twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విమర్శలా? ఐ డోంట్ కేర్.. ఎవరి లెక్కలు వారివి.. కబీర్ సింగ్ వివాదాలపై షాహీద్

    |

    బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్‌ నటించిన కబీర్ సింగ్‌ చిత్రం పలు వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నది. అశ్లీలత, మహిళలను కించపరిచే చిత్రంగా, మితి మీరిన హింస అంటూ సినీ విమర్శకులు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా సినీ విమర్శకులు కొందరు ఈ సినిమాపై పెదవి విరిచారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద తన జోరు సాగిస్తున్నది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్‌గా కబీర్ సింగ్ రూపొందింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ నటించగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. తాజా ఇంటర్వ్యూలో షాహీద్ కపూర్ విమర్శలకు ధీటుగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

     నా ఫెర్ఫార్మెన్స్ మాత్రమే ముఖ్యం

    నా ఫెర్ఫార్మెన్స్ మాత్రమే ముఖ్యం

    నేను ఏదైనా సినిమాల్లో నటిస్తే నా ఫెర్ఫార్మెన్స్‌కు ఎంత స్కోప్ ఉంటుందనే విషయాన్ని పట్టించుకొంటాను. కానీ నా సినిమాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఆలోచించను. నా కెరీర్ చూస్తే నా సినిమాలు ఎలా ఉంటాయనే కంటే.. నా ఫెర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా అభిప్రాయాలు వినిపిస్తాయి అని షాహీద్ కపూర్ అన్నారు.

    విమర్శలను లెక్కలోకి తీసుకోను

    విమర్శలను లెక్కలోకి తీసుకోను

    కబీర్ సింగ్ సినిమాపై వస్తున్న విమర్శలను లెక్కలోకి తీసుకొను. ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెల్లడిస్తారు. కబీర్ సింగ్ నా మొదటి సినిమా అయితే భయపడే వాడినేమో. కానీ ఇప్పటికి నేను 30 సినిమాల్లో నటించాను. ఇప్పుడు ప్రేక్షకులు నాలోని నటుడిని మాత్రమే చూస్తున్నారు. నేను నటించే సినిమాలు ఎంత వెరైటీగా ఉంటాయనే విషయాన్ని మాత్రమే పట్టించుకొంటున్నారు అని షాహీద్ తెలిపారు.

     కామెంట్లు, విమర్శలపై షాహీద్

    కామెంట్లు, విమర్శలపై షాహీద్

    కబీర్ సింగ్ సినిమాపై వస్తున్న కామెంట్లు, విమర్శలు, వివాదాలు నన్ను ఏమీ చేయలేవు. నన్ను ఏ విధంగాను నష్టపరచలేవు. ఇలాంటి కామెంట్లు మహా అంటే నెల, నెలన్నర ఉంటాయేమో.. అంత మాత్రాన వాటికి భయపడే ప్రసక్తే లేదు. ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనేది నాకు ముఖ్యం అని షాహీద్ కపూర్ పేర్కొన్నారు.

    నా ఫెర్ఫార్మెన్స్ మాత్రమే

    నా ఫెర్ఫార్మెన్స్ మాత్రమే

    నేను 2003లో ఇష్క్ విష్క్ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టాను. సుమారు ఏడు సినిమాల తర్వాత జబ్ వీ మెట్ సినిమా చూసి నా ఫెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. నా కెరీర్‌లో హైదర్, ఉడ్తా పంజాబ్, కమీనే సినిమాలు ఫెర్ఫార్మెన్స్ మీదనే ఉంటాయి. ఇప్పుడు కబీర్ సింగ్ అలాంటి ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చిత్రం అని షాహీద్ అన్నారు.

    English summary
    Starring Shahid Kapoor and Kiara Advani in the lead roles, Kabir Singh, which has entered in Rs 100 crore club in five days, has been receiving mixed responses. Shahid Kapoor responded to the controversy on Kabir Singh. The actor said that he is unfazed by the criticism.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X