‘ సౌందర్య కోసం అన్నీ వదిలేసుకున్నా... ఆ టాప్ డైరెక్టర్ దారుణంగా ’

తెలుగు చిత్ర పరిశ్రమలో శివ సినిమా ఒక సంచలనం. సినిమా మేకింగ్, కథ, కథనం, హీరోయిజం, పాటలు, నేపథ్య సంగీతం, మాటలు ఇలా ప్రతి అంశాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం శివ. సినిమాను ఇలాగే తీయాలనే పరిమితులను చెరిపేసి తనకు నచ్చినట్లుగా తీయొచ్చని, కథలో దమ్ముంటే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన చిత్రం శివ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సినిమా శివ. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీనటులు, సాంకేతిక నిపుణులకు డిక్షనరీ అనదగ్గ చిత్రాల్లో శివ కూడా ఒకటి.

శివ రీ రిలీజ్
అక్కినేని నాగార్జున, అమల జంటగా రఘువరన్, తనికెళ్ల భరణి, చిన్నా, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, సాయిచంద్, శుభలేఖ సుధాకర్, రామ్ జగన్, బ్రహ్మాజీ, ఉత్తేజ్ తదితరులు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత శివను 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో శివ సినిమాలో కీలకపాత్ర పోషించిన జితేంద్ర అలియాస్ చిన్నా ఈ కల్ట్ మూవీకి సంబంధించిన విశేషాలతో పాటు తన కెరీర్‌లోనీ కీలక విషయాలను వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..

Shiva Actor Chinna Revealed how he missed villain role in Ammoru Movie

నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు
చిన్నా అసలు పేరు.. ఆరుగుంట జితేంద్ర రెడ్డి. శివ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత మధురా నగరిలో, చైతన్య, లాఠీ, అల్లరి పిల్ల, రాత్రి, మనీ, మనీ మనీ, ఆంటీ, అల్లుడా మజాకా, మురారి తదితర చిత్రాలలో నటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగానూ చిన్నా తనదైన ముద్ర వేశారు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా అలరించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న చిన్నా.. శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

మల్లెమాల కాంపౌండ్‌లోనే మకాం
ఆర్టిస్ట్ అయ్యాక నాకు ఎప్పుడూ అవమానాలు ఎదురుకాలేదు. నాకు వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అంటే అమ్మోరు మూవీ. నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆర్టిస్ట్‌గా ట్రయల్స్ వేసేటప్పుడే రెగ్యులర్‌గా వాళ్ల ఆఫీస్‌‌లోనే ఉండేవాడిని. వేషాల కోసం ఆయన కూడా ఒకరిద్దరు డైరెక్టర్లకు కూడా రికమెండ్ చేశారు. అంకుశంలో కూడా నటించాను. శివ సక్సెస్ అయ్యాక.. నా వేషం వేసి చూసి అభినందించారు. తర్వాత మనీ, రాత్రి సినిమాలకు హీరోగా చేస్తుండగా... అప్పుడు అమ్మోరుకు ముందు ఓ ఇంగ్లీష్ సినిమా చూసి నన్ను పెట్టాలని ఫిక్స్ అయ్యారు అని చెప్పారు చిన్నా.

అమ్మోరులో ఫస్ట్ విలన్ నేనే
ఈ సినిమాకు యేలేటీ రామారావు గారు తొలుత దర్శకత్వం వహించారు. అప్పుడు నాకు కథ చెప్పి, ఇంగ్లీష్ మూవీ కూడా చూపించారు. నేను కొన్ని కొన్ని గెటప్‌లు ఎలా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ.. కొన్ని గెటప్స్ నేను వేసి చూపించా. షిండే గారని ఒక డైరెక్టర్ ఇప్పుడు లేరు.. తనేంటీ అంటే గడ్డం తీయడు, తలదువ్వడు, సిగరెట్ ఎప్పుడూ కాలుస్తూనే ఉంటాడు. షర్ట్ మాసిపోయి ఉందా? బాగుందా? అని చూసుకోడు. స్లిప్పర్స్ కూడా అరిగిపోయి ఉంటాయి. ఫుల్ షర్ట్ అయినా బటన్ కూడా పెట్టడు.. ఇలా ఉంటే బాగుంటుందని విలన్ గెటప్ గురించి వివరించా. చాలా బాగుందని అనుకున్నా.. అన్ని వర్క్స్ జరుగుతుండగా మనీ చిత్రం ఫినిషింగ్‌లో ఉండగా క్యారెక్టర్‌కు గుండు కొట్టాలని చెప్పాడని చిన్నా అన్నారు.

72 గంటలు నిద్రపోకుండా షూటింగ్
మనీ షూటింగ్‌ చివరి స్టేజ్‌‌లో ఉందని చెప్పా.. దాంతో ఆయన రాముగారితో మాట్లాడారు. అప్పటికప్పుడు రెండు షెడ్యూల్స్ పెట్టించి మనీ సినిమాను రాము గారు ఫినిష్ చేసి ఈ సినిమాకు పంపించారు. వస్తే నాకు గుండు కొట్టలేదు.. డబ్బింగ్ తప్పించి గ్రాఫిక్స్ ఇతర పనులున్నీ అయిపోయాయి. లండన్ నుంచి ఓ కెమెరామెన్ వచ్చి నెల రోజుల పాటు ఖాజాగూడ కొండ మీద క్లైమాక్స్ తీశాం. ఏడాదిన్నర పాటు చాలా కష్టపడ్డాను, చేతిలో ఏ సినిమా లేదు. ఒక గ్రాఫిక్స్ సీన్‌ కోసం నేను ఒక్కడినే పద్మాలయా స్టూడియోలో 72 గంటల పాటు నిద్రపోకుండా పనిచేశా. డబ్బింగ్‌కి ముందు సాహిత్ చేత చెప్పిద్దామా? అని అడగటంతో క్యారెక్టర్‌కి బాగుంటుంది అంటే తప్పకుండా చేద్దామని అన్నాను అని చిన్నా చెప్పారు.

రషెస్ చూసి డిజప్పాయింట్
యేలేటి రామారావుకి ఆఖరి వరకు సినిమా ఎలా వచ్చిందో రషెష్ ఎలా వచ్చిందో చూసుకునే అలవాటు లేదు. మధ్యలో ఎడిటర్ కృష్ణారెడ్డి.. ఒకసారి చూడమని చెప్పినా వినిపించుకోలేదు. ఫైనల్‌గా వేసుకుని చూశాక.. నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లమ్ లేదు. అయితే టెక్నికల్‌గా షాట్ మేకింగ్‌లో ఆయన అనుకున్న విజన్ రావడం లేదు. బాగా డిజప్పాయింట్ అయిపోయి.. ఈ సినిమాను ఏం చేయాలా? అని కోడి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్లా. ఆయన సినిమా అంతా చూసి .. చిన్నా విలన్ ఏంటీ అని అడిగారు. చిన్నా పెద్ద కామెడీ స్టార్.. దీనిని నేనేం చేయలేను అని అన్నారు. చిన్నాని మార్చేసి వేరే వాళ్లని పెట్టండి.. అతని పారితోషికం ఇప్పిస్తానని చెప్పారు.

చాలా వదులుకున్నా
మొదట అమ్మోరు సినిమాకు మంత్రాలు లాంటివి లేవు, సోషల్ మూవీగానే తీశాం. నన్ను, మదర్ క్యారెక్టర్‌గా చేసిన నాగరత్నంను కూడా తీసేసి వడివుక్కరసితో చేయించారు. ఈ దెబ్బతో నేను ఎంత డిజప్పాయింట్ అయిపోయానంటే, ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదానుకున్నా. ఈ సినిమా చూస్తుండగానే పెళ్లి జరిగింది. పెళ్లయిన రెండో రోజే షూటింగ్‌కి వెళ్లిపోయా. అయితే కొన్ని సినిమాల్లో ఆఫర్లు రావడంతో మన వృత్తి అదే కాబట్టి చేసుకుంటూ వచ్చినా ఆ బాధ వెంటాడుతూనే ఉంది. అమ్మోరు సినిమా కోసం రాము గారి గాయం కూడా వదిలేశా. ఈ బాధ వల్లే నేను చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిప్ట్ కాలేదు. దాదాపు నాలుగేళ్లు డిప్రెషన్‌లో ఉన్నానని చిన్నా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: chinna ammoru
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X