twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా నన్ను బాడీ షేమింగ్ చేశారు... అందుకే అలా ఘాటుగా స్పందించా.. ప్రియాంక జవాల్కర్

    |

    టాక్సీవాలా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ప్రియాంక జవాల్కర్‌కు అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. అనంతపురం జిల్లాకు చెందిన ప్రియాంక తెలుగు అమ్మాయిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. అయితే లాక్‌డౌన్‌లో రెండు సినిమాలు చేయడం, అవి విడుదలై సక్సెస్ సాధించడంతో ఇప్పుడు ప్రియాంక తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ గర్ల్‌గా మారింది. అయితే తనను బాడీ షేమింగ్ గురించి ప్రియాంక చెప్పిన విషయాలు, తన కెరీర్ గురించి వెల్లడించిన విషయాలు మీ కోసం..

    2020లో లాక్‌డౌన్ కారణంగా

    2020లో లాక్‌డౌన్ కారణంగా

    లాక్‌డౌన్ తర్వాత తిమ్మరుసు, SR కల్యాణమండపం సినిమాలు వరుసగా రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. 2019లో ఒక సినిమా చేశాను. 2020లో రెండు సినిమాలు చేశాను. వాస్తవానికి గతేడాది SR కల్యాణమండపం మూవీ రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ కారణంగా రిలీజ్ కాలేదు. ఇప్పుడు రిలీజ్ అయి మంచి టాక్‌తో ముందుకెళ్లడం ఆనందంగా ఉంది. చాలా రోజులు పడిన టెన్షన్ కాస్త రిలీఫ్‌గా మారింది అని ప్రియాంక జవాల్కర్ అన్నారు.

    లాక్ డౌన్ తర్వాత రెండు హిట్లు రావడం హ్యాపీగా ఉంది..

    లాక్ డౌన్ తర్వాత రెండు హిట్లు రావడం హ్యాపీగా ఉంది..

    తిమ్మరుసు, SR కల్యాణమండపం రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ బాగా ఉంది. తిమ్మరుసు సినిమాకు రిలీజ్ రోజే హిట్ టాక్ వచ్చింది. కానీ SR కల్యాణమండపం తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లు భారీగా ఉండటం సంతోషంగా ఉంది. రాయలసీమలో కలెక్షన్లు భారీగా నమోదు అవుతున్నాయి. SR కల్యాణమండపం హిట్ కావడం మరింత హ్యాపీగా ఉంది. రెండు సినిమాలు హిట్లుగా మారిన నేపథ్యంలో ఓ వైపు ఆనందం.. మరోవైపు బాధ్యతతో టెన్షన్ పడుతున్నాను అని ప్రియాంక జవాల్కర్ పేర్కొన్నారు.

    గమనం సినిమాతో మంచి గుర్తింపు లభిస్తుంది...

    గమనం సినిమాతో మంచి గుర్తింపు లభిస్తుంది...

    లాక్‌డౌన్‌లో చాలా సమయం ఉండటంతో బాగా చిల్ అయ్యాను. ఆ సమయంలో చాలా సినిమాల కథలు విన్నాను. దాదాపు 25 కథలు వరకు విన్నాను. అందులో బాగా నచ్చిందే గమనం సినిమా. గమనం సినిమా షూటింగ్ పూర్తి కావొస్తున్నది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ కానున్నది. గమనం సినిమా నాకు మంచి గుర్తింపునిస్తుందనే భరోసాను ప్రియాంక జవాల్కర్ వ్యక్తం చేశారు.

    నన్ను బాడీ షేమింగ్ చేస్తే

    నన్ను బాడీ షేమింగ్ చేస్తే

    తిమ్మరుసు సినిమాలో ముద్దుగానే కాకుండా బొద్దుగా కనిపించారనేది నిజమే. కానీ ఆరోగ్య సమస్యల కారణంగానే కొంచెం బరువు పెరిగాను. ఆ సమయంలో కొందరు నాపై నెగిటివ్ కామెంట్లు చేశారు. అందుకే నేను మోడల్‌ను.. యాక్ట్రెస్ కాను అంటూ ఎమోషనల్‌గా తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాను. అందుకే నా గురించి నేను చెప్పుకోవాల్సి వచ్చింది. కెరీర్ పరంగా నా కంటే ఎవరు నా ఆరోగ్యంపై దృష్టి పెడుతారు చెప్పండి. షూటింగులో సడెన్‌గా నాకు ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు చేయించుకొన్నాను. దాంతో థైరాయిడ్, ఇన్సులిన్‌కు సంబంధించిన ఇష్యూస్ బయటపడ్డాయి. వైద్యుల సలహాలతో వాటిని సరిద్దుదుకొన్నాను. దాంతో మళ్లీ సన్నబడ్డాను అని ప్రియాంక జవాల్కర్ పేర్కొన్నారు.

    Recommended Video

    Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
    సన్నగా ఉంటే మంచిది అంటూ..

    సన్నగా ఉంటే మంచిది అంటూ..

    హీరోయిన్లు సన్నగా ఉండాల్సిందేనా అంటే.. కెమెరాలో వాస్తవంగా కనిపించే దానికంటే కొంచెం ఎక్కువగా లావుగా కనిపిస్తాం. అందుకే కొంత సన్నగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే పాత్రలను బట్టి.. సన్నగా ఉండాలా? వద్దా అనేది అనేది వ్యక్తిగతం. సన్నపడటానికి కీటో డైట్ ట్రై చేశాను. షుగర్ తినకుండా ఉన్నాను. అందుకే షుగర్ గురించి నేను సోషల్ మీడియాలో పెడితే వైరల్ అయ్యింది. చాలా కష్టపడి బరువు తగ్గాను అని ప్రియాంక జవాల్కర్ తెలిపారు.

    English summary
    Priyanka Jawalkar speaks about her two successful movies which release after second wave. She is very happy about Thimmarusu, SR Kalyanamandapam become hit. She says I have crush on Allu Arjun! but Vijay Deverakonda is very chill guy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X