Samantha: యాక్టర్‌గా నా భయం అదే.. నెవర్ అండర్ ఎస్టిమెట్.. సమంత (ఇంటర్వ్యూ)
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్ తదితరలు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఫిల్మీబీట్ ఎడిటర్ రాజబాబుతో సమంత పలు విషయాలు పంచుకొన్నారు. ఆమె ఏం చెప్పారనే విషయాల్లోకి వెళితే..

మా ఇంటి బంగారం సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ కంటే కథనే డామినేట్ చేస్తుంది. కథలో అన్నీ రంగులు ఉంటాయి. అదే ఈ సినిమా స్క్రిప్టులో స్పెషాలిటీ. ఫ్యామిలీ డైనమిక్స్, లవ్, ఫీమేల్ ఫ్రెండిషిప్, హీరోయిజం, నెవర్ అండర్ ఎస్టిమేట్ అండర్ డాగ్ అనే విధంగా ఉంటుంది. అన్నీ సమానంగా ఉండే కథ ఇది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని బలంగా చెబుతున్నాం అని సమంత అన్నారు.
చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ లాంటి సినిమా. నేను థియేటర్‌లో ఎలాంటి సినిమా చూడాలనుకొంటానో అలాంటి సినిమాగా ఉంటుంది. ఈ సినిమాలోని పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఈ రోల్ నాకు కొత్త సవాల్ విసిరింది. చాలా షేడ్స్ ఉన్న సినిమా ఇది. ఈ పాత్ర కోసం ఎలాంటి రెఫరెన్స్ తీసుకోలేదు. అని సమంత చెప్పారు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఓ హీరోయిన్ చేసినప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లు, ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అతి పెద్ద ఛాలెంజ్. ఈ సినిమా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఓ హీరోయిన్ ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో అనేది ట్రేడ్ వెయింటింగ్‌లో ఉంది. కోవిడ్ తర్వాత సినిమాలకు ప్రేక్షకులకు రావడం చాలా కష్టంగా మారింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి అని సమంత అన్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రమోషన్స్‌లో సమంత, ఇతర నటీనటులు పాల్గొన్నారు. అనంతరం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకొన్నారు. తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారిలో శ్రీముఖి, రాజ్ నిడిమోరు, నిర్మాత హిమాంక్ తదితరులు ఉన్నారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్లు రాబడుతున్నది. దాంతో మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications