ఫ్రెండ్ క్యారెక్టర్‌ కోసం వెళితే.. హీరోయిన్‌గా బంపర్ ఆఫర్.. శివానీ లైఫ్‌ను మార్చేసిన ఇన్స్‌టాగ్రామ్!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు GA2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ రూపొందిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సుహాస్ హీరోగా, నూతన నటి శివానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని నిర్మాతగా, మారుతి, వెంకటేష్ మహా సమర్పిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్ శివానీ మాట్లాడుతూ..

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రిలీజ్‌కు కొన్ని రోజులు ఉండటంతో నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నేను సినిమా చూశాను. మీకు కూడా ఈ సినిమా త్వరగా చూపించాలనే ఉత్సాహంతో ఉన్నాను. నేను ఫుల్ కాన్పిడెంట్‌గగా ఉన్నాను. ఈ సినిమా తర్వాత వచ్చే ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను అని శివానీ చెప్పారు.

Shivani Video interview about Suhas Ambajipeta Marriage Band movie

నా ఇన్స్‌టాగ్రామ్‌లో ఆడిషన్స్‌కు రమ్మని ఓ మెసేజ్ పెట్టారు. దాంతో నేను ఏదో ఫ్రెండ్ క్యారెక్టరో.. మరో క్యారెక్టర్ అనుకొని ఆడిషన్‌కు వెళ్లాను. నన్ను ఆడిషన్ చేసిన తర్వాత త్వరలోనే వివరాలు చెబుతామని అన్నారు. అయితే మళ్లీ కాల్ చేసి.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నేనే హీరోయిన్ అన్నారు. దాంతో నాకు నమ్మబుద్ది కాలేదు. సెట్‌కు వెళ్లిన తర్వాత కూడా అలాంటి ఫీలింగే ఉండేది. కానీ యూనిట్ వాళ్లు మీరే హీరోయిన్ చెప్పి కొన్పి సీన్లు షూట్ చేసిన తర్వాత నాకు నమ్మకం కుదిరింది అని శివానీ అన్నారు.

Shivani Video interview about Suhas Ambajipeta Marriage Band movie

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా షూట్ అంతా కోనసీమలో జరిగింది. దాదాపు 75 రోజులపాటు ఈ సినిమా షూట్‌లో పాల్గొన్నాను. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో టీమ్ అందరం ఓ ఫ్యామిలీలా కలిసిపోయాం. చివరి రోజు షూటింగ్ అని చెప్పగానే చాలా బాధవేసింది. చాలా ఎమోషనల్‌గా ఒకరికొకరం కనెక్ట్ అయ్యాం అని శివానీ భావోద్వేగానిక గురయ్యారు.

Shivani Video interview about Suhas Ambajipeta Marriage Band movie

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రిలీజ్ తర్వాత ఆఫర్లను ఒప్పుకొందామని అనుకొంటున్నాను. ఈ సినిమా రిజల్ట్ బట్టి నేను నా పాత్రలను ఎంపిక చేసుకొంటాను. వేచి చూసి మంచి పాత్రలను చేయాలని ఉంది. గతంలో సావిత్రి, సౌందర్య మాదిరిగా రాణించాలని ఉంది అని శివానీ చెప్పారు.

సుహాస్ మంచి నటుడు. ఆయనతో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి నటుడితో కలిసి పనిచేసినప్పుడు ఎదుటి వాళ్లలో కూడా బెటర్‌మెంట్ వస్తుంది. నేను బెటర్‌గా ఫెర్ఫార్మ్ చేయడానికి సుహస్ టాలెంట్ కూడా ఓ కారణం. శరణ్య ప్రదీప్, నితిన్ లాంటి వాళ్లు నటన ఈ సినిమాకు హైలెట్ అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X