మహేష్‌బాబు, రాంచరణ్, ఎన్టీఆర్ లేరు.. ఇక నాకు అగ్ని పరీక్షే.. సమంత
టాలీవుడ్ హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత కెరీర్ తారాజువ్వలా దూసుకెళ్తున్నది. అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా సమంత మీడియాతో ముచ్చటించారు. ఓ బేబీ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

ఓ బేబీ ప్రమోషన్‌లో బిజీ బిజీగా
ఓ బేబీ సినిమా మూడ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా సొంతంగా ఈ సినిమాను భుజాన మోస్తూ ప్రమోషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా నా కెరీర్‌కు ప్రత్యేకమైనది. అందరూ చూడాల్సిన సినిమా అని భావించాను. అందుకే విపరీతంగా ప్రమోసన్ చేస్తున్నాన. రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి మాటెత్తను. మజిలీ సినిమాకు కూడా నేను భారీగానే ప్రమోషన్ చేశాను. చైతూ, నేను కలిసి నటించడం వల్ల అది మాకు స్పెషల్‌గా మారింది.

ప్రతీ మూవీకి తిరుపతికి
నాగచైతన్య సినిమా నటించిన ప్రతీ సినిమాకు నేను తిరుపతికి వెళ్లి దేవుడిని దర్శించుకొంటాను. ఓ బేబి సినిమాకు నేను, నా టీమ్ అందరం కలిసి నడుచుకొంటూ వెళ్లాం. తిరుపతికి వెళ్లడం వల్ల కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఈ సినిమా కోసం చైతూ కూడా వెళ్లమని చెప్పారు అని సమంత చెప్పాను.

ఓ బేబీ నాకు అగ్నిపరీక్ష
ఓ బేబీ నాకు ఓ పరీక్ష లాంటిందే. సాధారణంగా స్టార్ హీరోలు ప్రేక్షకులను రప్పించే ప్రయత్నం చేస్తారు. నేను నటించిన సినిమాల్లో మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఓపెనింగ్స్ ఉండేవి. ఇప్పుడు హీరోకు ప్రాధాన్యం లేకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఎంత మేరకు వస్తారు అనేది ఇప్పడే చెప్పలేం.

నా స్టార్‌డమ్ ఎంతంటే
ఓ బేబీ టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము మంచి సినిమా తీశాం. థియేటర్‌కు ప్రేక్షకులు వస్తేనే మంచి సినిమా అని తెలుస్తుంది. అందుకే ప్రేక్షకుల వద్దకు ఈ సినిమాను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా నా స్టార్‌డమ్ ఎంత అనే విషయాన్ని బేరీజు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని సమంత పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











