రివ్యూలపై రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ ఘాటైన కామెంట్లు.. శరత్ మండవ కామెంట్ ఏమిటంటే?

ఏ సినిమాకైనా కథ బలం అని నమ్ముతాను. కథ నుంచి పక్కకు వెళ్ళను. నా వరకూ కథ ఒక దేవాలయం లాంటింది. దానికంటూ ఒక నిర్మాణం వుంటుంది. లెజండరీ దర్శకులు దాసరి నారాయణ రావు గారి మాటలు నాకు స్ఫూర్తి. ''ఒక కథ రాసేటప్పుడు ఆ కథే తనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుని పూర్తి చేసుకుంటుంది. హిట్, ఫ్లాప్ మన చేతిలో లేదు, మంచి చెడు మాత్రం మన చేతిలో ఉంటుంది అని దాసరి గారు చెప్పిన ఈ మాటలు లైఫ్‌టైం పాటిస్తాను. నేను టీం వర్క్ ని నమ్ముతాను. ఈ చిత్రంలో అద్భుతమైన టీమ్ వర్క్ ఉంది అని శరత్ మండవ చెప్పారు.

ఇటీవల రామారావు ప్రమోషన్ ఇంటర్యూలో సోషల్ మీడియాలో రూమర్లు, రివ్యూలపై శరత్ మండవ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. తన వ్యాఖ్యలపై శరత్ వివరణ ఇస్తూ..ఎవరైనా నన్ను ప్రశ్న అడిగితే.. ఆ ప్రశ్న వరకు జవాబు చెబుతాను. నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను. సినిమా అనేది 24 విభాగాలు వందల మంది సమిష్టి కృషి. కోవిడ్ సమయంలో ప్రతీ టీమ్ చాలా కష్టపడి.. మాస్కులు ధరించి సినిమా షూటింగులు చేశారు. అంత కష్టపడి సినిమా చేస్తే కొందరు మాత్రం పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.

 Sarath Mandava comments on film Reviews and critics

సినిమాను ఎండ్ టైటిల్ వరకు చూడాలని నేను అనుకొంటాను. రివ్యూలు ఇండస్ట్రీకి అవసరం. రివ్యూలు చదివి నేను చాలా నేర్చుకొన్నాను. చాలా మంది మంచి రివ్యూ రైటర్స్ తెలుగులో ఉన్నారు. రివ్యూల వల్ల మంచి సినిమాలు వస్తాయి. కానీ సినిమా పూర్తి కాకముందే సినిమా మధ్యలోనే రకరకాల కామెంట్స్ పెడుతుంటారు. బాత్రూంలోనే మొబైల్‌తో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వాటిని కంట్రోల్ పెడితే బాగుంటుందని అనుకొంటున్నాను. రివ్యూలు వల్ల చాలా నేర్చుకొన్నాను. మెజారిటీ రివ్యూవర్లు నెగిటివ్‌గా రాస్తే సినిమా కిల్ అవుతుంది అని శరత్ మండవ అభిప్రాయపడ్డారు.

సినిమా షూటింగులో ఉండగానే రకరకాల రూమర్లు రాస్తుంటారు. మా సినిమా గురించి ఎదైనా విషయం బయటకు పొక్కితే.. నా ఫోన్ నంబర్ తీసుకొని వివరాలు తీసుకొని రాయండి. అంతేగానీ.. మీకు తెలిసిందే రాయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అని శరత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X