For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పిల్లల్ని కనాలని ఉంది.. చైతూ రెడీగా లేడు.. కారణం అదే.. సమంత

  |
  Samantha Akkineni Talks About Naga Chaitanya

  రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాల సక్సెస్ తర్వాత సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం యూ టర్న్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సమంత మీడియాతో మాట్లాడింది. వివరాల్లోకి వెళితే

  నా పేరెంట్స్ అలా పెంచారు.. ఆ విషయంలో బాధపడను.. భూమిక

   యూటర్న్ రీమేక్ ఎందుకంటే

  యూటర్న్ రీమేక్ ఎందుకంటే

  లూసియా చిత్రం నుంచి డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌కుమార్ నాకు బాగా తెలుసు. మంచి స్క్రిప్ట్ ఉంటే నేను న‌టిస్తాన‌ని కూడా చెప్పాను. కానీ తాను నేను చెప్పిన విషయాన్ని మ‌ర‌చిపోయి యూ ట‌ర్న్ సినిమాను క‌న్న‌డ రూపొందించారు. యూటర్న్ విషయం ఎందుకు చెప్పలేదని అడుగగా క‌న్న‌డ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం ఇచ్చారు. దాంతో యూటర్న్ తెలుగులో చేయాలని నిర్ణయించుకొన్నాను.

  రీమేక్ ఆలస్యం కావడానికి

  రీమేక్ ఆలస్యం కావడానికి

  యూటర్న్ రీమేక్ ఆలస్యం కావడానికి కారణం నేను నటించిన గత చిత్రాలే. ఆ చిత్రాల కారణంగా నా హెయిర్ స్టెయిల్ మార్చడానికి వీలుకాలేదు. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత తెలుగు, తమిళంలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే రీమేక్‌కు చాలా సమయం పట్టింది. కన్నడ వెర్షన్‌కు చిన్న చిన్న మార్పులు చేసి రూపొందించాం. చివ‌రి 20 నిమిషాలు సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది.

   అనుకోకుండా చైతూతో పోటీ

  అనుకోకుండా చైతూతో పోటీ

  చైతూ నటించిన శైలజారెడ్డి చిత్రం ఆగస్టు 31న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. రెండు వారాల తర్వాత వాళ్లు సెప్టెంబర్ 13న రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్నారు. అయితే మేము ముందుగానే యూటర్న్‌ను అదే తేదీన రిలీజ్ చేయాలనుకొన్నాం. ఇది అనుకోకుండా చోటుచేసుకొన్న పోటి అని సమంత చెప్పారు.

   ఒకేసారి రీలీజ్‌తో టెన్షన్

  ఒకేసారి రీలీజ్‌తో టెన్షన్

  నా సినిమా, చైతూ సినిమా ఒకేసారి రిలీజ్ అవుతుంటే టెన్షన్‌గా ఉంది. అయితే నా భర్తగా చైతన్య సినిమా సక్సెస్ కావాలని కోరుకొంటాను. ఆ తర్వాత నా సినిమా ఆడాలని కోరుకొంటున్నాను. గతంతో పోల్చితే నాకు చైతన్య ఇచ్చే సపోర్ట్ పెరిగింది. ఆయన అండగా నిలువడం చాలా సంతోషంగా ఉంది.

  నిర్మాతగా మారుతాను

  నిర్మాతగా మారుతాను

  నిర్మాతగా మారాలని ఉంది. కానీ సినిమాల్లో నటిస్తూ నిర్మించలేను. భవిష్యత్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు నా వద్దకు వస్తే సినీ నిర్మాణం చేపడుతాను. ఇప్పుడు నటిగా ఆఫర్లు వస్తున్నందున నటనపైనే దృష్టిపెడుతాను.

   డబ్బింగ్ ఎందుకు చెప్పానంటే

  డబ్బింగ్ ఎందుకు చెప్పానంటే

  యూటర్న్ చిత్రంలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకొన్నాను. గాయని చిన్మయిని కాదని డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా కారణాలు ఏమీ లేవు. తెలుగులో కూడా డ‌బ్బింగ్ చెప్పుకుని ఓ కంప్లీట్ యాక్ట‌ర్ అనిపించుకోవాల‌ని ఉంది. దర్శకుడు శివ నిర్వాణ రూపొందించే చిత్రంలో నేను, చైత‌న్య‌ కలిసి నటిస్తున్నాం.

   పిల్లల్ని కనడానికి నేను రెడీ

  పిల్లల్ని కనడానికి నేను రెడీ

  నాగార్జునను తాతగా ఎప్పుడు చూపిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పిల్లలను ఎప్పుడు కనాలనే విషయంపై ఇంకా ప్లాన్ చేయలేదు. నాగచైతన్య ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నాకైతే పిల్లలు కావాలనే ఉంది. కానీ ఈ విషయంలో చైతూను ఎక్కువగా ఇబ్బంది పెట్టను. పిల్లలకు సంబంధించి చై ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తాడో ఏమో? వేచి చూడాల్సిందే అని సమంత ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

  English summary
  After Their marriage, Samantha Akkineni and Naga Chaitanya Akkineni will have a face-off this week at the box office. While Samantha will be seen in her film U Turn, a Tamil-Telugu bilingual, Chaitanya's Shailaja Reddy Alludu is also releasing on the same day - September 13. On the occassion of Uturn release Samantha spoke to media and revealed that she was ready for Kids.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more