Pawan Kalyan ఫ్యాన్స్ కురిపించిన ప్రేమ అలాంటిది.. ధనుష్‌తో ఆఫర్ రాగానే.. సంయుక్త మీనన్ (ఇంటర్వ్యూ)

తమిళ సూపర్ స్టార్ ధనుష్, యువ హీరోయిన్ సంయుక్త మీనన్ జంటగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన చిత్రం సార్. ఈ చిత్రంలో తమిళంలో వాతి పేరుతో రిలీజ్ అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ...

బింబిసార సినిమా చేసేటప్పుడు

బింబిసార సినిమా చేసేటప్పుడు

కల్యాణ్ రామ్‌తో బింబిసార సినిమా చేసేటప్పుడు విరూపాక్ష సినిమాను ఒప్పుకొన్నాను. ఈ రెండు సినిమాలు రిలీజైన తర్వాత రెస్పాన్స్ చూసి మరో సినిమా చేసే విషయాన్ని ఆలోచించాలని అనుకొన్నాను. ఆ సమయంలో సితార బ్యానర్‌లో పవన్ కల్యాణ్‌తో భీమ్లా నాయక్‌లో నటించే అవకాశం లభించింది. భీమ్లా నాయక్ సెట్లో నా ఫెర్ఫార్మెన్స్ చూసి ధనుష్ నటించే సార్ చిత్రంలో అవకాశం ఇచ్చారు అని సంయుక్త మీనన్ తెలిపారు.

వెంకీ అట్లూరి కథ చెప్పగానే..

వెంకీ అట్లూరి కథ చెప్పగానే..

భీమ్లా నాయక్ సినిమా చేసేటప్పుడు దర్శకుడు వెంకీ అట్లూరి కథ చెప్పగానే చాలా నచ్చింది. వెంటనే ఈ సినిమా తప్పకుండా చేయాలని అనుకొన్నాను. కథ, నా పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో వెంటనే ఒప్పేసుకొన్నాను. ఆ తర్వాత లుక్ టెస్ట్ చేసి మీనాక్షి పాత్రకు ఫైనల్ చేశారు. ఈ పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్ చేయలేదు. ఈ పాత్ర స్వభావం ప్రకారం అప్పటికప్పుడు సహజంగా చేస్తేనే బాగుంటుందనిపించింది. ఈ చిత్రంలో నాది పల్లెటూరి అమ్మాయి పాత్ర. ఏపీ, తెలంగాణలోని గ్రామాల్లో పర్యటించాను. డైరెక్టర్, రైటర్‌తో ఎక్కువగా డిస్కషన్ చేశాను. టీచర్ల బాడీ లాంగ్వేజ్, చీరకట్టు గమనించాను అని సంయుక్త మీనన్ చెప్పారు.

పవన్, ధనుష్ లాంటి టాప్ హీరోలతో

పవన్, ధనుష్ లాంటి టాప్ హీరోలతో

నా కెరీర్ ఆరంభంలోనే పవన్ కల్యాణ్, రానా, కల్యాణ్ రామ్ లాంటి పెద్ద హీరోలు, ధనుష్‌తో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ధనుష్‌ను నేను ఎప్పటి నుంచో చూస్తూ ఆయన అభిమానిగా మారాను. ఆయన మంచి నటుడే కాకుండా బిగ్ స్టార్. అలాంటి యాక్టర్‌తో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది అని సంయుక్త మీనన్ తెలిపారు. భీమ్లా నాయక్ సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చూపించిన ప్రేమను మరిచిపోలేను అని సంయుక్త మీనన్ అన్నారు.

మీనాక్షి అనే టీచర్‌గా

మీనాక్షి అనే టీచర్‌గా

డైరెక్టర్ వెంకీ రూపొందించే సినిమాల్లో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. సార్ సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉంటుంది. ఈ చిత్రంలో బయాలజీ బోధించే టీచర్‌గా మీనాక్షి అనే పాత్రలో కనిపిస్తాను. హీరో పాత్రతోపాటు నా రోల్ కూడా బలంగా ఉంటుంది. సినిమా కథ, హీరో పాత్రతో పాటు నా పాత్ర జర్నీ కొనసాగుతుంది. సార్ సినిమా భావోద్వేగమైన పాయింట్‌తో విద్యావ్యవస్థ గురించి మంచి సందేశమే కాకుండా వినోదభరితంగా కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయి అని సంయుక్త మీనన్ అన్నారు.

ఆ కారణంగానే డబ్బింగ్ చెప్పలేకపోయా

ఆ కారణంగానే డబ్బింగ్ చెప్పలేకపోయా

నేను తెలుగు భాషను కేవలం 15 క్లాసుల్లో నేర్చుకొన్నాను. నా తెలుగు ట్యూటర్ ఆశ వల్లనే సాధ్యమైంది. నాకు ప్రస్తుతం తెలుగు మీద కమాండ్ వస్తున్నది. సెట్లో నేను తెలుగు మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తిలో కనిపించే ఉత్సాహం నాకు మంచి ఎనర్జీని, ప్రోత్సాహాన్ని అందించింది. అయితే షూటింగుల కారణంగా సార్ సినిమాకి డబ్బింగ్ చెప్పలేకపోయా. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది అని సంయుక్త మీనన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X