Salaar ప్రతీరోజు సెట్లో ప్రశాంత్ నీల్ అలాంటి టార్చర్. సలార్ గురించి శ్రీయారెడ్డి

టెలివిజన్ ప్రజెంటర్‌గా, వీడియో జాకీగా, నటిగా శ్రీయారెడ్డి అందరికి తెలుసు. సమురాయ్‌తో తమిళంలో, అప్పుడప్పుడు సినిమాతో తెలుగులో తన కెరీర్ ప్రారంభించారు. కాంచీవరం సినిమాతో జాతీయ స్థాయిలో ఆమె పేరు పాపులర్ అయింది. వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరమైన ఆమె తాజాగా సుజల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సలార్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న నేపథ్యంలో శ్రీయా రెడ్డి మాట్లాడుతూ..

సలార్ సినిమా గురించి ప్రశాంత్ నీల్ చెప్పినప్పడు నేను చేయను అని వెంటనే చెప్పాను. కానీ ఆయన పట్టుదలగా నీవు చేయాలి. ఒకసారి నీవు స్క్రిప్టు విను. ఆ తర్వాత నువ్వే చేస్తావు. అప్పుడు ప్రభాస్ ఉన్నా.. ఇంకా ఎవరైనా ఉన్నా పర్వాలేదు. కానీ క్యారెక్టర్ బలంగా ఉండాలి. నా రోల్‌కు ఒక గ్రౌండ్ ఉండాలి అని కండీషన్స్ పెట్టాను. దాంతో నీవు కథ విను.. ఆ తర్వాత నువ్వే చేస్తావని అన్నాడు అని శ్రీయారెడ్డి చెప్పారు.

Shriya Reddy Interview about Salaar, Prashanth neel making, and Radha Rama Role

ఒరిజినల్ మూవీ ఉగ్రం చేసినప్పుడు అందులో రాధా రమ క్యారెక్టర్ లేదు. ఒరిజినల్ స్క్రిప్టుపై చాలా రోజులు వర్క్ చేసిన తర్వాత ప్రతి నాయకురాలి పాత్రను సృష్టించారు. తొలుత రాధా రమ అందంగా ఉండాలని అనుకొన్నారు. ఇలా క్రేజీగా, ఉగ్రరూపంలో ఉన్న మహిళగా పాత్రను తీర్చిదిద్దారు. ఒక మగాడు ఇలాంటి బలమైన క్యారెక్టర్ రాశాడంటే అతడేమిటో ఊహించుకోవచ్చు అని శ్రీయారెడ్డి చెప్పారు.

సలార్ స్క్రిప్టు వర్క్ జరిగేటప్పుడు.. నేరేషన్ చేసేటప్పుడు చాలా పోట్లాడుకొన్నాం. ప్రశాంత్ నీల్‌తో చాలా గొడవపడ్డాను. చాలాసార్లు వాదించుకొన్నాం. నా పాత్రకు సంబంధించి హెయిర్ స్టెయిల్, నగలు విషయంలో పర్టిక్యూలర్‌గా ఉండేవాడు. ముందుగా రెగ్యులర్‌గా రెండు జడలు వేసుకొనే మహిళగా డిజైన్ చేశారు. ఆ తర్వాత క్యాస్టూమ్స్, డిఫరెంట్‌గా మార్చారు అని శ్రీయారెడ్డి చెప్పారు.

Shriya Reddy Interview about Salaar, Prashanth neel making, and Radha Rama Role

స్క్రిప్టు పూర్తి కాకముందే ప్రశాంత్ నీల్ నాకు ఓ ప్రామిస్ చేశాడు. నీ రోల్‌కు చాలా ఫెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుందని చెప్పాడు. నటించడానికి నీకు మంచి ఫ్లాట్‌ఫామ్ ఇస్తానని చెప్పాడు. అలాగే ఫస్ట్ ఫోటోషూట్ చేసినప్పడు రాధ రమ పాత్రలో ఏదో విషయం ఉందని అర్ధమైంది. అప్పుడే నేను ఈ క్యారెక్టర్ నాకు చాలా పెద్ద ఆఫర్ అని రియలైజ్ అయ్యాను. ప్రతీ విషయంలో నో చెప్పినప్పటికీ.. నాతో ఈ పాత్రను చేయించాడు అని శ్రీయారెడ్డి తెలిపారు.

విభిన్నమైన పాత్రలు చేయాలనే ఎప్పుడు కోరుకొంటారు. కాంచీవరం, పొగరు లాంటి సినిమాలు ఒప్పుకొన్నాను. ఇప్పుడు సలార్ సినిమాలో రాధా రమ పాత్ర కూడా అంతే.. నేను ఎప్పుడూ కూడా ఈ పాత్రకు నేనే చేయాలి అడగలేదు. పొగరు సినిమా చూసిన తర్వాత నాతో ఈ పాత్రను చేయాలని అనుకొన్నాడట. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పారు అని శ్రీయారెడ్డి తెలిపారు.

Shriya Reddy Interview about Salaar, Prashanth neel making, and Radha Rama Role

కొన్నాళ్లు నేను సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాను. అప్పుడే నాకు ఓపిక, సహనం ఏమిటో తెలిసి వచ్చింది. కానీ మంచి సినిమా, పాత్రతో నేను హిట్ కొడుతాను అనే నమ్మకం నాలో అప్పుడే కలిగింది. గ్యాప్ తర్వాత మొదటి సినిమా చేసినప్పుడు రెండు రోజులు పాత్రలోకి వెళ్లడానికి ఇబ్బంది అయింది. కానీ సలార్ మూవీకి రోజు కష్టంగా అనిపించేది. నాకు చాలా టార్చర్ పెట్టారు. దాంతో సెట్లో అందరితో ఫైట్, గొడవ పెట్టుకొన్నాను. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం నా క్యారెక్టర్ బాగా రావాలంటే నీవు కష్టపడాలని చెప్పే వారు అని శ్రీయా రెడ్డి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X