RX 100 ఇంటెన్సివ్ లవ్‌స్టోరి.. డైరెక్టర్ అద్భుతంగా తీశారు.. సింధూరపువ్వు రాంకీ

By Rajababu

Recommended Video

ఆర్ఎక్స్ 100 : సింధూరపువ్వు రాంకీ ఇంటర్వ్యూ

సింధూరపువ్వు చిత్రంలో లవర్ బాయ్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన రాంకీ చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన RX 100 అనే చిత్రంలో నటించారు. కథ, పాత్ర నచ్చడంతోనే ఈ చిత్రంలో భాగమయ్యానని ఆయన తెలిపారు. టెక్నికల్‌గా ఈ చిత్రం బ్రహ్మండంగా ఉంటుందని రాంకీ వెల్లడించారు. జూలై 12న రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో రాంకీ ఈ చిత్రానికి సంబంధించిన, వ్యక్తిగత జీవితానికి చెందిన విషయాలను పంచుకొన్నారు. రాంకీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

దర్శకుడు ఏదైతే చెప్పాడో..

దర్శకుడు ఏదైతే చెప్పాడో..

RX 100 కథ తీసుకొని నా వద్దకు వచ్చారు. కథ విన్న తర్వాత వెంటనే ఆ పాత్రను చేయాలనుకొన్నాను. కొందరు కథను అలా ఇలా అని చెబుతారు. కానీ షూటింగ్‌‌కు వచ్చిన తర్వాత చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది. అలాంటి సమయంలో యాక్టర్లు కాంప్రమైజ్ అయితే వారికి ఉన్న ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కానీ RX 100 దర్శకుడు అజయ్ భూపతి ఏదైతో చెప్పాడో అది తీశాడు.

అనుభవం ఉన్న డైరెక్టర్‌గా

అనుభవం ఉన్న డైరెక్టర్‌గా

దర్శకుడు అజయ్ భూపతి పనితీరు చూసి మొదటి రోజే ఇంప్రెస్ అయ్యాను. ఏదైతె చెప్పాడో అలానే తీశాడు. రాంగోపాల్ వర్మ వద్ద సహాయకుడిగా పనిచేసిన ఆయనకు RX 100 చిత్రం తొలి ప్రయత్నం. కానీ 30 చిత్రాలు అనుభవం ఉన్న దర్శకుడిగా ప్రతిభను చాటుకొన్నారు. కొన్ని సినిమాల్లో క్లైమాక్స్‌లోనే రెండు కెమెరాలు ఉపయోగించరు. కానీ ఈ చిత్రానికి సంబంధించి ప్రతీ సీన్‌లోను ఐదు కెమెరాలు ఉపయోగించారు.

 నన్ను బాగా కంట్రోల్ చేశాడు

నన్ను బాగా కంట్రోల్ చేశాడు

దర్శకుడు అజయ్ భూపతి కథపై సుమారు రెండేళ్లు కసరత్తు చేశారు. RX 100 చిత్ర కథ అంతా సినిమాగా అతడి మైండ్‌లో ఉంది. ఏ క్యారెక్టర్‌ను ఎలా చేయించుకోవాలో అతడికి తెలుసు అని నేను నిర్ణయించుకొన్నాను. నా తరహాలో నేను చేసుకుంటూ పొతుండటంతో అలా కాదు.. ఇలా కాదు.. అని ఎలా కావాలో అలా చెప్పి చేయించుకొన్నారు. నాపై పూర్తిగా కంట్రోల్ సాధించాడు. నాలోని కొత్త నటుడిని ఆవిష్కరించారు.

నేటివిటీ ప్రేమ కథ

నేటివిటీ ప్రేమ కథ

RX 100 సినిమా చక్కటి ప్రేమ కథ. నేటివిటితో కూడిన లవ్ స్టోరి. అలా అని రొటీన్ లవ్ స్టోరి కాదు. చాలా ఎమోషనల్‌ స్టోరి. వాస్తవ సంఘటన‌ను అతడు కథగా అల్లుకొన్నాడు. ఎవరిని నొప్పించకుండా కథను తెరకెక్కించాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటారో అని చాలా బోల్డుగా చెప్పిన సినిమా RX 100.

 గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్

గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్

RX 100 చిత్రంలో హీరోకు గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఓ ఫ్రెండ్ కుమారుడిని చాలా ఇష్టంగా ప్రేమించే వ్యక్తి పాత్రను పోషించాను. ఈ చిత్రంలో నేను బ్రహ్మచారిని. పెళ్లికాదు. హీరో కోసం నేను ఏం చేశానన్నదే నా పాత్ర స్వరూపం ఉంటుంది. సెకండాఫ్‌లో నా పాత్ర చాలా ఇంటెన్సివ్‌గా ఉంటుంది.

టెక్నికల్‌గా RX 100 రిచ్

టెక్నికల్‌గా RX 100 రిచ్

జాతీయ అవార్డు సొంతం చేసుకొన్న ప్రవీణ్ ఎడిటర్‌గా పనిచేశారు. సినిమాటోగ్రాఫర్‌గా రామిరెడ్డి వ్యవహారించారు. అద్భుతమైన విజ్వువల్స్ ఇచ్చాడు. ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక బాగుంది. రావు రమేష్, పాయల్ రాజ్‌పుత్, హీరో కార్తికేయ బాగా నటించారు. సినిమా రిలీజ్ తర్వాత కార్తీకేయ బిజీగా మారడం ఖాయం. నిర్మాత అశోక్ రెడ్డి కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. సినిమా రిలీజ్‌కు ముందే నాకు మొత్తం పారితోషికం ఇచ్చేశారు.

సినిమాలకు ఎందుకు దూరంగా

సినిమాలకు ఎందుకు దూరంగా

టెలివిజన్ ఇండస్ట్రీలో బిజీగా ఉండటం, డైరెక్షన్, మ్యూజిక్ లాంటి విషయాల్లో తలమునకలై ఉండటం వల్ల సినిమాలకు దూరంగా ఉన్నాను. ఇక నుంచి సినిమాలపై దృష్టిపెడుతాను. త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాను. కథ, క్యారెక్టర్‌ నచ్చితే ఎలాంటి పాత్రనైనా పోషించడానికి సిద్దం. తమిళంలో, తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను.

 నిరోషాతో చక్కగా దాంపత్య జీవితం

నిరోషాతో చక్కగా దాంపత్య జీవితం

నిరోషాతో దాంపత్య జీవితం చక్కగా ఉంది. పెళ్లికి ముందు మేమిద్దరం ఎనిమిది చిత్రాల్లో నటిస్తే ఏడు 100 రోజులు ఆడాయి. పెళ్లి తర్వాత నేను ఆస్ట్రేలియాకు, శ్రీలంకకు వెళ్లడంతో పరిశ్రమతో గ్యాప్ ఏర్పడింది. నిరోషా ప్రస్తుతం రాధిక శరత్ కుమార్‌తో కలిసి రాడాన్ బ్యానర్లో సీరియల్స్ నటిస్తున్నారు. త్వరలోనే నిరోషా, రాధిక కలిసి ఓ సినిమాలో నటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X