twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితంలో ఒక్కసారే అలాంటి పాత్రలు.. వాటితో కలిపే పేమెంట్‌.. సత్యరాజ్ కామెంట్స్

    |

    హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 230 చిత్రాలకు పైగా నటించాడు సత్యరాజ్. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నాడు. అయితే ఈ వారం సత్యరాజ్‌కు ప్రత్యేకంగా నిలుస్తుంది. సత్యరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం దొంగ‌, ప్రతి రోజూ పండగే ఒకే రోజు రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించాడు.

    క్రెడిట్ అంతా దర్శకులదే..

    క్రెడిట్ అంతా దర్శకులదే..

    ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 230 పైగా సినిమాల్లో నటించానని, 100 సినిమాల్లో హీరోగా, 75 కి పైగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించానని తెలిపాడు. వివిద ర‌కాల‌ పాత్రలు పోషించానని పేర్కొన్నాడు. అయితే ఏ పాత్రకు ఆపాత్ర భిన్నంగా ఉంటుందన్నాడు. ఈ క్రెడిట్ అంతా నాతో పని చేసిన దర్శకులకే చెందుతుందని తెలిపాడు. మారుతున్న ట్రెండ్‌కు అనుణంగా ఈ తరం దర్శకులు నన్ను, నా నటనను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తున్నా రని సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

    అలాంటి పాత్రలు ఒక్కసారే..

    అలాంటి పాత్రలు ఒక్కసారే..

    ప్రతి ఒక్కరూ విభిన్నమైన పాత్రలు రాయడం వలనే నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్క రించుకునే అవకాశం లభించిందని అన్నాడు. ఓ నటుణ్ణి దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు రాస్తుంటే గర్వంగా ఉంటుందని పేర్కొన్నాడు ఇంతకంటే ఓ న‌టుడికి కావల్సింది ఏముంటుందని ఆనందాన్నివ్యక్తం చేశాడు ఉదాహ‌ర‌ణ‌కు 38 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాను... కానీ, ప్రస్తుతం అందరూ నా పేరు మర్చిపోయి ‘కట్టప్ప' అని పిలుస్తున్నారు.. చిన్నారులు సైతం ‘కట్టప్ప' అని గుర్తుపడుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నాడు జీవితంలో ఒక్కసారే ఇటువంటి పాత్రలు లభిస్తాయని చెప్పుకొచ్చాడు.

     వాటితో కలిపే పేమెంట్..

    వాటితో కలిపే పేమెంట్..

    అభిమానులు దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగితే చిరాకుపడకూడదని తెలిపాడు. తన దృష్టిలో యాక్టర్ అనే వాడు సెల్ఫీ, ఆటోగ్రాఫ్స్ కి ఇరిటేట్ అవ్వకూడదని.. ఎందుకంటే మనకిచ్చే పేమెంట్ అనేది వాటికి కూడా కలిపే అంటూ సరదాగా నవ్వేశాడు. తాను తమిళంలో హీరోగా నటించిన పసివాడిప్రాణం, ఆరాధన, అసెంబ్లీరౌడీ, ఎస్.పి.పరశురాం, యం ద‌ర్మ‌రాజు యంఎ. బ్రహ్మ ఇలా చాలా చిత్రాలు తెలుగులో రీమేక్ చేశారని, అన్ని సూప‌ర్‌హిట్‌గా నిలిచాయని తెలిపాడు.

    నా పాత్ర ద్వారే ట్విస్ట్..

    నా పాత్ర ద్వారే ట్విస్ట్..

    దొంగ‌ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ లో తన పాత్ర ద్వారా మెయిన్ ట్విస్ట్ ఉంటుందని సీక్రెట్ బయట పెట్టేశాడు. అది చాలా కొత్త పాయింట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని పేర్కొన్నాడు. అలాగే ప్రతి క్యారెక్టర్ కి థియేటర్స్ లో క్లాప్స్ పడేలా ఉంటాయని తెలిపాడు. తెలుగు, త‌మిళంలో రూపొందిన 'దొంగ`, తెలుగులో న‌టించిన `ప్రతి రోజూ పండగే` సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయని, రెండు పాత్రలు దేనిక‌దే భిన్నంగా ఉంటాయని అన్నాడు. ఆర్టిస్టుగా అదో సంతృప్తి అని పేర్కొన్నాడు.

    English summary
    Sathya Raj Interview About Karthi Donga Movie. He Is Coming With Back to Back Movies. His Movies Like Prathi Roju Pandage And Donga Releasing On 20th December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X