Video Interview: పురుషాంగం, వృషణాలు వణికిపోతాయి.. శ్వాగ్‌లో ఆ డైలాగ్స్ ఎందుకంటే?.. శ్రీ విష్ణు వివరణ
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ శ్వాగ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీ విష్ణు ఫిల్మీబీట్ తెలుగుతో మాట్లాడుతూ..
దర్శకుడు హసిత్ గోలికి సాహిత్యంపై మంచి పట్టు ఉంది. వినోదాన్ని జోడించి సులభంగా కథను ఎమోషనల్‌గా రాస్తారు. భావోద్వేగంతో కూడిన కంటెంట్ ఉన్న సినిమా శ్వాగ్. ఇలాంటి కథలు స్క్రీన్ మీద అరుదుగా వస్తాయి. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. ప్రస్తుత తరంలో వస్తున్న మార్పు, లింగ వివక్షకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అని శ్రీ విష్ణు తెలిపారు.

శ్వాగ్ మూవీలో కథను బట్టి డైలాగ్స్ రాశారు. అందుకే ఆడియెన్స్‌ను ప్రిపేర్ చేయడానికి, యూత్‌ను కనెక్ట్ చేయడానికి ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌ను స్వేచ్చ తీసుకొని రాశాం. నీ పురుషాంగానికి పాకులాట ఎక్కువ.. వృష్ణణాలు వణికిపోతాయి అనే మాటలు సందర్భోచితంగా చెప్పాం. అందులో ఎలాంటి దాపరికం లేకుండా ట్రైలర్‌లో పెట్టి సినిమా గురించి క్లారిటీ ఇచ్చా అని శ్రీ విష్ణు అన్నారు.
దర్శకుడు ఈ స్టోరీని ప్రతీ ఒక్కరికి అర్ధం అయ్యేలా డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సినిమా తొలి భాగంలో ఎలాంటి లోపాలు లేకుండా క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నారు. ఇంటర్వెల్ వరకు థ్రిల్లింగ్‌గా, కొన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. కథలో మెయిన్ పాయింట్ చెప్పిన తర్వాత మంచి ఎమోషన్స్‌తో సాగుతుంది అని శ్రీ విష్ణు అన్నారు.
ఈ సినిమాలో మీరా జాస్మిన్, రీతూ వర్మ, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్ హీరోయిన్లుగా నటించారు. మీరా జాస్మిన్‌ది కీలకమైన పాత్ర. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ.. పరిణితితో కూడిన నటన ప్రదర్శించారు. చాలా అందంగా కనిపిస్తారు. మొదటి సినిమాలో చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు అని శ్రీ విష్ణు చెప్పారు.


Click it and Unblock the Notifications











