ఆ భాషలో నటిస్తే.. ప్రపంచంలో ఎక్కడైనా బతుకొచ్చు.. మీసం తీప్పనున్న శ్రీ విష్ణు
మెంటల్ మదిలో చిత్రంతో మంచి ఇమేజ్‌ను కూడగట్టుకొన్న శ్రీవిష్ణు, సత్నా టైటస్ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న నీది నాదే ఒకే కథ చిత్రం మార్చి 23న రిలీజ్ సిద్ధమవుతున్నది. కవి, సినీ రచయిత వేణు ఊడుగుల తొలిసారి దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. అరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై హీరో నారా రోహిత్ ఈ చిత్రానికి నిర్మాతగా వహిస్తున్నారు. నీది నాది ఒకే కథ చిత్రం సెన్సార్ పనులు మార్చి 19 తేదీన పూర్తయ్యాయి. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సందర్భంగా అధికారులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. మెంటల్ మదిలో చిత్రం తర్వాత శ్రీ విష్ణు నటించిన తదుపరి చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

మిడిల్ క్లాస్ పాత్రలతో..
మధ్య తరగతి యువకుడి పాత్రలు చేయడం వల్ల కెరీర్‌కు ఏ మాత్రం ప్రమాదం ఉండదు. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అలాంటి పాత్రల్లో నటించడం ద్వారా ప్రేక్షకులకు తొందరగా దగ్గరవుతాం.

పలు రకాల గెటప్స్‌లో
నీది నాది ఒకే కథ సినిమా తర్వాత మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాను. వీరభోగ వసంతరాయలు, తిప్పరా మీసం, మరో పోలీస్ కథను ఒప్పుకొన్నాను. వీరభోగ వసంతరాయలు సినిమాలో నాతోపాటు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయ నటిస్తున్నారు. చాలా రకాల గెటప్స్‌లో కనిపిస్తాను.

తిప్పరా మీసం గురించి
తిప్పరా మీసం టైటిల్ నా ఇమేజ్ ఏమాత్రం ఇబ్బంది కాదు. మగవాళ్లందరికీ మీసాలు ఉంటాయి. కానీ వాటిని ఎలాంటి పరిస్థితుల్లో తిప్పాల్సి వస్తుంది.. ఎందుకు తిప్పాలి అనేది చిత్ర కథ. చాలా ఆసక్తిగా ఉంటుంది.

నాకు కోపం ఎక్కువ.. కొట్టేశాను
తెర మీద కనిపించినట్టుగానే నేను చాలా నెమదస్తుడిని అనుకొంటారు. కానీ నాకు కోపం ఎక్కువ. అందుకే క్రికెట్ ఆడటం మానేశాను. క్రికెట్ ఆడేటప్పుడు క్యాచ్ వదిలేస్తే నేను కొట్టిన సందర్భాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి అల్లరిలో నేనే టాప్. కానీ ఆ తర్వాతే మారిపోయాను.

మలయాళంలో నటించా
తమిళ, మలయాళ, కన్నడ రంగాల్లో ఆఫర్లు వస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంలో నటించాను. మలయాళంలో నటించడం చాలా కష్టమైంది. మలయాళ భాష వస్తే ప్రపంచంలో ఏక్కడైనా బతుకవచ్చు. మలయాళ సినిమా షూటింగ్‌లో స్లిప్పులు రాసుకొని నటించాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











