twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ ఆదర్శం.. ఆయనను చూసి.. నేను మాస్ హీరోనా? బయట తిరగాలంటే సిగ్గేస్తుంది: శ్రీ విష్ణు

    By Rajababu
    |

    Recommended Video

    అది అంత ఆషా మాషీ విషయం కాదు...!

    శ్రీవిష్ణు, సత్నా టైటస్ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న నీది నాదే ఒకే కథ చిత్రం మార్చి 23న రిలీజ్‌ సిద్ధమవుతున్నది. కవి, సినీ రచయిత వేణు ఊడుగుల తొలిసారి దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. అరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై హీరో నారా రోహిత్ ఈ చిత్రానికి నిర్మాతగా వహిస్తున్నారు. నీది నాది ఒకే కథ చిత్రం సెన్సార్ పనులు మార్చి 19 తేదీన పూర్తయ్యాయి. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. మెంటల్ మదిలో చిత్రం తర్వాత శ్రీ విష్ణు నటించిన తదుపరి చిత్రమిది. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

     వెరైటీ కాన్సెప్ట్‌తో సినిమా

    వెరైటీ కాన్సెప్ట్‌తో సినిమా

    నీది నాది ఒకే కథ చిత్రంలో ఓ వెరైటీ కాన్సెప్ట్. ఈ చిత్రంలో నాది డబుల్ రోల్ కాదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకుడు క్యారెక్టర్‌తో కనెక్ట్ అవుతాడు. చదువు పూర్తయిన తర్వాత లైఫ్‌లో సెటిల్మెంట్ అయ్యేవరకు జరిగే కథ. ఓ అతి సాధారణమైన తెలివితేటలు ఉన్న విద్యార్థి జీవితంలో పడే సంఘర్షణనే నీది నాది ఒకే కథ.

    ఇబ్బందులు గుర్తొచ్చాయి..

    ఇబ్బందులు గుర్తొచ్చాయి..

    సినీ పరిశ్రమలో స్థిరపడేందుకు ప్రయత్నించే సమయంలో కాలేజ్ డేస్ పూర్తయిన తర్వాత పడిన ఇబ్బందులను ఈ పాత్ర చేసేటప్పుడు ఆ పరిస్థితులను అన్వయించుకొన్నాను. నిజాయితీగా ప్రయత్నం చేద్దాం, ఫలితం దానంతట అదే వస్తుంది అనే భావనతో అందరూ ప్రయత్నిస్తుంటారు. అలాంటి భావనకు దగ్గరగా ఉండే స్టోరినే నీది నాది ఒకే కథ సినిమా.

     ఆ దర్శకుడు ఒప్పుకోవడం

    ఆ దర్శకుడు ఒప్పుకోవడం

    పూర్తిగా మధ్య తరగతి వాతావరణం ఈ సినిమా నేపథ్యం. ఈ చిత్రంలో నా తండ్రిగా సినీ దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ నటించారు. కథకు అవసరమైన సూచనలు, సలహాలు ఆయన అందించారు. కానీ స్క్రిప్టులో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. కథ విన్న తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ గారు చాలా థ్రిల్ అయ్యారు. ఓ దర్శకుడు కథను విని మరో దర్శకుడు ఒప్పకొని సినిమా చేయడం గొప్ప విషయం.

     ప్లాన్ ప్రకారమే రిలీజ్

    ప్లాన్ ప్రకారమే రిలీజ్

    నీది నాది ఒకే కథ సినిమా రిలీజ్ డేట్ అనుకోకుండా తీసుకొన్న నిర్ణయం కాదు. చాలా పక్కగా సినిమాను ప్లాన్ చేస్తూ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తూ వచ్చాం. మీడియా సహకారంతో మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న సినిమాలకు మీడియా అందిస్తున్న సహకారం గొప్పగా ఉంది. సమయం చూసి సినిమా రిలీజ్ చేస్తామనేది చిన్న చిత్రాలకు వర్కవుట్ కాదు. పెద్ద సినిమాలకు వర్కవుట్ అవుతుది.

     మిడిల్ క్లాస్ కథల ఎంపికపై

    మిడిల్ క్లాస్ కథల ఎంపికపై

    మిడిల్ క్లాస్ కథలు, పక్కింటి కుర్రాడు లాంటి క్యారెక్టర్లు ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి ప్లాన్ లేదు. నాలాంటి హీరో వద్దకు ఇలాంటి కథలే వస్తాయి. నాపై పెట్టే బడ్జెట్ మేరకే నా సినిమాలు ఎంపిక చేసుకొంటాను. అంతేగానీ నా సినిమా వసూలు చేసే దానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టించి సినిమాలు తీయడం నిర్మాతలకు శ్రేయస్కారం కాదు. నేను చేసే క్యారెక్టర్లకు బడ్జెట్ చాలా సంబంధం ఉంటుంది. అందుకు నాకు అలాంటి సినిమాలు వస్తున్నాయి.

    వేణు ఊడుగుల ఎక్సలెంట్‌గా

    వేణు ఊడుగుల ఎక్సలెంట్‌గా

    నీది నాది ఒకే కథ సినిమాకు వేణు ఊడుగుల తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. దర్శకుడితో ఎక్కువగా ట్రావెల్ కావడం వల్ల సినిమా తెర మీద బాగా వచ్చింది. ఏడాదిన్నర క్రితం ఈ సినిమా ప్రారంభమైంది. మధ్యలో మెంటల్ మదిలో రిలీజ్‌కు వచ్చింది. దాంతో మా సొంత సినిమా అనే కారణంతో ఈ చిత్రాన్ని కొద్దిగా ముందుకు జరిపాం.

     డాగ్ మీ 95 అనే థియరీతో

    డాగ్ మీ 95 అనే థియరీతో

    నీది నాది ఒకే కథ సినిమా డాగ్ మీ 95 అనే కాన్సెప్ట్‌తో రూపొందించాం. డెన్మార్క్‌లో సినిమాలు తీయడానికి రూపొందించిన థియరీ అది. దాదాపు 10 పాయింట్ల ఉంటాయి. అసలు ఖర్చు పెట్టకుండా సినిమాను తీయడం అనేది ప్రధానమైన అంశం. హైఎండ్ కెమెరాలు, క్రేన్లు, ఇతర ఎక్విప్‌మెంట్లు లేకుండా జీరో బడ్జెట్‌తో సినిమా చేయడం ఈ థియరీ ముఖ్య ఉద్దేశం.

     నేను భాగస్వామినే

    నేను భాగస్వామినే

    నీది నాది ఒకే కథ సినిమాను నారా రోహిత్, విజయ్, నేను కలిసి రూపొందించాం. ఇందులో నేను కూడా భాగస్వామినే. తెలుగులో డాగ్ మీ 95 ప్రకారం తీసిన తొలి సినిమా. దేశంలోనే మొదటిది కూడా. ఇంతకు ముందు మలయాళంలో సినిమా చేశారు కానీ ఇంకా అది రిలీజ్ కాలేదు.

     బాలకృష్ణ అంటే ఇష్టం

    బాలకృష్ణ అంటే ఇష్టం

    మధ్య తరగతి యువకుడి పాత్రలు కాకుండా మాస్ హీరో కావాలనుకోవడం చాలా కష్టమైనపని. మాస్ హీరో అంటే మామూలు విషయం కాదు. డిఫరెంట్ సినిమాలు చేయాలనేది నా గోల్. కథలతో ప్రయోగం చేయాలన్నది నా కోరిక. నాకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. హీరోగా మెప్పించడం అనేది ఎంత కష్టపడాలో అనే విషయాన్ని బాలయ్యను చూసి నేర్చుకొన్నాను.

     ప్రత్యేకంగా హెయిర్ కట్

    ప్రత్యేకంగా హెయిర్ కట్

    వీరభోగ వసంత రాయలు సినిమా కోసం ప్రత్యేకంగా హెయిర్ కట్ చేయించారు. ఇలాంటి హెయిర్ కట్‌తో బయట తిరగాలంటే సిగ్గేస్తున్నది. ఆ సినిమాలో చాలా రకాల గెటప్స్‌లో కనిపిస్తాను.

    English summary
    Needi Naadi Oke Katha movie gets with a Clean "U" Certification. Cast is the Sree Vishnu and Satna Titus. This movie releasing on 23rd March. A film directed by Venu Vudugula, Nara Rohith producing Aran Media Works. On occassion of movie release, Hero Sri Vishnu spoke to Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X