Sreeleela : ఆ సీన్‌ను లీక్ చేసిన శ్రీలీల! బాలకృష్ణ, కాజల్‌ను అలా దొంగచాటుగా చూశా.. !

పెళ్లి సందD, ధమాకా సినిమాలను నన్ను స్టార్‌గా నిలబెట్టాయి. ఆ రెండు సినిమాల విజయంతోనే నాకు భారీ ఆఫర్లు వచ్చాయి. అగ్ర డైరెక్టర్లతో పనిచేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను స్టార్ హీరోయిన్‌ అనే గర్వం నాకు లేదు. ఓ బాధ్యతగా పనిచేస్తాను అని శ్రీలీల చెప్పారు. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్‌తో కలిసి నటించిన భగవంత్ సింగ్ మూవీ గురించి పలు విశేషాలు పంచుకొన్నది. ఫిల్మీబీట్‌ తెలుగుతో శ్రీలీల మాట్లాడుతూ..

భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ నటించడం ఓ బ్లెస్సింగ్ లాంటింది. ఆమె అందంతోనే కాకుండా అభినయంతో మెప్పించే స్టార్ హీరోయిన్. అలాంటి సీనియర్ నటితో నటిస్తున్నాననే విషయం తెలిసినప్పుడు చాలా భయం వేసింది. నేను ఒక టేక్ ఎక్కువగా తీసుకొంటే తిట్టుకోవద్దని చెప్పాను. అనుభవంతో ఆమె నటిగా టాప్ రేంజ్‌కు చేరుకొన్నారనే విషయం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. అవన్నీ నాకు చాలా ఇన్స్‌పిరేషన్‌గా నిలిచింది. నన్ను చాలా గైడ్ చేసింది అని శ్రీలీల చెప్పారు.

 Sreeleela leaked Chemistry between Balakrishna and Kajal Aggarwal in Bhagavanth Kesari

కాజల్ అగర్వాల్‌తో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. బాలయ్య, కాజల్ మధ్య ఉండే సీన్లు సూపర్‌గా ఉంటాయి. ఆ సీన్లను నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు దొంగచాటుగా చూశాను. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ చాలా అద్బుతంగా ఉంది. కామెడీని అద్బుతంగా తీశారు. అనిల్ రావిపూడి నుంచి చాలా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని శ్రీలీల చెప్పారు.

 Sreeleela leaked Chemistry between Balakrishna and Kajal Aggarwal in Bhagavanth Kesari

నాకు మంచి డ్యాన్సర్‌గా పేరు రావడం చాలా హ్యాపీ. కానీ ఆర్టిస్టుగా కూడా గొప్ప పేరు తెచ్చుకోవాలన్నది నా కల. నేను నటన నేర్చుకొన్నది నాట్యం వల్ల. నేను భరతనాట్యం నేర్చుకొన్నాను. డ్యాన్స్ ద్వారా కథ చెప్పాల్సి వచ్చినప్పుడు డైలాగ్స్ లేకుండా బాడీ లాంగ్వేజ్‌తోనే కథ చెప్పాల్సి ఉంటుంది. అలా నాలో నటన ఉండిపోయింది. యాక్టింగ్ అనేది ప్రతి నిత్యం నేర్చుకోనే ప్రక్రియ. సెట్లోనే ప్రతీ రోజు కొత్తగా నేర్చుకొనే అవకాశం ఉంటుంది. దర్శకులు చెప్పే సీన్ల ద్వారా నటనా అనుభవం వస్తుంది అని శ్రీలీల తెలిపారు.

బాలకృష్ణ, నా క్యారెక్టర్ మధ్య మంచి బాండింగ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మా మధ్య సీన్లలో ఎమోషనల్‌ కంటెంట్ అందర్నీ ఆకట్టుకొంటుంది. నేను సినిమాలో బాలయ్యను చిచ్చా అని పిలుస్తాను. పరిస్థితుల కారణంగా రెండు పాత్రలు మానసిక సంఘర్షణకు లోనవుతాయి. నేను తొలిసారి నా వయసు కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిగా నటించాను. నా పాత్ర కోసం అనిల్ రావిపూడి చాలా శ్రద్ద తీసుకొన్నారు.

 Sreeleela leaked Chemistry between Balakrishna and Kajal Aggarwal in Bhagavanth Kesari

హీరోయిన్‌గా వరుస ఆఫర్లు రావడానికి కారణమైన దర్శకుడు రాఘవేంద్ర రావుకు రుణపడి ఉంటాను. చేతిలో డజను సినిమాలు ఉన్నాయంటే.. అందుకు కారణం దర్శకులే. నేను స్టార్ అనే మాట వింటున్నానంటే.. మీడియా కూడా కారణం. అందరూ నన్ను ప్రోత్సహించడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని శ్రీలీల చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X