తండేల్‌కు ఒక పథకం ప్రకారం పోటీ కాదు.. విలన్ ఎవరో చెబితే 10000 ఇస్తాం.. సాయిరాం శంకర్
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు, టాలీవుడ్ హీరో సాయి రామ్ శంకర్ నటించిన ఒక పథకం ప్రకారం. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించగా, గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఈ మూవీలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి హీరో సాయి శంకర్ వెల్లడించిన విషయాల్లోకి వెళితే..
ఒక పథకం ప్రకారం సినిమాలో విలన్ ఎవరో గుర్తిస్తే.. 10000 వేల రూపాయల బహుమతి ఇస్తామని పెట్టిన పోటీకి మంచి రెస్పాన్స్ వస్తున్నది. అలాంటి క్విజ్ పెట్టడం వల్ల సినిమా గురించి ప్రేక్షకులు బాగా తెలుసుకొన్నారు. జనాల్లోకి సినిమా వెళ్లడానికి ఆ కాంపిటీషన్ బాగా పనికి వచ్చింది. యూనిట్‌కు సంబంధించిన కీలక సభ్యులు మూవీ చూసిన తర్వాత విలన్‌ను సరిగా గుర్తిస్తే.. 10 వేల బహుమానం అనే కాన్సెప్ట్‌తో ప్రచారం చేద్దామని అన్నారు. దాంతో పట్టుకొంటే 10000 వేలు అని బహుమతి ప్రకటించాం అని సాయిరాం శంకర్ తెలిపారు.

ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్ వ్యవహారాల్లో ఒక పథకం ప్రకారం అనే స్టేట్‌మెంట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సినిమా కథలో కూడా క్యారెక్టర్లకు ఎవరి ప్లాన్స్ వారికి ఉంటాయి. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ కరెక్టుగా సూట్ అవుతుందని మేము ఒక పథకం ప్రకారం అనే టైటిల్‌ను పెట్టాం అని సాయిరాం శంకర్ చెప్పారు.
దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ టాలెంటెడ్, టెక్నిషియన్. 17 ఏళ్లకే ఆయన డైరెక్టర్ అయ్యారు. మలయాళంలో చాలా పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. నా మొదటి సినిమా తర్వాత నుంచి అంటే 2005 నుంచి నాతో పరిచయం ఉంది. ఫాహద్ ఫాజిల్‌తో రెండు సినిమాలు చేశారు. అప్పటి నుంచి నాతో సినిమా చేయాలని అనుకొన్నారు. ఇప్పటికి కుదిరింది. నా ఫ్రెండ్ ఒకరు, డైరెక్టర్ కలిసి నాతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు అని సాయిరాం శంకర్ తెలిపారు.
ఒక పథకం ప్రకారం సినిమా ట్రైలర్‌ను అన్నయ్య పూరీ జగన్నాథ్‌కు పంపించాం. ఆయన చూసి చాలా బాగుందని అన్నారు. మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాను. నేను లాయర్ పాత్ర చేస్తున్నానని చెబితే గుడ్ అని ఆయన అన్నారు. లాయర్ పాత్ర కోసం కొంత ట్రైనింగ్ అయ్యాను. ఒక నెలపాటు వర్క్ షాప్ చేశాను అని సాయిరాం శంకర్ చెప్పారు.

ఒక పథకం ప్రకారం సినిమాలో రెండు ఫైట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో 25 డాగ్స్‌తో చిత్రీకరించిన యాక్షన్ సీన్లు ఈ హైలెట్. నాలుగు రోజులపాటు షూట్ చేశాం. ఓ సందర్భంలో ఓ డాగ్ నన్ను వెంటాడింది. ఆ సమయంలో నేను తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. ఢిల్లీ బాబు తమిళ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. ఫైట్స్‌తోపాటు రాహుల్ రాజ్ పాటలు చేశారు. గోపి సుందరం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు అని సాయిరాం శంకర్ తెలిపారు
మా సినిమాను తండేల్‌కు పోటీగా రిలీజ్ చేయడం లేదు. ఆ సినిమా పక్కన రిలీజ్ చేస్తున్నాం. సాయిపల్లవి, నాగచైతన్య, అల్లు అరవింద్ లాంటి వాళ్లు చేసే సినిమా, భారీ బడ్జెట్ మూవీకి పోటీ కాదు అని సాయిశంకర్ తెలిపారు. థియేటర్లతోపాటు ఓటీటీలో ఈ సినిమా బాగా ఆడుతుంది అనే విశ్వాసాన్ని సాయిరాం శంకర్ వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











