Polimera 2: చేతబడులు చేసే సినిమాలో రొమాన్సా.. నగ్నంగా ఉండి మరీ అన్ని సీన్లలో నటించాడా?
కమెడియన్ గా రాణిస్తూనే.. మంచి మంచి చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే అతడు పొలిమేర సినిమాతో అందరినీ తీవ్రంగా భయపెట్టాడు. అయితే కరోనా సయమంలో తీసిన ఆ చిత్రం ఓటీటీలో విడుదల కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈక్రమంలోనే దీనికి సీక్వెల్ గా పొలిమేర 2 ను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు మూవీ టీం. అయితే ఇందులో కూడా సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

ముఖ్యంగా పార్ట్ 1 సినిమా ఎక్కడ ముగించారో రెండో భాగం అక్కడి నుంచే ప్రారంభం అవుతుందని సత్యం రాజేష్ వివరించారు. అలాగే మొదటి భాగంలో ఏం జరిగిందో కూడా కొన్ని సన్నివేషాల్లో చూపిస్తారని.. దీని వల్ల నేరుగా పార్ట్ 2 చూసిన వారికి కూడా సినిమా అర్థం అవుతుందని అన్నారు. పొలిమేర 1 చూశాకా పొలిమేర 2 చూస్తే మరింత ఎంజాయ్ చేయొచ్చని పేర్కొన్నారు. అలాగే షూటింగ్ సమయంలో తన సన్నివేషాలు తీసేటప్పుడు తానే చాలా భయపడినట్లు వెల్లడించారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో స్మశానంలో సీన్లు తీయడం అంటే నిజంగా ఎవరికైనా కష్టమేనని అన్నారు.
అలాగే షూటింగ్ సమయంలో యూనిట్ లో చాలా తక్కువ మంది ఉన్నారని.. కొన్ని సన్నివేషాల్లో తాను నగ్నంగా నటించాల్సి వచ్చిందని సత్యం రాజేశ్ చెప్పుకొచ్చాడు. లైట్లు మొత్తం ఆర్పేసి కేవలం ఒకే లైట్ పెట్టి ఆ సీన్లను తీశారాని.. అప్పుడు చాలా భయపడుతూనే తాను నటించినట్లు స్పష్టం చేశాడు. అయితే ఈ చిత్రంలో కొన్ని భయంకరమైన సన్నివేషాలు ఉన్నాయని.. అందుకే ఏ సర్టిఫికేట్ వచ్చిందని వివరించాడు. దాని వల్ల తమ సినిమాకు ఏం మైనస్ కాదని కూడా తెలిపాడు.

తమ సినిమాను ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉంటారని.. ముఖ్యంగా హర్రర్ థ్రిల్లర్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారని సత్యం రాజేష్ వివరించారు. వారి దృష్టిలో ఉంచుకునే తాము ఈ సినిమా చేసినట్లు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు అవుతుందనే నమ్మకం తమకు ఉందని... రేపు రిలీజ్ కాబోయే పొలిమేర 2 చూశాకే ఆ విషయం అందరికీ అర్థం అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.


Click it and Unblock the Notifications











