Shriya Saran పిల్లలకు మార్కులే సర్వస్వం కాదు.. ఇళయరాజాను చూసి అలా భయపడ్డా.. శ్రీయా సరన్ (ఇంటర్వ్యూ)
అందాల తార శ్రీయా సరన్ నటించిన లేటేస్ట్ మూవీ మ్యూజిక్ స్కూల్. మ్యూజిక్, సాంగ్, డ్రామా ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా పాపారావు బియ్యాలా వ్యవహరించారు. హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీయా సరన్‌తోపాటు శర్మాన్ జోషి, ప్రకాశ్ రాజ్, వినయ్ వర్మ, లీలా శాంసన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా మే 12 తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీయ సరన్ మాట్లాడుతూ..
ఇండియన్ సినిమాలో పాటలు: మ్యూజిక్ స్కూల్ సినిమా డిఫరెంట్ మ్యూజికల్ కాన్సెప్ట్ మూవీ. ఇప్పటికే ఎన్నో సినిమాలకు స్పూర్తిని మ్యూజిక్ ఇచ్చింది. రూరల్ ఏరియాలో మ్యూజిక్ డ్యాన్స్ షోల నేపథ్యంలో సాంగ్స్ డ్రామాగా సినిమా సాగుతుంది.

ప్రతీ ఇండియన్ సినిమాలో ఆరు పాటలు సర్వసాధారణం. ప్రతీ సాంగ్ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. సిచ్యుయేషనల్‌గా ఉంటాయి. ఈ సినిమాలో ఇళయరాజా మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. పాటలు ఈ సినిమాలో భాగంగా ఉంటాయి. మ్యూజిక్ చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది అని శ్రీయా సరన్ అన్నారు.
ఇళయ రాజాను చూసి అలా భయపడ్డా: మ్యూజిక్ స్కూల్ సినిమాలో పాటల విషయం కొంత ఆందోళనకు గురయ్యాను. పాటలు పాడటం గురించి భయమేసింది. ఈ పాట సమయంలో ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చినప్పుడు నిజంగానే భయమేసింది. సాంగ్, మ్యూజిక్ క్రియేట్ చేసినప్పుడు కెమెరా, ట్రాలీ పనితీరు చాలా బాగుంది. సౌండ్ ఆఫ్ ది మ్యూజిక్ ఓ షో లేదా ప్లే మాదిరిగా సాగుతుంది అని శ్రీయ సరన్ తెలిపారు.

చదువు ఒక్కటే కాదు.. మ్యూజిక్, సాంగ్స్ కూడా: నేనున్నాను సినిమా సమయంలో నాకు మ్యూజిక్ టీచర్ ఉంది. ఈ సినిమా గోవా నుంచి హైదరాబాద్‌కు ట్రావెల్‌తో సాగుతుంది. తమ పిల్లలకు మ్యూజిక్, సాంగ్స్ నేర్చుకోవడం కంటే.. చదువులో మార్కులు కోసమే ఒత్తిడి చేస్తారు. స్పోర్ట్స్, మ్యూజిక్ నేర్చుకొంటే మర్యాద తెలుస్తుంది. పెద్దలను గౌరవించడం నేర్చుకొంటాం. మ్యూజిక్ ద్వారా మానసిక ఒత్తిని నుంచి పిల్లలను దూరం చేయవచ్చు అని శ్రీయ సరన్ చెప్పారు.

పిల్లలకు ఒక డ్రీమ్ ఉంటుంది: ప్రతీ పిల్లాడికి, అమ్మాయికి జీవితంలో డ్రీమ్ ఉంటుంది. ప్రతీ చిన్నారికి వారికి ప్రతిభ, స్థోమత ఉంటుంది. వాటిని బయటకు తీస్తే వారికి మంచి జరుగుతుందని సమాజానికి చిన్న సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సందేశం ఇస్తే అది డాక్యుమెంటరీగా మారుతుంది. నిర్మాత పాపారావు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. నేను ఒక పేరెంట్‌గా చాలా ఒత్తిడికి గురవుతున్నాను.

పక్కా కమర్షియల్‌గా: మ్యూజిక్ స్కూల్ సినిమా పక్కా కమర్షియల్‌గా ఉంటుంది. ఇళయరాజా మ్యూజిక్. రాజు మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ ఉంది. పిల్లలకు ట్రైనింగ్ విషయంలో వినయ్ వర్మ యాక్టింగ్ కోచ్‌గా పనిచేశారు. యాక్టర్‌గా మారిన తర్వాత కూడా మ్యూజిక్ నేర్చుకొన్నాను. సమయం దక్కినప్పుడల్లా నేను ఏదో ఒకటి నేర్చుకొంటూనే ఉన్నాను. కానీ నాకు మ్యూజిక్ స్కూల్ పెట్టాలనే ఆలోచనల లేదు. మ్యూజిక్ స్కూల్ సినిమాకు దిల్ రాజు మంచి సపోర్ట్ చేస్తున్నారు అని శ్రీయా సరన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











