ఇది సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. అవకాశాలు రాకనే.. నిరీక్షణ నటి అర్చన (ఇంటర్వ్యూ)

రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షష్టి పూర్తి. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, అర్చన కీలకపాత్రలు పోషించారు. మే 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా జంగిల్ మ్యూజిక్‌కు నటి అర్చన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన కెరీర్, సినిమాలు, సెకండ్ ఇన్నింగ్స్‌పై అర్చన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

పక్కా తెలుగు అమ్మాయిని

'తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఒడియా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించానని.. కానీ తాను బెంగాలీలో నటించానని చాలా మంది అనుకుంటారు. మా అమ్మా ఆంధ్రా అమ్మాయే, నాకు 11 నెలల వయసున్నప్పు నన్ను తీసుకుని మద్రాస్ వచ్చేసింది. తమిళనాడుకు వలస వచ్చినట్లే లెక్క. దాదాపు తమిళ భాష, సంస్కృతి, సాంప్రదాయాలకు అలవాటు పడ్డాం. కానీ అమ్మ తెలుగు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండటంతో మేమంతా తెలుగులోనే మాట్లాడుతున్నాం' అని తెలుగు భాషపై అభిమానాన్ని చాటుకున్నారు అర్చన

Shashtipoorthi Actress Archana shares why she didn t getting Offers

నాజర్ నా క్లాస్‌మేట్

'అసలు నేను ఆర్టిస్ట్‌ని అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. నాకు క్లాసికల్ డ్యాన్సర్ కావాలని ఉండేది అందుకు తగ్గట్లుగానే కథక్, భరత నాట్యం, కూచిపూడి నేర్చుకున్నా. ఎవరో ఒకరు ఉంటారు కదా.. నా పళ్లు బాగున్నాయి, కళ్లు బాగున్నాయి, యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి సినిమా పిచ్చి ఎక్కించారు. దాంతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యా.. అక్కడ విలియం గ్రీవ్స్ అనే ఒక అమెరికన్ డైరెక్టర్ ఒక వర్క్ షాప్ కండక్ట్ చేశారు. ఆ సమయంలో నాజర్, నేను క్లాస్‌మేట్స్. నాజర్ అప్పటికే ఛాంబర్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుని, 6 ఏళ్ల తర్వాత ఈ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చారు. ఒక వర్క్‌షాప్‌లో మేమిద్దరం ఓ సీన్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆ అమెరికన్ డైరెక్టర్ మా ఇద్దరిని బాలు మహేంద్ర గారి దగ్గరికి తీసుకెళ్లారు' అని తొలి రోజులను గుర్తుచేసుకున్నారు అర్చన.

నిరీక్షణ టర్నింగ్ పాయింట్

'తమిళ్‌లో బాలు మహేంద్రగారు అవకాశం కల్పిస్తే.. తెలుగులో దాసరి నారాయణరావు గారు ఓ చిన్న రోల్ ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎమ్మెల్యే ఏడుకొండలు అనే సినిమాలో చిన్న రోల్‌లో నటించా. మలయాళంలో మమ్ముట్టి, శోభనలతో బాలు మహేంద్ర తీసిన సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు నన్ను సంప్రదించారు. ఈ సినిమాలో బ్లౌజ్ లేకుండా కనిపించాలి, ఆరోజుల్లో అది ఓ సాహసం. ఆ క్యారెక్టర్‌లో పవిత్రతను మాత్రమే నేను చూశా, ఆ క్యారెక్టర్‌కు బాగా అట్రాక్ట్ అయ్యా. ఆ రోల్ నేను చేయాలని అనుకున్నానే తప్పించి, వేరే ఏది నా మైండ్‌ని డైవర్ట్ చేయలేదు' అని నిరీక్షణ సినిమా గురించి చెప్పుకొచ్చారు అర్చన.

Shashtipoorthi Actress Archana shares why she didn t getting Offers

మేకప్‌ని ఇష్టపడను

'300 నుంచి 400 సినిమాలలో నటించిన హీరోయిన్లు ఉన్నారు, చాలా సీనియర్లు ఉన్నారు, కానీ నేను 30 సినిమాలలో కూడా నటించలేదు. అలాంటిది నన్ను ఇప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారంటే నా సినిమాల గొప్పతనమే. చిన్న వయసులోనే నాకు రెండుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డ్ వచ్చింది. దాంతో ఆ కేటగిరీ తాలుకా రోల్స్‌కు నాకు అవకాశం వచ్చింది. ఒక స్టార్‌గా కాకుండా పక్కింటి అమ్మాయిలా, బాగా తెలిసిన అమ్మాయిలా కనిపించడం నాకు దేవుడిచ్చిన వరం. ఏ సినిమాకు నేను మేకప్ వాడను, కానీ షష్టిపూర్తిలో కొంచెం వాడాల్సి వచ్చింది. నా కథలు, నా సినిమాలు నేనే ఎంచుకునే దాన్ని.. నన్నెవరూ ఫోర్స్ చేసేవాళ్లు లేరు. నాకు నచ్చినవి మాత్రమే చేసుకుంటూ వచ్చాను, అర్చన ఇలాంటి మనిషి అని తెలిసిని తర్వాత అంతా నన్ను అభిమానించేవారు. రూపేశ్, ఆకాంక్షలకు తొలిరోజు నటిగా కనిపించిన నేను తర్వాత తల్లిగా మారిపోయా. ఇండస్ట్రీలో ఆడవాళ్లకు ఎదురైన ఇబ్బందులు నాకెప్పుడూ రాలేదు' అని పరోక్షంగా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు అర్చన.

షష్టిపూర్తి సంథింగ్ స్పెషల్

'షష్టిపూర్తిలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారని దర్శకుడు పవన్ ప్రభ, రూపేశ్ బాబు వచ్చి చెప్పేవరకు నాకు తెలియదు. ఏదో ఒక కమిట్‌మెంట్ ఉన్న సినిమా, చాలా ప్యాషన్‌తో చేస్తున్నారని ఈరోజుల్లో ఇలాంటి వారు ఉండటం రేర్.. అలాంటి వారిని మరింత ప్రోత్సహించాలని షష్టిపూర్తికి ఒప్పుకున్నా. ఈ సినిమాకు బాగా ఖర్చయ్యింది, రూపేశ్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. తను ఏదైతే అనుకున్నాడో దాని కోసం అన్ని సమకూర్చాడు, మేం వచ్చి నటించి వెళ్లిపోయేవాళ్లం. ఇళయరాజా, తోట తరణి వంటి వారు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారంటే ఇందులో ఏదో ఒక స్పెషల్ ఉంటుందనే అనుకున్నా' అని అర్చన పేర్కొన్నారు.

Shashtipoorthi Actress Archana shares why she didn t getting Offers

మధ్యతరగతి అమ్మాయినే

' పిరవి, దాసి సినిమాల్లో నేను భాగం కావడం నా అదృష్టం. దాసి సినిమాలో నాతో నర్సింగరావు గారు బోల్డ్ రోల్ చేయించారు. కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ ఒక డెడికేషన్‌తో, ఒక స్పిరిట్‌తో దర్శకుడు ఏం చెబితే అది చేయాలి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని, రెండు బస్సులు మారి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లే దానిని.. హీరోయిన్ అయినా నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోలేదు, కాయగూరల్ని కూడా బేరమాడే తీసుకుంటాను. అవార్డ్స్ వస్తాయి, పోతాయి.. నాకు ముందు 35 మంది నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. మనం మనంగానే ఉండాలి.. ఐడెంటిటీని ఎప్పుడూ వాడుకోవద్దు' అని అర్చన సూచించారు.

Take a Poll

భానుచందర్‌ను అన్నయ్య అనే పిలుస్తా

'భానుచందర్‌ని నేను అన్నయ్య అనే పిలుస్తాను. నేను బయటికి ఎక్కడికి వెళ్లను, డ్యాన్స్ ట్రాక్ తప్పింది. నా ఇంట్లో పనులతోనే నాకు సరిపోతుంది, కొన్నాళ్లు నటించాలని తిరిగి సినిమాల వైపు వచ్చాను. తమిళంలో బిజీగానే ఉన్నా, రీ ఎంట్రీ అనే దానిని నేను నమ్మను.. ఏదైనా రోల్ కోసం నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా చేస్తాను. ప్రతిభావంతులైన క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నా వారికి అవకాశాలు లేవు. చీర కట్టడానికి కూడా ఒక వ్యక్తి వస్తారని నేను జీవితంలో ఊహించలేదు. నేను చీర కట్టుకోవడాన్ని చూసి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అన్న మాటల్నీ సీరియస్‌గా తీసుకుని చీర కట్టుకోవడం నేర్చుకున్నా' అని అర్చన తెలిపారు.

More from Filmibeat

Read more about: archana rajendra prasad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X