twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ramarao on duty టైటిల్ వెనుక కారణం అదే.. కేటీఆర్ గొప్ప లీడర్.. శరత్ మండవ (Interview)

    |

    శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం Ramarao on Duty. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ చిత్రం జూలై 29న రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు శరత్ మండవ మీడియాతో మాట్లాడుతూ.. రామారావు ఆన్ డ్యూటీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రవితేజ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందించాం.

    ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు ఇన్వెస్టిగేషన్‌ చేపట్టాడనేది కథలో కొత్త పాయింట్. ఇసుక మాఫియాకు సంబంధించిన కథ కాదు. ఇసుక అనేది ప్రతీ వ్యక్తికి సంబంధించిన ముఖ్యమైన అంశం. ఒకప్పుడు అందరికి ఇసుక అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైంది. కలెక్టరేట్ పరిధిలోని అవినీతి, అన్యాయాలపై తిరుగుబాటు చేసే ప్రభుత్వ ఉద్యోగి కథ అని చెప్పారు. శరత్ మండవ ఇంకా ఈ సినిమా విశేషాలు చెబుతూ..

     ప్రస్తుత జనరేషన్‌కు కథ చెప్పడానికే

    ప్రస్తుత జనరేషన్‌కు కథ చెప్పడానికే

    ప్రస్తుత జనరేషన్‌కు చెప్పడటానికి 1990లో జరిగే టైమ్ పీరియడ్‌ నేపథ్యంగా రామారావు ఆన్ డ్యూటీ రూపొందించాం. ఎంటర్టైన్‌మెంట్‌తోపాటు ఎంగేజింగ్‌గా ఉండేలా చేశాం. కమర్షియల్ వ్యాల్యూస్ పుష్కలంగా ఉండే విభిన్నమైన కథ ఇది. రవితేజ చేసిన క్యారెక్టర్లను దృష్టి పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేశాం అని శరత్ మండవ అన్నారు.

    రామారావు పేరు పెట్టడం వెనుక

    రామారావు పేరు పెట్టడం వెనుక

    రామారావు ఆన్ డ్యూటీ నాకు రెండో సినిమా. నా మొదటి సినిమా Ko 2 తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కథకు సరిపడే బడ్జెట్ లేకపోవడం నేను చేయలేకపోయాను. విశాల్‌తోపాటు చాలా మంది హీరోలకు కథలు చెప్పా. కోవిడ్ కారణంగా నా సినిమా లేటయ్యింది. తెలుగు సమాజంలో రామారావు పేరు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

    ఆ పేరు అయితే ప్రేక్షకుడికి ఈజీగా కనెక్ట్ అవుతుందని భావించాం.రామారావు అనేది పవర్ ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీ గా ఆయన పేరు వచ్చింది. తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ హీరో.

    అలాగే కేటీఆర్ గారు కూడా గ్రేట్ లీడర్. రామారావు అనేది ఒక స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం. అందుకే ఈ పాత్రకు రామారావు అని పేరు పెట్టాను.అందుకే ఈ సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ పెట్టాం అని శరత్ మండవ తెలిపారు.

    రజీషా విజయన్ తీసుకోవడంపై

    రజీషా విజయన్ తీసుకోవడంపై

    మాలిని అనే పాత్ర గ్లామర్ కంటే ఎమోషనల్ కంటెంట్‌తో రోల్. ఈ పాత్రకు తెలుగు ప్రేక్షకులకు తెలియని హీరోయిన్‌ అయితే బాగుంటుందని అనుకొన్నాను. రజీషా విజయన్‌ను పాత్ర గురించి చెప్పినప్పుడు అంత సులభంగా ఒప్పుకోలేదు. ఆ తర్వాత తన పాత్ర వరకు స్క్రిప్టు రాసి చూపించిన తర్వాత ఆమె పాత్ర లెంగ్త్‌ చూసుకొన్న తర్వాత సరే అని శరత్ మండవ అన్నారు.

    కులకు భజన ఆధారంగా సీసా పాట

    కులకు భజన ఆధారంగా సీసా పాట

    రాయలసీమ ప్రాంతంలో చిత్తూరుకు సమీపంలోని హార్స్ లీ హిల్స్ ప్రాంతంలో కులుకు భజన చాలా పాపులర్. ఈ కాన్సెప్ట్ ని పెట్టాలని భావించాను. దానిని ఇంకా కాస్త వినోదాత్మకంగా ఉండేలా కొన్ని ట్యూన్స్ అనుకున్నాం. చంద్రబోస్ గారిని కలిసి ఈ కాన్సెప్ట్ ని చెప్పా. ఆయన కొంత సమయం తీసుకొని సీసా పాటని రాశారు. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ కావడం చాలా సంతోషంగా ఉంది అని శరత్ మండవ అన్నారు.

    ఖైదీ సినిమా చూసిన తర్వాత

    ఖైదీ సినిమా చూసిన తర్వాత

    ఖైదీ సినిమా చూసినప్పుడు శామ్ సీఎస్ మ్యూజిక్ విని చాలా థ్రిల్ అయ్యాను. ఆ సినిమా చూసిన తర్వాత శామ్ మెసేజ్ పెట్టాను. రామారావు ఆన్ డ్యూటీ సినిమా అనుకొన్నప్పుడు ఫస్ట్ లాక్ చేసిన తొలి టెక్నిషియన్ శామ్ సీఎస్. ఈ సినిమా 2 గంటల 20 నిమిషాలు. సినిమా ఎంగేజింగ్ ఉంటుంది. సినిమా నిడివి ఎక్కువగా అనిపించదు. స్క్రిప్ట్ డిమాండ్ చేసినంత మేరకు లెంగ్త్‌ను ఉంచాం అని శరత్ మండవ చెప్పారు.

    సీక్వెల్ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు

    సీక్వెల్ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు

    రామారావు ఆన్ డ్యూటీ మూవీకి సీక్వెల్ ఉండకపోవచ్చు.ఈ సినిమా కథ ఓ బర్నింగ్ ఇష్యూ. అవసరమైతే సీక్వెల్ చేయడానికి అవకాశం ఉంది.శేఖర్ కమ్ముల స్పూర్తితో ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. రాజు హిరాణి చెప్పే కథల స్పూర్తితో ఫైట్స్ లేకుండా భవిష్యత్‌లో యాక్షన్ మూవీ చేయాలని ఉంది అని శరత్ మండవ పేర్కొన్నారు.

    English summary
    Ramarao on Duty is set to release on July 26th. Here is director Sarath Mandava Interview from Filmibeat Telugu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X