నేను కలిసి పని చేసిన వారిలో ఆమె బెస్ట్.. చాలా ఫాస్ట్‌గా చేసేస్తారు.. శ్రీ విష్ణు కామెంట్స్
ప్రతీ సినిమాకు ఎంచుకునే కథల్లో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు హీరో శ్రీ విష్ణు. చివరగా బ్రోచేవారెవరురా అనే చిత్రంతో పలకరించి మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మూవీ విడుదలై చాలా రోజులు అవుతున్నా మరో ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా సమయమే తీసుకున్నాడు. తిప్పరా మీసంతో ఈ వారం ఆడియెన్స్‌ను మెప్పించేందుకు వస్తోన్న శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
బ్రోచేవారెవరురా మూవీ జూన్ లో వచ్చింది. వెంటనే మరో మూవీ విడుదల చేయడం ఎందుకు అనే ఆలోచనతో పాటు, సాహో, సైరా వంటి పెద్ద చిత్రాల విడుదల కూడా ఉండటంతో రిలీజ్ ఆపడం జరిగిందని పేర్కొన్నాడు. ప్రొడక్షన్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న టైంకే పూర్తయ్యాయని తెలిపాడు.

బ్రోచేవారెవరురా మూవీకి ముందే తాను నాలుగు ప్రాజెక్ట్స్ కమిట్ ఐయ్యానని.. కాబట్టి ఆ చిత్రాల విషయంలో రెమ్యూనరేషన్ పెంచమని అడుగలేదని తెలిపాడు. ఇకపై చేసే చిత్రాలకు పెంచుతానేమోనని చెప్పుకొచ్చాడు. మదర్ సెంటిమెంట్ తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కంటెంట్ కలిగిన కథ ఇదని తెలిపాడు. హీరో పాత్ర సరికొత్త ఆట్టిట్యూడ్ కలిగి భిన్నంగా ఉంటుందని, అలాగే సినిమాలో తన చర్యలు నవ్వుకూడా తెప్పించేవిగా ఉంటాయని పేర్కొన్నాడు.
ఈ చిత్రంలో సీనియర నటి రోహిణి నా మదర్ పాత్రను పోషించారు.. ఆమె ఒక్క టేక్ లో చాలా ఫాస్ట్ గా చేసేస్తారు.. సీనియర్ అని మొదటి కొంచెం భయం వేసింది.. ఐతే ఆమెతో పరిచయం ఏర్పడ్డాక ఆ భయం మొత్తం పోయిందని తెలిపాడు. తాను ఇప్పటివరకూ కలిసి పనిచేసిన నటులలో ఆమె బెస్ట్ అని చెప్పగలనని అన్నాడు.


Click it and Unblock the Notifications











