలో నా కథ కాదు. శ్యామ్ అనే రచయిత కథ. ఆ కథలో నేను చిన్నపాత్రలో కనిపిస్తాను. బెంగాల్ నేపథ్యంగా రావడానికి ప్రత్యేకమైన కథ లేదు. బెంగాల్ సంస్కృతి ఎలా ఉంటుందో నాకు పెద్దగా అవగాహన లేదు. అయితే అక్కడ షూటింగ్ సమయంలో అక్కడి ప్రజలు మాకు మంచి సహకారం అందించారు అని సాయిపల్లవి చెప్పారు.

రాహుల్ సంక్రిత్యన్ కథపై గ్రిప్ అలాంటింది
రాహుల్ కథ గురించి మంచి అవగాహన ఉంది. ఆయన విజన్ తగినట్టుగా మేమంతా నటిస్తూ వచ్చాం. కథలో ఉండే భావోద్వేగాలను ఆయన సూచన మేరకు పండించాం. పాత్ర కోసం ఎలా ఎమోషన్ పండించాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పేవారు. దాంతో నటించడం మాకు చాలా సులభం అయింది. ఈ సినిమాకు అవార్డు వస్తుందా అని ఆలోచించడం లేదు. కానీ ప్రజలకు నచ్చితే అదే గొప్ప అవార్డు అని సాయి పల్లవి చెప్పారు.
Recommended Video

సాయిపల్లవి తదుపరి సినిమాలు
శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత విరాటపర్వం రిలీజ్ కావాల్సి ఉంది. తమిళంలో మరో సినిమా పూర్తి చేశాను. త్వరలోనే తమిళ సినిమా గురించి నిర్మాత, దర్శకులు చెబుతారు. నాకు ఆ సినిమా గురించి చెప్పే అవకాశం నాకు లేదు. విరాటపర్వం సినిమా షూటింగ్ అయిపోయింది. ఇక వెబ్ సిరీస్ గురించి కొన్ని స్క్రిప్టులు ఉన్నాయి. వాటి గురించి ఆలోచిస్తున్నాను. సాయిపల్లవి చెప్పారు.


Click it and Unblock the Notifications











