చీటింగ్ భార్య అని చీదరించుకొనే పరిస్థితి... మూడు రోజులు నిద్రపట్టలేదు.. సమంత

గతేడాది అభిమన్యుడు, రంగస్థలం, మహానటి, యూటర్న్ లాంటి సినిమాలతో సమంత అక్కినేని అదరగొట్టింది. 2019లో మజిలీ సూపర్ డీలక్స్‌తో శుభారంభం చేసింది. తాజాగా ఓ బేబీ అనే విభిన్నమైన చిత్రంతో వస్తున్నారు. పలు చిత్రాల్లో విలక్షణమైన నటన ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. స్టార్ హీరోయిన్‌గా మార్చడమే కాకుండా.. హీరో స్థాయికి తగినట్టు భారీ కటౌట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ బేబీ సినిమా జూలై 5వ తేదీన విడుదల అవుతున్నది. ఈ సందర్భంగా సమంత మీడియాతో ముచ్చటించారు. ఓ బేబీ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

మజిలీ, సూపర్ డీలక్స్‌తో

మజిలీ, సూపర్ డీలక్స్‌తో

మజిలీ, సూపర్ డీలక్స్ సినిమా వారం రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు పాత్రలు ఒకటికి మరొకటి కంప్లీట్ విభిన్నమైనవి. సూపర్ డీలక్స్ సినిమా ప్రారంభం కావడానికి ముందు మూడు రోజులు నిద్ర పట్టలేదు. ఆ పాత్రను చేసే ముందు నేను బాగా భయపడ్డాను. టెన్షన్‌గా ఫీలయ్యాను. ఎందుంటే భర్తను చీట్ చేసే క్యారెక్టర్ కావడమే. భర్తను కాదని పరాయి వ్యక్తితో పక్క పంచుకొంటాను. దాంతో పాత్ర నెగిటివ్ ఒపినియన్ ఏర్పడుతుంది.

మొదటి సీన్‌లోనే అలా

మొదటి సీన్‌లోనే అలా

సూపర్ డీలక్స్ సినిమాలో మొదటి సీన్ నుంచి ఆ కార్యెక్టర్‌ను చీదరించుకొంటారు. భర్త ఉండగానే.. మాజీ ప్రియుడితో శృంగారంలో పాల్గొనే పాత్ర ఛాలెంజిగ్ నిలిచింది. కాబట్టి నేను చేసే క్యారెక్టర్‌పై ఎలా సింపతీ క్రియేట్ చేయాలని బాగా ఆలోచించుకొన్నాను. ఆ సినిమాలోని నా క్యారెక్టర్ గురించి ఓ అభిప్రాయాన్ని, పరిధిని ఏర్పరుచుకొన్నారు. ఆ పరిధి దాటిపోకూడదని అనుకొన్నాను. అలానే నటించాను. అందుకే ఆ సినిమాలో పాత్రకు మంచి పేరు వచ్చింది.

నేను కంప్లీట్ యాక్టర్ అని

నేను కంప్లీట్ యాక్టర్ అని

ఓ బేబీ తర్వాత నేను పూర్తిస్తాయి (కంప్లీట్) యాక్టర్ అయ్యానని అనుకోను. నేనెప్పుడూ అలా ఫీల్ కాను. ఇంతకు ముందు నటించిన సినిమాలను నేను అప్పుడే మరిచిపోతాను. కాబట్టి నేను గొప్ప నటినా అని బేరీజు, లెక్కలు వేసుకొను. నేను ఎప్పుడూ కంప్లీట్ యాక్టర్ అని అనుకోను. ప్రతీ రోజు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకొంటాను. నేను నిత్య విద్యార్థిని అని సమంత పేర్కొన్నారు.

లేడీ డైరెక్టర్ అయితే ఏంటీ

లేడీ డైరెక్టర్ అయితే ఏంటీ

లేడీ డైరెక్టర్, మేల్ డైరెక్టర్ అనే తేడా నాకు లేదు. ఎవరితోనైనా కంఫర్ట్‌గా ఉంటాను. టాలెంట్ అనేదే నేను చూస్తాను. నందినీ రెడ్డి నాకు డియర్ ఫ్రెండ్. నాతో ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు. పుష్కలంగా ప్రతిభ ఉన్న డైరెక్టర్. మహిళా, పరుష డైరెక్టర్ల వల్ల వర్కవుట్ కాదు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ నిలబెడుతున్నది. ఓ బేబి సినిమాకు ఎక్కువ మంది మహిళా టెక్నిషియన్స్ పనిచేశారు. కేవలం మహిళ అనే ట్యాగ్‌తో వారు అవకాశం దక్కించుకోలేదు. వారి ప్రతిభ కారణంగానే వారు సినిమాకు వర్క్ చేశారు అని సమంత పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X