Sreeleela బాలకృష్ణ తన పేరుకు తగినట్టే..భయపడుతూనే సెట్‌లోకి వెళ్లా.. శ్రీలీల (ఇంటర్వ్యూ)

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలోప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మూవీ భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ బజ్ క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీలీల ఫిల్మీబీట్ తెలుగుతో మాట్లాడుతూ..

కూతురిగా నటించాల్సి వచ్చినప్పుడు..
భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణకు కూతురిగా నటించాల్సి వచ్చినప్పుడు ముందు వెనుకా ఆలోచించాను. గ్లామర్ రోల్స్ ఎప్పుడైనా చేయవచ్చు. కానీ పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు అరుదుగా హీరోయిన్ల ముందుకు వస్తాయి. గ్లామర్ హీరోయిన్ పాత్రలు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ సినిమాలో విజ్జి పాత్ర ఎమోషనల్ డ్రైవ్‌తో కూడిన పాత్ర. నటిగా నిరూపించుకోవడానికి ఛాన్స్ ఉన్న రోల్. అందుకే నేను భగవంత్ కేసరి సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించాను అని శ్రీలీల చెప్పారు.

 Sreeleela Interview about Nandamuri Balakrishna and Bhagavanth Kesari movie

మంచి డ్యాన్సర్ అనే పేరు..
నా కెరీర్ ఆరంభంలోనే ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర రావడం చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ ఫెర్ఫార్మెన్స్ ఓరియెంట్ పాత్రలు చేయాలి. ఇప్పుడు శ్రీలీల అంటే కేవలం మంచి డ్యాన్సర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నాకు పాజిటివ్ అయినా..నటిగా నాకు నేను ప్రూవ్ చేసుకొనే స్పేస్ లభించింది అని శ్రీలీల పేర్కొన్నారు.

 Sreeleela Interview about Nandamuri Balakrishna and Bhagavanth Kesari movie

బాలకృష్ణ అరుపులకు
బాలకృష్ణతో నాకు ఫస్ట్ సీన్.. మిలిటరీ ట్రైనింగ్ కోసం ఎక్సర్‌సైజ్ చేసే సీన్. నాకు ఫుష్ అప్స్ చేయడం రాదు. కానీ పాత్ర పరంగా చేయాల్సి రావడంతో చాలా కష్టపడ్డాను. పాత్ర పరంగా బాలకృష్ణ అరుస్తుంటాడు. ఫస్ట్ సీన్‌లోనే అలాంటి సన్నివేశం చేయాల్సి రావడం కష్టమనిపించింది అని శ్రీలీల చెప్పింది.

 Sreeleela Interview about Nandamuri Balakrishna and Bhagavanth Kesari movie

పేరుకు తగినట్టే మంచి వ్యక్తి
బాలయ్య తో సినిమా అనగానే చాలా భయమేసింది. మీడియాలో వచ్చే కథనాలు విన్న తర్వాత ఆయనతో సెట్‌లో ఎలా ఉండాలనే ఫీలింగ్ నా మైండ్‌లో వచ్చింది. ఒకసారి సెట్స్‌లో కలిసిన తర్వాత ఆయన ఎంత మంచి వారో అనే విషయం తెలిసింది. బాలకృష్ణ పేరుకు తగినట్టే చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన యంగ్ ఎట్ హార్ట్ అని శ్రీలీల చెప్పింది.

విజ్జి పాత్ర వెంటాడింది అంటూ..
అనిల్ రావిపూడి సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన స్టయిల్ నుంచి పక్కకు వచ్చి చేసిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా డ్రైవ్ వేరేలా ఉంటుంది. పెళ్లిసందడిలో, ధమాకాలో నా క్యారెక్టర్ వేరేగా ఉంటాయి. భగవంత్ కేసరి సినిమాలో విజ్జీ పాత్ర ధైర్యం లేని క్యారెక్టర్. భయంగా ఉంటుంది. కానీ చాలా చలాకీగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ నన్ను అంతగా వదల్లేదు.ఇంటికి వచ్చినా గానీ ఆ పాత్ర నుంచి బయటకు రాలేదు అని శ్రీలీల వెల్లడించింది.

 Sreeleela Interview about Nandamuri Balakrishna and Bhagavanth Kesari movie
బాలకృష్ణ గురించి చెప్పాలంటే..
భగవంత్ కేసరి సినిమా సెట్లో చాలా విషయాలు బాలయ్య నుంచి నేను నేర్చుకొన్నాను. బాలయ్య చాలా విషయాలు చెబుతాడు. కేవలం సినిమా గురించే కాకుండా చాలా విషయాల గురించి పరిపూర్ణంగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. నేను మెడిసిన్ చదువుతున్నానని తెలిసి.. ఆయన మెడికల్ ఫీల్డ్ గురించి చాలా చెప్పారు. బసవతారకం ట్రస్ట్ కారణంగా ఆయనకు వైద్య రంగం గురించి చాలా విషయాలు తెలుసు. ఆయన ఇన్ క్రెడిబుల్ మ్యాన్ అని శ్రీలీల చెప్పింది

తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో భగవంత్ కేసరి కథ ఉంటుంది. భాష, యాస విషయంలో పెద్దగా కష్టం కాలేదు. తెలుగు వాళ్లం కాబట్టి.. తెలంగాణ యాస నేర్చుకోవడం ఈజీ అయింది. దాదాపు నేను తెలంగాణ యాసను పలకడానికి కొంత కష్టపడ్డాను. మొదటి ప్రయత్నంలో నేను బాగానే యాసను బాగా పలికానని అనుకొంటున్నాను. నేను ఎలా పలికాననే విషయాన్ని మీరు స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది అని శ్రీలీల చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X