Bro చిరంజీవి అని పేరు పెడుదామని అనుకొన్నాం..పవన్ ను డైరెక్ట్ చేయడం గొప్ప అనుభూతి..సముద్ర ఖని (ఇంటర్వ్యూ)

తెలుగు సినిమా పరిశ్రమలో అందరూ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం బ్రో (Bro The Avatar). పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం జూలై 28వ తేదీన రిలీజ్ కానున్నది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించగా, వివేక్ కూచిబోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు, నటుడు సముద్రఖని ఫిల్మీబీట్ తెలుగుతో మాట్లాడుతూ...

నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నేను ఏదీ ప్లాన్ చేయలేదు. 1994లో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాను. అప్పటి నుంచి నేను ఏదీ ప్లాన్ చేయలేదు. పవన్ కల్యాణ్‌తో బ్రో కూడా టైమ్ డిసైడ్ చేసిందే అని సముద్రఖని చెప్పారు.

Samuthirakani interview about Bro The Avatar and Pawan Kalyan, Sai Dharam Tej

17 ఏళ్ల క్రితం వినోదయ సీతమ్ అనే డ్రామాను నేను కే బాలచందర్ గారితో చూశాను. ఆ సమయంలో సినిమాగా తీద్దామని చెబితే నీవు కావాలంటే సినిమాగా తీయండి. నేను కాపీరైట్స్ ఇప్పిస్తానని బాలచందర్ గారు చెప్పారు. అప్పడే నేను కాపిరైట్ తీసుకొన్నాను. అయితే కథను సినిమాగా ఎలా తీయాలనే విషయాన్ని ఆలోచిస్తూనే ఉండిపోయాను అని సముద్రఖని చెప్పారు.

అయితే కోవిడ్ సమయంలో జీ5 ఓటీటీ వాళ్లకు ఐదు కథలు చెప్పాల్సి వచ్చింది. 25 నిమిషాల్లో 5 కథలు చెప్పాలని అన్నారు. నేను 23 మూడు నిమిషాల్లో ఐదు కథలు చెప్పాను. ఇంకా మూడు నిమిషాలు మిగిలి ఉండటంతో ఓ కథ చెప్పాలా అని అడిగాను. దాంతో వాళ్లు సరే.. అన్నారు. అలా చెప్పిన కథే వినోదయ సీతమ్. అలా ఈ సినిమాకు టైమ్ అలా కలిసి వచ్చింది అని సముద్రఖని తెలిపారు.

వినోదయ సీతమ్ సినిమా తమిళంలో ఓటీటీలో హిట్ అయిన తర్వాత ఈ కథను వీలనైన్నీ భాషల్లో చెప్పాలని అనుకొన్నారు. దాదాపు 12 భాషల్లో నేను తీయడానికి ప్లాన్ చేశాను. తులు భాషలో 30 లక్షలతో సినిమా తీయాలని ప్లాన్ చేశాం. బాలీవుడ్‌లో 200 కోట్లతో ఈ సినిమాను నిర్మించాలని అనుకొంటున్నాం అని సముద్రఖని తెలిపారు. వినోదయ సీతమ్ సినిమా తర్వాత సినిమా ఇండస్ట్ర్ర్రీకి వచ్చిన లక్ష్యం సగం పూర్తయింది. పవన్ కల్యాణ్‌తో బ్రో తీసిన తర్వాత నా టార్గెట్ ముగిసింది. ప్రస్తుతం మిగిత జీవితం నాకు బోనస్ లాంటిందే అని సముద్రఖని చెప్పారు.

Samuthirakani interview about Bro The Avatar and Pawan Kalyan, Sai Dharam Tej

వినోదయ సీతమ్ తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. బ్రో సినిమా కన్ఫర్మ్ అయిన తర్వాత పవన్ కల్యాణ్‌తో కథ గురించి చర్చించాను. ప్రతీ విషయంలో పవన్ కల్యాణ్ చాలా కూల్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా షూట్‌కు ముందు వర్క్ షాప్ జరిగింది. వర్క్‌షాప్‌లో డైలాగ్ ప్రాక్టీస్ జరిగాయి. వర్క్ షాప్ పూర్తయిన తర్వాత షూట్‌కు ఎప్పుడు వెళ్దామని పవన్ అడిగితే .. నేను వెంటనే అని చెప్పాను. అలా రెండు రోజుల తర్వాత షూట్ ముగిసింది. పవన్ కల్యాణ్‌తో 21 రోజులు పనిచేశాను. సినిమా కోసం మొత్తం 58 రోజులు షూట్ చేశాం అని సముద్రఖని అన్నారు.

బ్రో మూవీలో సాయిధరమ్‌ పాత్ర ఆయన జీవితానికి చాలా దగ్గరైన క్యారెక్టర్. యాక్సిడెంట్ తర్వాత అతడికి చాలా దగ్గరైన క్యారెక్టర్. మొదటి నుంచి సాయిధరమ్ తేజ్ అనుకొన్నాం. ఆయన పాత్రకు చిరంజీవి అని పేరు పెడుదామని అనుకొన్నాం. కానీ ఆ తర్వాత మార్కెండేయులు అని పెట్టాం. అతడి స్నేహితులు మార్క్ అని స్టైల్‌గా పిలుచుకొంటారని అలా త్రివిక్రమ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X