For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెక్ మూవీ క్లైమాక్స్ ఎక్ట్రార్డినరీ.. అదరగొట్టేలా స్క్రీన్ ప్లే.. ఎమోషనల్ ఇంటర్వ్యూతో సంపత్ రాజ్

    |

    దక్షిణాదిలో అద్భుతమైన పాత్రలతో రాణిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టు సంపత్ రాజ్. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో వచ్చిన లౌక్యం చిత్రంతో ప్రేక్షకులకు సుపరిచితులైన ఆయన మిర్చిలో బెస్ట్ విలనిజం చూపి మిర్చి సంపత్‌గా మారిపోయారు. ఎన్నో పాత్రలతో ఆకట్టుకొంటున్న సంపత్ రాజ్ తాజాగా భవ్య క్రియేషన్ బ్యానర్‌పై వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం చెక్. ఈ చిత్రంలో మరో మంచి రోల్‌తో ఆకట్టుకోబోతున్నారు. ఈ సందర్భంగా చెక్ సినిమా గురించి సంపత్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ..

    దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న చెక్ మంచి కథతో రూపొందింది. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. మీరో నితిన్ ఒకే క్యాస్టూమ్‌లో కనిపిస్తారు. దాదాపు 80 శాతం కథ, సన్నివేశాలు జైలులోనే జరుగుతాయి. వాస్తవ జీవితంలో ఓ ఖైదీ జైలులో ఎలా ఉంటారు.. 20 ఏళ్లు జైలులో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఏలా ఉంటుంది అనే కోణంలో కథ సాగుతుంటుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో నేను నటించిన చిత్రాల్లో ఇదే డిఫరెంట్ మూవీ అని సంపత్ రాజ్ అన్నారు.

    Sampath Raj about his role Check movie and Chandra Sekhar Yeleti

    చెక్ చిత్రంలో నేను పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. భీష్మ చిత్రంలోని పాత్ర ఫన్‌గా సాగితే.. చెక్ చిత్రంలో ఎమోషనల్‌గా ఉంటుంది. హీరో క్యారెక్టర్‌పై పగ, ప్రతీకారంతో ఉంటాను. ఉరిశిక్ష అమలు కావాల్సిందేనే లక్ష్యంతో నా క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది. అయితే హీరోకు ఉరిశిక్ష పడిందా లేదా అనే వెండి తెరపైనే చూడాలి అని సంపత్ రాజ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. .

    Sampath Raj about his role Check movie and Chandra Sekhar Yeleti

    దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి గురించి మాట్లాడుతూ.. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అనే విషయం నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగులో ఉండగా ఆయన వచ్చి కథ చెప్పారు. పది నిమిషాల్లోనే నా పాత్ర ఎలా ఉంటుందనే అవగాహన కల్పించారు. వెంటనే మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అక్కడే చాలా విషయాలు మాట్లాడుకొన్నాం అని సంపత్ రాజ్ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.'

    Sampath Raj about his role Check movie and Chandra Sekhar Yeleti

    మీరు ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో 'చెక్' భిన్నమైన సినిమా అనుకోవచ్చా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తప్పకుండా చెక్ చిత్రం నా కెరీర్‌లో డిఫరెంట్. నేను ఇంకా సినిమా చూడలేదు. ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా సినిమా ఉంటుంది. విజువల్స్ కళ్లకు ట్రీట్‌గా ఉంటాయి. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. క్లైమాక్స్ ఈ సినిమాకు అల్టిమేట్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో భాగంగా కథలో వచ్చే మలుపులు, ట్విస్టులు ఎక్ట్రార్డినరీగా ఉంటాయి. ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగించడం ఖాయం అని సంపత్ రాజ్ పేర్కొన్నారు.

    English summary
    Versatile actor Sampath Raj is coming once again with good role in Check. Nithiin, Rakul Preet Singh and Priya Prakash Varier are the lead role. This movie set to release on Feb 26th. In this occassion, Sampath speacks to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X