SS Rajamouli ఓ లైబ్రరీ..త్రివిక్రమ్‌ది ఆ స్టయిల్.. నితిన్ సినిమాకు డైరెక్షన్ చేస్తా.. సముద్రఖని (Interview)
దక్షిణాదిలో నా కెరీర్ చాలా బాగుంది. అల వైకుంఠపురంలో, క్రాక్, RRR, సర్కారు వారీ పాట, ఆకాశవాణి, భీమ్లా నాయక్ సినిమాలు చాలా వచ్చాయి. త్రివిక్రమ్, గోపిచంద్ మలినేని, రాజమౌళి, పరుశురాం సినిమాలు నాకు మంచి గిఫ్టులు. మాచర్ల నియోజకవర్గం చిత్రం కథలో నా పాత్ర గురించి దర్శకుడు రాజశేఖర్ రెడ్డి వచ్చి చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. తమిళనాడు, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయని దర్శకుడికి చెప్పాను. తమిళనాడులోని మధురై ప్రాంతంలో రెండు ప్రాంతాల్లో 25 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగడం లేదు. ఉదయచంద్రన్ అనే కలెక్టర్ వచ్చి ఆ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రయత్నం చేశారు అని

మాచర్ల నియోజకవర్గంలో డబుల్ రోల్
మాచర్ల నియోజకవర్గం సినిమా కథ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇందులో నేను ద్విపాత్రభినయం చేస్తున్నాను. రాజప్ప పాత్ర ఓ రియల్ క్యారెక్టర్. నేను చాలా పుస్తకాలు చదువుతాను. అనేక సంఘటనలు చూస్తాను. అలా కొంత ఎక్సర్‌సైజ్ చేసి ఆ పాత్రను చేశాను. తెర మీద నా పాత్ర అందర్నీ ఆకట్టుకొంటుంది. ఇలాంటి పాత్రను అందించినందుకు నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డికి థ్యాంక్యూ చెప్పుకొంటున్నాను.

పక్కా కమర్షియల్ సినిమా
మాచర్ల నియోజకవర్గం చిత్రం వాస్తవ సంఘటనలతో కూడిన కమర్షియల్ సినిమా. నితిన్ ఎనర్జీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మంచి స్టోరితోపాటు పక్కా మాస్ అంశాలు ఈ కథలో ఉన్నాయి. ఫ్యామిలీ, కామెడీతోపాటు మంచి ప్యాకేజ్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా నటిస్తున్నాను. చాలా కష్టపడి ఈ సినిమా చేశాను. ఒక్కసారి నా పాత్రను స్క్రీన్ మీద చూసుకొన్న తర్వాత నా కష్టాన్ని మరిచిపోయాను అని సముద్ర ఖని అన్నారు.

నితిన్ డిఫరెంట్ స్టయిల్‌లో
నితిన్ కలెక్టర్‌గా కొత్తగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు చూసిన నితిన్ వేరు..ఈ సినిమాలో నితిన్ వేరు. నితిన్ ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మా మధ్య చాలా సీన్లు ఉన్నాయి. మా ఇద్దరి మధ్య పోటాపోటిగా సన్నివేశాలు కొనసాగుతాయి. దర్శకుడు ఎడిటర్ కాబట్టి.. ఆయనకు సినిమాపై క్లారిటీ ఉంటుంది. ఒక్కడ కత్తెర వేయాలి.. ఎలాంటి సీన్లు చేయాలో ఆయన అవగాహనతో సెట్లో కనిపించారు అని సముద్ర ఖని తెలిపారు.

రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి
నేను పనిచేసిన ఒక్కో దర్శకుడికి ఒక్కో రకమైన స్టయిల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కూల్. స్క్రిప్ట్ అంతా కూల్‌గా మైండ్‌లో ఉంటుంది. రాజమౌళి ఒక లైబ్రరీ. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన టేకింగ్ ఉంటుంది. నా దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మా మధ్య ఓ కథ గురించి చర్చ జరిగింది. మంచి స్టోరీలు ఉన్నాయి. టైమ్ కుదిరితే నితిన్‌తో సినిమా చేస్తాను అని సముద్రఖని అన్నారు.

సముద్రఖని ప్రస్తుతం చేస్తున్న సినిమాలు
ప్రస్తుతం చిరంజీవితో గాడ్‌ఫాదర్ చిత్రంలో, జీ5 కోసం ఓ సినిమా చేస్తున్నా. అలాగే నానితో దసరా సినిమా చేస్తున్నాను. ఇంకా చాలా సినిమాలు డిస్కషన్‌లో ఉన్నాయి. పాన్ ఇండియా అనేది నేను పట్టించుకోను. మంచి సినిమా ఉంటే.. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆమోదం ఉంటుంది. మాచర్ల నియోజకవర్గం సిన్సియర్ అటెంప్ట్. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది ని సముద్రఖని అన్నారు.


Click it and Unblock the Notifications











