ఛాన్స్ వచ్చినా ఆమెతో శృంగారం చేయను.. అమ్మాయిల కంటే అంటీలే.. ఆర్జీవీ బోల్డ్ కామెంట్స్
వివాదాలు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండూ ఒకచోటే ఉంటాయి. ఆయన మాటలు, చేతలు అన్నీ కాంట్రవర్సీయే. ఆ వివాదాలతోనే ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంటూ బోల్డెంత పబ్లిసిటీ సంపాదిస్తుంటారు వర్మ. పైసా ఖర్చు లేకుండా ఆర్జీవీ తన ప్రాజెక్ట్‌లకు తెచ్చుకునే హైప్‌ని చూసి మిగతా దర్శకులు కుళ్లుకుంటూ ఉంటారు. బయోపిక్స్, కాంట్రవర్సీ సబ్జెక్ట్‌లతోనే ఆయన సినిమాలు తీస్తుంటారు. ఈ విషయంలో ఏ స్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వర్మ వినే రకం కాదు. ఒక్కోసారి ఆయన చేష్టలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
మనసులో ఒకటి, బయటి ఒకటి మాట్లాడే రకం కాదు వర్మ. ఎవరెమనుకున్నా సరే ,ఏ విషయంపై అయినా సరే ఆయన మాటలు కుండబద్ధలు కొట్టినట్లుగా ఉంటాయి. కొందరు వర్మను పిచ్చోడంటే, ఆయన అభిమానులు మాత్రం భారతదేశంలో స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను , భావప్రకటనా స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించే ఏకైక వ్యక్తి అంటూ పొగుడుతూ ఉంటారు.

ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా.. వర్మ పాపులారిటీ మాత్రం రోజురోజుకు పెరిగిపోతుందే తప్పించి తగ్గడం లేదు. ఆయన సినిమాలు తీయకపోయినా సరే అదే స్టార్‌డమ్ కంటిన్యూ అవుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. యువతలో ఆర్జీవీకి ఉన్న క్రేజ్ సామాన్యమైనది కాదు.. మొన్నామధ్య ప్రభాస్ - నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీలో వర్మ స్క్రీన్‌పై కనిపించగానే థియటర్లు దద్ధరిల్లిపోయాయి.
సెక్స్, బోల్డ్, వల్గారిటీ వంటి విషయాల్లో ఆయన చాలా ఓపెన్‌గా ఉంటారు. తన సినిమాల్లోనూ వర్మ ఈ అంశాలకు పెద్దపీట వేస్తుంటారు. ఇంటర్వ్యూలలోనూ ఎలాంటి మొహమాటం , బిడియం లేకుండా ఆ ఎలిమెంట్స్‌పై మాట్లాడగలరు. రెండేళ్ల కిందట లెస్బియన్ (ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ) కథాంశంతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ డేంజరస్ (తెలుగులో మా ఇష్టం) సంచలనం సృష్టించింది. భారతీయ సంస్కృతిలో ఇలాంటి అంశాలకు చోటు లేదని సాంప్రదాయవాదులు విమర్శించినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

అబ్బాయిలు ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారనే ప్రశ్నకు.. ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుందన్నారు. అయితే అనుభవం ఉన్న వాళ్లు ఏ రంగంలోనైనా డామినేట్ చేస్తారని , అదే సూత్రం ఇక్కడా వర్తిస్తుందని ఆర్జీవీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మియా మాల్కోవాలో నాకు బాగా నచ్చేది ఆమె అందం, బాడీ, బాడీ లాంగ్వేజ్. ఆమెతో నేను శృంగారం చేయలేదు. ఒకవేళ ఛాన్స్ వచ్చినా ఆమెతో సెక్స్ చేయను. ఎందుకంటే కొన్నిచెప్పలేని కారణాలు ఉన్నాయి. ఆమెతో అలాంటి సంబంధం లేదు అని రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











