సాయి పల్లవి డామినేషన్‌పై శర్వానంద్ కామెంట్.. అది ఆమెకు గాడ్ గిఫ్ట్!

గత ఐదేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న శర్వానంద్ తాజాగా పడి పడి లేచే మనసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కానున్నది. సినిమా రిలీజ్ నేపథ్యంలో శర్వానంద్ తెలుగు ఫిల్మ్‌బీట్‌తో ముచ్చటించారు. కోల్ కతా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం గురించి, సాయిపల్లవి నటన, ఇతర అంశాలను గురించి ఆయన వెల్లడించిన విషయాలు మీ కోసం..

ఆ సెంటిమెంట్ కొనసాగితే హిట్టే

ఆ సెంటిమెంట్ కొనసాగితే హిట్టే

కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన చూడాలని ఉంది, ఖుషి లక్ష్మీ సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఆ సినిమాల తర్వాత ఇప్పుటి వరకు కోల్‌కతా నేపథ్యంతో సినిమాలు రాలేదు. ఈ సినిమాకు కోల్‌కతాకు సంబంధం లేదు. కానీ ప్రేమకథకు సరిపోయేందుకు కొత్తరకంగా ఫీల్ ఉండేందుకు కోల్‌కతాను ఎంచుకొన్నాం. ఇప్పటి వరకు చూడని కోల్‌కతాను ప్రేక్షకులు చూస్తారు అని శర్వనంద్ తెలిపారు.

మెమరీ లాస్ గురించి

మెమరీ లాస్ గురించి

మెమరీ లాస్ సినిమాలో ఓ పాయింట్ మాత్రమే. దానికి కథకు పెద్దగా సంబంధం ఉండదు. మెమరీ లాస్ గురించి పెద్దగా చెప్పను. కానీ సినిమాలో ప్రేక్షకుడికి ఆశ్చర్యం కలిగించే అంశంలో అదోకటి. సునీల్ పాత్ర కూడా ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ ఉంటుంది. మురళీశర్మ, ఇతర పాత్రలు ఆకట్టుకొనేలా ఉంటాయి.

 సాయి పల్లవికి గాడ్ గిఫ్ట్

సాయి పల్లవికి గాడ్ గిఫ్ట్

సాయిపల్లవి నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె నటన చూస్తే గాడ్ గిఫ్ట్‌లా అనిపిస్తుంది. డ్యాన్సులు, ఆమెతో కెమిస్ట్రీ బాగా పడింది. తెర మీద మా జోడి చాలా అందంగా కనిపిస్తుంది. సాయిపల్లవితో నటించిన హీరోలు ఆమెపై ఫిర్యాదు చేయడం కాంట్రవర్సిగా మారేది. ఈ సినిమాలో అలాంటి సంఘటనలు నాకు ఎదురు కాలేదు.

సాయిపల్లవి డామినేట్ చేస్తుందనడం

సాయిపల్లవి డామినేట్ చేస్తుందనడం

హీరోలను సాయిపల్లవి డామినేట్ చేస్తుందనడం తప్పు. ఎవరు ఎవరిపై డామినేట్ చేయరు. పడి పడి లేచే మనసు సినిమా విషయానికి పాత్రలకు అనుగుణంగా ఇద్దరం చక్కగా బ్యాలెన్స్ చేసుకొన్నాం. పాత్రల మధ్య సమతుల్యం ఉంటేనే సినిమా బాగా ఉంటుంది. ఒకరు డామినేట్ చేస్తే సినిమా ఆడదు అని శర్వానంద్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X