Pawan Kalyan రాష్ట్ర స్థాయి కాదు.. నేషనల్ లీడర్.. రాబోయేతరం కోసం గొప్ప విజన్.. సముద్రఖని (ఇంటర్వ్యూ)
వినోదయ సీతమ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మధురైలో బడా పారిశ్రామిక వేత్త, డాన్ ఈ సినిమాను చూసి షాక్ తిన్నాడట. అయితే ఎలాగైనా నాతో మాట్లాడాలని ఆయన వైరముత్తుకు ఫోన్ చేశాడట. నా ఫోన్ నంబర్ అడిగితే.. వాళ్లు ఇచ్చారు. దాంతో ఆయన నాకు కాల్ చేసి... చాలా భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెట్టుకొని భోరున ఏడ్చాడు.
ఆయన సముదాయించలేక కష్టపడ్డాను. ఆ సమయంలో నేను తివ్రిక్రమ్ వద్ద ఉన్నాను. తివ్రిక్రమ్ ఏంటని అడిగితే.. వినోదయ సీతమ్ గురించి చెప్పాను. దాంతో ఆయన కథ విని వెంటనే ఆ సినిమాను పవన్ కల్యాణ్‌తో చేద్దామని చెప్పారు. పది నిమిషాల్లోనే స్క్రీన్ ప్లే మార్చేశారు అని సముద్ర ఖని చెప్పారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఓ విభిన్నమైన వ్యక్తి. ఆడియెన్స్‌కు వినోదం అందించడానికి కథను విజువల్ ట్రీట్‌గా మార్చే సత్త ఉన్న ఫిలింమేకర్. ఈ సినిమాను 53 రోజుల్లో పూర్తి చేసేంతగా స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమాకు టైమ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఒక సెకన్ కూడా వేస్ట్ చేయకుండా వర్క్ చేశాం. నా తండ్రి నా చిన్నతనంలోనే చనిపోయారు. బ్రో సినిమాకు ఆయనతో పనిచేస్తుంటే.. నా తండ్రి గుర్తుకు వచ్చారు. నా చేయి పట్టి నడిపించారనే ఫీలింగ్‌ను ఆయన కలిగించాడు అని సముద్రఖని చెప్పారు.
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌ను హ్యాండిల్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. వారిద్దరిది డిఫరెంట్ స్టైయిల్. అయితే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కారణంగా నేను ఈ సినిమా కోసం కష్టపడాల్సిన అవసరం రాలేదు. సెట్స్‌లో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కలుగలేదు. కెమెరా పెట్టి వారిద్దరిని చూసుకొంటూ వెళ్లిపోయాను. చాలా తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేశాను అని సముద్రఖని అన్నారు.

పవన్ కల్యాణ్ కేవలం నటుడే కాదు.. రాజకీయాల్లో చాలా ప్రజాదరణ ఉన్న నాయకుడు. కేవలం స్టేట్ లీడర్ కాదు. అంతకంటే ఎక్కువే. ఎందుకంటే ఆయన ప్రజల కోసం మంచి చేయాలనే విజన్. దేశ అభివద్ది కోసం చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఆయన ప్లాన్స్ విన్న తర్వాత నేను ఆయన స్టేట్ లీడర్ కాదు.. నేషనల్ లీడర్ అని చెప్పాను. ఆయన నేషనల్ లీడర్ కంటే ఎక్కువ అనిపిస్తుంది అని సముద్రఖని తెలిపారు.
దేశాన్ని చక్కటి మార్గంలో నడిపించాలనే తాపత్రయం ఉన్న రాజకీయ నేత. ఆయన ప్లాన్ ఓ 20 నుంచి 25 సంవత్సరాలు. అవినీతి, అక్రమాలను రూపుమాపి వచ్చే తరం కోసం బంగారు బాట వేయాలని కలలు కంటున్న రాజకీయ నేత. అందుకే నేను జాతీయ స్థాయి నేత అని అన్నాను. కానీ అంత కంటే ఎక్కువే. ప్రపంచానికి దిశానిర్దేశం కలిగిన విజన్ ఆయనకు ఉంది అని సముద్రఖని చెప్పారు.

బ్రో ( Bro The Avatar) సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అత్యంత ప్రాణంగా నిలుస్తుంది. తమన్ చేసిన రీరికార్డింగ్ తెర మీద చూసిన తర్వాత కళ్లలో నీళ్లు తిరిగాయి. సినిమాలోని చాలా సీన్లు చూసి తమన్ కూడా నా కళ్ల ముందు కంటతడి పెట్టుకొన్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత తమన్ తన 11 ఏళ్ల వయసులో చనిపోయిన తండ్రిని గుర్తు చేసుకొన్నాడు. ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే గొప్పగా మ్యూజిక్ ఇచ్చారు అని సముద్రఖని చెప్పారు.


Click it and Unblock the Notifications











