వాట్ ఎ క్రేజీ కాంబినేషన్.. మెగాస్టార్ చిరంజీవితో సందీప్ రెడ్డి వంగా.. నెక్స్ట్ మూవీపై డైరెక్టర్ క్లారిటీ
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు తెలియని ఇండియన్ సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 2017లో విజయ్ దేవరకొండ, శాలినీ పాండేలను హీరోహీరోయిన్లుగా తీసుకొని ఈయన తీసిన చిత్రం అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అర్జున్ రెడ్డి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గట్లేదు. తెలుగులో అయితన ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తొలి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న వంగా సందీప్ రెడ్డి... సినిమా రచయితగా కూడా పని చేశారు.
ముఖ్యంగా అర్జున్ రెడ్డి సూపర్ డూపర్ హిట్టవడంతో 2019లో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. కబీర్ సింగ్ పేరుతో తీసుకు వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించగా వారి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ లతో కలిసి యానిమల్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. డిసెంబర్ ఒకటో తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది.

అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బ్లాక్ బస్టర్ హిట్టు దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగాను అంతా పరామర్శిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు అందరూ ఈ సినిమాను చూడడం, రీవ్యూలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇదంతా ఇలా ఉండగా... తాజాగా ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అమెరికాకు వెళ్లారు.
అక్కడే సినీ ప్రియులతో కలిసి సరదాగా మాట్లాడారు. ఈక్రమంలోనే తన నెక్స్ట్ సినిమాపై స్పందించారు. అలాగే తనకు ఎవరితో సినిమా చేయాలని ఉందే బయట పెట్టారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో తనకు సినిమా చేయాలని ఉన్నట్లు వెల్లడించారు. అవకాశం వస్తే కచ్చితంగా ఆయనతో కలిసి ఓ సినిమా తీస్తానని ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా ఓ యాక్షన్ డ్రామా అని కూడా వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే.. ఇప్పటికే సందీప్ రెడ్డి కథను సిద్ంధం చేసుకున్నారని... చిరంజీవి ఓకే చెబితే త్వరలోనే పట్టాలెక్కుతుందని తెలియబోతుంది.

మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే తెలుగు సినీ ప్రేక్షకులు ఏ రేంజ్ లో హ్యాపీగా ఫీలవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టేకింగ్ టాలెంట్ కల్గిన సందీప్ రెడ్డి వంగా... చిరంజీవిని డైరెక్ట్ చేస్తే.. ఆ సినిమా కచ్చితంగా హిట్టుగా నిలుస్తుందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందా.. ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుందో.


Click it and Unblock the Notifications











