twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలోనే బుల్లి బాబు లేదా పాప: సమంత... బూతులు తిడుతారేమోనని భయపడ్డా!

    |

    అందం, అభినయంతో మెప్పిస్తున్న సమంత అక్కినేని కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. సమంత నటించిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నది. అలాగే ఆమె నటించిన మజిలీ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్నది. గతేడాది నాలుగైదు బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకొన్న సమంత మరోసారి ఆ రికార్డును అధిగమించేందుకు ఈ ఏడాది కూడా రెడీ అవుతున్నారు. మజిలీ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలు వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

    సూపర్ డీలక్స్‌లో బోల్డుగా నటించాను

    సూపర్ డీలక్స్‌లో బోల్డుగా నటించాను

    సూపర్ డీలక్స్ చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించాను. సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమోనని భయపడ్డాను. బూతులు తిడుతారేమోనని కంగారు పడ్డాను. కానీ నేను పోషించిన వేంబు పాత్రపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నా సినిమాకు మంచి టాక్ రావడం, నా పాత్రకు ప్రశంసలు రావడంతో చాలా సంతోషంగా ఉంది.

    చైతూను అడిగే ఆ పాత్రను చేశా

    చైతూను అడిగే ఆ పాత్రను చేశా

    సూపర్ డీలక్స్‌లో ఆఫర్ వచ్చినప్పుడు ఆ సినిమాలో నటించాలా అని చైతూని అడిగాను. ఆ పాత్ర గురించి, కొన్ని సీన్ల గురించి చెప్పాను. దాంతో నీకు ఇష్టమైతే నటించు అని చైతూ అన్నారు. నా నిర్ణయాలను చైతూ గౌరవిస్తాడు. మేమిద్దరం భార్యభర్తల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటాం అని సమంత తెలిపారు.

    సూపర్ డీలక్స్ సినిమా హిట్ తర్వాత

    సూపర్ డీలక్స్ సినిమా హిట్ తర్వాత

    సూపర్ డీలక్స్ సినిమా రిలీజ్ తర్వాత మామగారు (నాగార్జున) ఫోన్ చేసి పెద్ద హిట్ అయిందని విన్నాను. నాకు చెప్పలేదే. కనీసం ట్రైలర్ కూడా చూపించలేదని అడిగారు. అయితే మీరు బిజీగా ఉంటారని నేను చెప్పలేదు అని నేను చెప్పాను. వాళ్ల అబ్బాయిలను సపోర్టు చేసిన విధంగానే నన్ను ఆయన సపోర్టు చేస్తారు అని సమంత చెప్పింది.

    నా తొమ్మిదేళ్ల కెరీర్‌లో

    నా తొమ్మిదేళ్ల కెరీర్‌లో

    హీరోయిన్‌గా నా ప్రయాణం తొమ్మిదేళ్లు. నా మనసుకు నచ్చిన ఎన్నో పాత్రలు, సినిమాల్లో నటించాను. ఏడాదికి నాలుగైదు చిత్రాల కంటే ఎక్కువగా నటించడం ఇష్టం లేదు. రెగ్యులర్ పాత్రల్లో నటించను. సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించడానికి ఎదురుచూస్తున్నాను.

    పిల్లల గురించి ఆలోచిస్తున్నామని

    పిల్లల గురించి ఆలోచిస్తున్నామని

    పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఇంకా ప్లాన్ చేయలేదు. అలాగని మరో మూడేళ్లు ఆగలేను. త్వరలోనే బుల్లిపాపనో, బాబునో మా కుటుంబంలో భాగస్వామ్యం చేయాలని అనుకొంటున్నా. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అని సమంత అన్నారు.

    నా తదుపరి సినిమాలు ఇవేనని

    నా తదుపరి సినిమాలు ఇవేనని

    సూపర్ డీలక్స్ సినిమా తర్వాత నేను నటించిన మజిలీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్నది. ఆ చిత్రం తర్వాత ఓ బేబీ సినిమాలో నటిస్తాను. అనంతరం 96 మూవీ రీమేక్‌లో నటిస్తాను. ప్రస్తుతానికి నేను కమిట్ అయిన సినిమాలు ఇవే అని సమంత వెల్లడించారు.

    English summary
    Naga Chaitanya Akkineni, Samantha Akkineni's latest movie is Majili. Ninnu Kori fame Shiva Nirvana is director. This movie pre release functions was held in Hyderabad on March 31st. Nagarjuna and Venkatesh are the chief guest for this event. Nagarjuna made funny comments in this event, targeting Samantha and Naga Chaitanya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X