They Calling Him OG సలార్‌ను మించి OG.. స్క్రీన్ చినిగిపోతుంది..పవన్ కల్యాణ్‌పై శ్రీయారెడ్డి షాకింగ్ కామెంట్స్
గత కొద్దికాలంగా సినిమా పరిశ్రముకు దూరమైన శ్రీయా రెడ్డి తాజాగా మళ్లీ తమిళ, తెలుగు పరిశ్రమల్లో విజృంభిస్తున్నది. తాజాగా వచ్చిన సలార్ సినిమాలో రాధా రమగా పాత్రలో సీరియస్‌గా కనిపించింది. ఆమె పాత్రకు విశేషంగా ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకొన్నది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో OG సినిమా గురించి ఆమె లీకులు ఇస్తూ..
సలార్ సినిమా తర్వాత నేను చేస్తున్న OG మూవీ అద్బుతం. ఆ స్క్రిప్టు ఏమిటి? పక్కా కమర్షియల్ మూవీ. సుజిత్ ముందు సినిమా సాహో మాదిరిగా ఉండదు. అలాగే పవన్ కల్యాణ్ ముందు సినిమాలతో ఎలాంటి పోలిక ఉండదు. ఎమోషనల్ రోలర్ కోస్టర్. 50 శాతం యాక్షన్, 50 శాతం ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసి సుజిత్ తెరకెక్కిస్తున్నారు. OG పర్‌ఫెక్ట్‌గా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది అని శ్రీయా రెడ్డి చెప్పారు.

OG మూవీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ లాంటి టాలెంటెడ్ యాక్టర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు తెర మీదకు వచ్చి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంటే స్క్రీన్ అదిరిపోతుంది. ఊహించుకోవడానికే సినిమా అందకుండా ఉంటుంది అని శ్రీయా రెడ్డి తెలిపారు.
పవన్ కల్యాణ్ సింపుల్ అండ్ స్వీట్ పర్సన్. ఆయన చాలా సెక్యుర్డ్ యాక్టర్. ఆయన కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. నాతో ఓ ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేయాల్సి ఉంది అని శ్రీయారెడ్డి చెప్పారు.

OG మూవీలో నాది నెగిటివ్ క్యారెక్టర్ కాదు. సలార్ మాదిరిగా అసలే ఉండదు. సలార్ సినిమాలో నన్ను ఓ అవతారం చూశారో.. ఓజీలో నా రోల్ చూసి ప్రతీ ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో పవన్ కల్యాణ్‌తో నాకున్న రిలేషన్ ఏమిటో చెప్పను. కానీ ఉమెన్ ఎంపవర్ ఉన్న క్యారెక్టర్ నాది. ఆ సినిమా రిలీజ్ తర్వాత నా గురించి ఏం మాట్లాడుతారో ఊహించుకొంటే కష్టంగా ఉంది అని శ్రీయారెడ్డి తెలిపారు.
సలార్ సినిమా నాకు మంచి సంతృప్తిని ఇచ్చింది. ఓజీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా పెద్ద సంతృప్తిని ఇస్తుంది. సలార్ 2, ఓజీ తర్వాత ఇక నేను నటించను. ఇండస్ట్రీ నుంచి రిటైర్‌మెంట్ తీసుకొంటాను. నటిగా నాకు అంతకంటే సంతృప్తి మరో పాత్రలో లభించదనే ఫీలింగ్ కలుగుతున్నది.


Click it and Unblock the Notifications











