స్పిరిట్ చిత్రానికి అదే ప్రాణం.. 70 శాతం వర్క్ ఫినిష్.. రిలీజ్ ఇంకా ముందే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ భారీ చిత్రాన్ని తెరకెక్కించ బోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ టైటిట్ ను స్పిరిట్ అంటూ అనౌన్స్ చేసి చాలా నెలలు దాటింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ తను ఇప్పటికే కమిట్ మెంట్ ఇచ్చిన సినిమాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో స్పిరిట్ చిత్రం కోసం తన మేకోవర్ ను ఫుల్ గా మార్చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
అయితే, ఇప్పటికే స్పిరిట్ చిత్రం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ డార్లింగ్ డేట్స్ అడ్జెస్ట్ చేయడంలో కాస్తా ఆలస్యం అవుతోందని ఇన్ సైడ్ టాక్. ఇక స్పిరిట్ చిత్రం సెట్స్ లోకి వెళ్లడానికి ఇంకాస్తా పమయం పడుతుందని అంటున్నారు. 2025 చివర్లో లేదంటే 2026 ప్రారంభం అంటే జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇప్పటికే సందీప్ రెడ్డి వంట ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, కాస్ట్ అండ్ క్రూ, ప్రీ ప్రొడక్షన్ పనులు, లోకేషన్లు లీగాలిటీ పనులను పూర్తి చేసి షూటింగ్ కోసం కాపు కాచుకోని కూర్చొన్నారు. అయితే ప్రభాస్ సెట్స్ లో అడుగు పెట్టడానికి ఇంకా టైమ్ పడుతుండటంతో సందీప్ రెడ్డి వంగ తన పరిధిలో ఉన్న పనులను పూర్తి చేస్తున్నారు.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని టాప్ డైరెక్టర్స్ కు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. అందులో సందీప్ రెడ్డి వంగ భిన్నంగా ఉంటారు. ఆయన నుంచి గతంతో వచ్చిన అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న రూల్స్ అన్నింటిని బ్రేక్ చేసి కొత్త పాత్ ను క్రియేట్ చేశారు. ఎక్కువగా క్యారెక్టరైజేషన్, ఎమోషన్, మ్యూజిక్ అండ్ బీజీఎంపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇక స్పిరిట్ చిత్రం షూటింగ్ కు ఇంకాస్తా సమయం పడుతుండటంతో స్పిరిట్ చిత్రానికి సంబంధించిన బీజీఎం వర్క్ ను మొదలు పెట్టారని చెప్పారు.
తాజాగా జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రెటీ టాక్ షోకు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పిరిట్ షూటింగ్ పై స్పందించారు. స్పిరిట్ చిత్రం బీజీఎం వర్క్ 70 శాతం కంప్లీట్ అయ్యిందని చెప్పారు. మిగితా వర్క్ త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కనీసం 5, 6 రోజులు ముందుగానే వర్క్ కంప్లీట్ అవుతుందని వివరించారు. పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ కూడా సేవ్ అవుతుందని చెప్పారు. అయితే సందీప్ రెడ్డి వంగ చిత్రాల్లో కథ, క్యారెక్టరేషన్ తోపాటు మ్యూజిక్, బీజీఎం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. సందీప్ కూడా బీజీఎం విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాబోడు.
ఈ క్రమంలో స్పిరిట్ మూవీ బీజీఎం, మ్యూజిక్ ఎలా ఉండబోతుందనేది ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారింది. మరోవైపు ది రాజా సాబ్ చిత్రం ప్రభాస్ 24వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇక 25వ చిత్రం స్పిరిట్ ను అనౌన్స్ చేశారు. దీంతో స్పిరిట్ చిత్రం ఫౌజీ కంటే ముందే రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ఫౌజీ చిత్రంలో భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయని, వాటి సీజీ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు స్పిరిట్ షూటింగే కంప్లీట్ చేయబోతన్నారంట సందీప్ రెడ్డి వంగ.


Click it and Unblock the Notifications











