Ayalaan అయలాన్ మూవీలో ఇద్దరు హీరోలు.. 450 షాట్స్‌తో అదిరిపోయేలా.. శివ కార్తీకేయన్
సౌత్ సూపర్ స్టార్ శివ కార్తీకేయన్ నటించిన అయలాన్ సినిమా తమిళనాడులో సంక్రాంతి కానుకగా రిలీజై భారీ విజయాన్ని అందుకొన్నది. తాజాగా ఈ సినిమాను తెలుగులోకి నిర్మాత మహేశ్వర్ రెడ్డి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయలాన్ తెలుగు డబ్బింగ్ మూవీ జనవరి 26వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమంలో శివ కార్తీకేయన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అయలాన్ సైన్ ఫిక్షన్ ఆధారంగా రూపొందిన ఫాంటసీ చిత్రం. ఈ చిత్ర కథ డిమాండ్ చేయడంతో భారీగా గ్రాఫిక్స్ వర్క్ ఉపయోగించాం. దాదాపు 450 షాట్స్‌లో వీఎఫెఎక్స్ ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ప్రతీ సీన్‌లో గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. తమిళంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంటుందని నేను భావిస్తున్నాను అని శివ కార్తీకేయన్ అన్నారు.

అయలాన్ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందింది. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్, ఎమోషనల్ అంశాలు భారీగా ఉంటాయి. పిల్లలను విశేషంగా ఆలరిస్తుంది. ప్యామిలీ ఆడియెన్స్ అందరికి కనెక్ట్ అయ్యే సినిమా. రెండున్నర గంటలపాటు వినోదంతో ఆలరించే ప్రయత్నం చేస్తుంది అని శివ కార్తీకేయన్ చెప్పారు.
అయలాన్ సినిమాలో ఏలియన్ ప్రధానమైన కారెక్టర్. ఏలియన్ పాత్ర సినిమాను ముందుకు నడిపిస్తుంది. ఈ సినిమాకు ఇద్దరు హీరోలు ఉంటారు. ఒక హీరో నేనైతే..మరో పాత్ర ఏలియన్. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ. ఏలియన్, మానవుల మధ్య ఉండే కనెక్షన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని శివ కార్తీకేయన్ చెప్పారు.
తమిళంలో కంటే రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ అవుతున్నది. గతంలో తమిళంలో రిలీజైన తర్వాత ఆలస్యంగా రిలీజ్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే సినిమా ఎప్పుడు రిలీజైందనే విషయాన్ని ఎవరు పట్టించుకోరు అని శివ కార్తీకేయన్ చెప్పారు.

అయలాన్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది. ముందు నుంచే ఒక ఐడియాను అనుకొన్నాం. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ను ఇంకా భారీ స్కేల్‌లో రూపొందిస్తాం. ఈ సినిమాకు రెండితల అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తాం అని శివ కార్తీకేయన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











