BRO 2: బ్రో 2 మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. సముద్రఖని క్రేజీ న్యూస్ వెల్లడి
ప్రముఖ దర్శకులు, నటులు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించిన కార్మేని సెల్వం చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. అరుణ్ రంగరాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నది.
ఈ మూవీకి మ్యూజిక్: MAAS, సినిమాటోగ్రఫి: యువరాజ్ దక్షన్, ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: శంకర్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫిల్మీబీట్ ఛానెల్‌తో నటుడు, దర్శకుడు సముద్రఖని మాట్లాడారు. బ్రో (BRO) మూవీ సినిమా సక్సెస్ తర్వాత BRO 2 సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..

సముద్రఖని స్వయంగా నటించి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం వినోదయ సీతమ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం, ప్రశంసలు అందుకొన్నది. జీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ చిత్రంలో తంబి రామయ్య తదితరులు నటించారు. అయితే ఈ సినిమాను పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి బ్రో చిత్రంగా తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా కూడా భారీ విజయం అందుకొన్నది. దాంతో ఈ సినిమా రెండో పార్ట్ ఎప్పుడనే చర్చ మొదలైంది. ఈ సినిమా రెండో పార్ట్ గురించి సముద్రఖని మాట్లాడుతూ..
బ్రో 2 సినిమాను స్టార్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అన్నలు చెప్పాలి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. పవన్ కల్యాణ్ అన్నకు కథ చెప్పాను. ఆ కథ గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఎప్పుడు చేస్తారనే విషయం గురించి నాకు ఐడియా లేదు. ఆ ప్రాజెక్ట్ ట్రాక్ పైకి ఎక్కాలంటే పవన్ అన్న నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి అని సముద్రఖని అన్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన పదవీ బాధ్యతలతో బిజీగా ఉన్నారు. బ్రో కాన్సెప్టే టైమ్. దేనికైనా కాలం కలిసి రావాలి. బ్రో సినిమాకు ఎలాంటి ప్లాన్ చేయలేదు. అలా సినిమా స్టార్ట్ అయింది. పూర్తి అయింది. ప్రేక్షకులు బాగా మెచ్చారు. అందుకే బ్రో 2 గురించి కథ రాశాను. పవన్ కల్యాణ్‌తో డిస్కస్ చేశాను అని సముద్రఖని అన్నారు. అయితే తన బిజీ షెడ్యూల్ నుంచి విరామం దొరికితే బ్రో 2 సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











