మహేష్ బాబా? ఎవరతను? చచ్చామా లేదా? సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఇతరుల చేసే కామెంట్స్ వల్ల ఆయన కాంట్రవర్సీకి కారణమవుతుంటారు. సాధ్యమైనంత వరకు ఆయన తన పనేంటో తాను చూసుకొంటూ.. కామ్‌గా ఫ్యామిలీకి ఎక్కువగా టైమ్ కేటాయిస్తుంటారు. అయితే గతంలో తనతో నటించిన ఓ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు? సూపర్ స్టార్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కెరీర్ ఆరంభంలో కొన్ని విభిన్నమైన పాత్రలు చేశారు. హీరో ఇమేజ్‌‌కు భిన్నంగా క్యారెక్టర్లలో మునిగిపోయారు. తన వయసుకు మించిన, తగ్గిన పాత్రలతో అలరించే ప్రయత్నం చేశారు. కానీ తాను చేసిన ప్రయోగాల వల్ల తొలి నాళ్లలో ఆయనకు అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి. ఆ క్రమంలో వచ్చిన చిత్రం నిజం.

Senior Heroine Talluri Rameshwari comments on Mahesh Babu

ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్‌లో వచ్చిన మదర్ సెంటిమెంట్ చిత్రం నిజం సినిమాలో ప్రముఖ నటి తాళ్లూరి రామేశ్వరితో కలిసి మహేష్ బాబు నటించారు. తల్లి కోసం ఎంతకైనా తెగించే పాత్రలో విలక్షణ నటనను ఆయన ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు అందుకొన్నప్పటికీ.. ఆయనకు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఫలితం సానుకూలంగా రాలేకపోయింది. దాంతో ఆ చిత్ర యూనిట్‌కు మహేష్ డిటాచ్ అయిపోయారు.

ప్రస్తుతం హస్య బ్రహ్మ బ్రహ్మానందంతో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమాలో తాళ్లూరి రామేశ్వరి నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో ఆమె చురుకుగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆమె నిజం సినిమా సమయంలో జరిగిన అనుభవాలను ఆమె ఓసారి గుర్తు చేసుకొన్నారు.

Senior Heroine Talluri Rameshwari comments on Mahesh Babu

బ్రహ్మ ఆనందం సినిమా ప్రమోషన్స్‌లో మహేష్ బాబుతో అనుబంధం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఘాటైన సమాధానం ఇచ్చింది. మహేష్ బాబా? ఆయనెవరు? నేను ఉన్నానో.. చచ్చానో కూడా తెలియదు వాళ్లకి. నిజం చెప్పాలంటే వారి స్వభావం అలాంటిదే. వారి గురించి, వారితో అనుబంధం గురించి నేను ఆలోచించను అని ఆమె అన్నారు. దాంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకొని.. విదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటున్నది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా తదితరులు నటిస్తున్నారు. నిర్మాతగా కేఎస్ నారాయణ వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Read more about: mahesh babu brahmanandam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X