38 ఏళ్ల ప్రయాణం.. 38 సినిమాలతో అలాంటి తృప్తి అనుభూతి.. దీపావళీ మూవీ గురించి స్రవంతి రవికిషోర్

తెలుగు సినిమా పరిశ్రమలో లేడీస్ టైలర్, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి కల్ట్ సినిమాలను అందించిన నిర్మాత స్రవంతి రవి కిషోర్. టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఆయనకు ఓ పేజీ ఉంది. కథ, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే అలాంటి అగ్ర నిర్మాత తాజాగా దీపావళీ అనే చిన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎమోషన్స్‌తో హృదయాన్ని భారంగా మార్చే దీపావళీ సినిమా నవంబర్ 11వ తేదీన రిలీజ్ అవుతున్న సందర్భంగా స్రవంతి రవి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ..

సినిమా రంగంలో నా ప్రయాణం 38 ఏళ్లు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే.. సక్సెస్‌ఫుల్‌గా సాగింది. మంచి తృప్తిని ప్రేక్షకులకు కలిగించే సినిమాలు తీశామనే సంతృప్తి నాకు ఉంది. ఒకట్రెండ్ సినిమాలు తప్పితే అన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి. ఆర్థికంగా కొన్ని, మంచి సినిమాలు తీశామనే తృప్తితోనే నా ప్రయాణం సాగుతున్నది. చాలా సినిమాల స్క్రిప్టులు చేసి.. నచ్చకపోతే ఆపివేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే స్పీడ్‌గా సినిమాలు చేయడం లేదు. నచ్చిన స్క్రిప్టులతోనే సినిమాలు చేస్తున్నాను. ఆడియెన్స్‌కు నచ్చే సినిమాలే తీయాలన్నది నా కోరిక అని స్రవంతి రవికిశోర్ అని అన్నారు.

Sravanthi Ravi Kishore interview about 38 years journey in tollywood and Deepavali movie

సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా నేను అనిపించుకొన్నప్పటికీ.. 38 సంవత్సరాల్లో 38 సినిమాలు చేయడానికి తృప్తిని కలిగించే కథలు దొరకకపోవడమే. క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇవ్వాలనే సిద్దాంతంతో ట్రావెల్ చేస్తున్నాం. ఒకసారి ఒకే స్క్రిప్టుపై పనిచేస్తాం. రెండు పడవలపై ప్రయాణం చేయడం నాకు ఇష్టం ఉండదు అని రవికిషోర్ తెలిపారు.

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో మేకింగ్ స్టయిల్ మారింది. స్క్రిప్టు లేకుండా సినిమాలు తీస్తున్నారనే మాట వినిపిస్తున్నది. మా వరకు స్క్రిప్టు లేకుండా ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేదు. ఒక ముందు కూడా అలాంటి సాహసానికి పూనుకోం. సినిమా పరిశ్రమలో నిర్మాతలకు క్రియేటివ్‌ సైడ్‌లో అనుమతి ఇవ్వడం లేదంటే.. నా వరకు నేను నా కథలో భాగం కావాలని అనుకొంటాను. నా టీమ్‌తో కలిసి వర్క్ చేస్తాను. నాకు సినిమా తప్ప మరో బిజినెస్ లేదు అని స్రవంతి రవికిషోర్ అన్నారు.

Sravanthi Ravi Kishore interview about 38 years journey in tollywood and Deepavali movie

కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకుల్లో భాషా భేదం లేదు. అన్ని భాషల సినిమాలను అందరూ ఆదరిస్తున్నారు. మలయాళ, తమిళ, ఇతర భాషల సినిమాలకు సంబంధించిన సరిహద్దులు చెరిగిపోయాయి. దీపావళీ సినిమా తర్వాత చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాం అని స్రవంతి రవికిషోర్ తెలిపారు.

ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ హవా కొనసాగుతున్నది. పాత సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఆ క్రమంలోనే రఘువరన్ బీటెక్ సినిమాను రీ రిలీజ్ చేస్తే మంచి ఆదరణ లభించింది.మా బ్యానర్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి చేసిన నువ్వు నాకు నచ్చావు సినిమాను వచ్చే ఏడాది రీ రిలీజ్ చేస్తాం అని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాలన్నది నా కోరిక. ప్లాన్ చేస్తే జరిగేది కాదు. అన్ని కుదిరితే తప్పా సినిమా సెట్‌పైకి వెళ్లడం కష్టం. త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X