కథను కెలుకొద్దని అనుకొన్నా.. ప్రియమణిని అందుకే తీసుకొన్నాం... అసురన్ రీమేక్ గురించి శ్రీకాంత్ అడ్డాల

అసురన్ రీమేక్‌గా వస్తున్న నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. వెంకటేష్, ప్రియమణి నటించిన ఈ చిత్రానికి సెన్సిటీవ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల నారప్ప మూవీ గురించి వెల్లడిస్తూ...

ఇప్పటికి వరకు ఫ్యామిలీ, సెన్సిటివ్ మూవీలు మాత్రమే తీస్తారనే బ్రాండ్ పడింది. కానీ నా ఇమేజ్‌కు భిన్నంగా మాస్ మూవీతో వస్తున్నాను. అసురన్ రీమేక్ కావడంతో ఆ సినిమా కథను కెలుక వద్దని డిసైడ్ అయ్యాం. ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ మాత్రమే వర్కవుట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకొన్నాం. ఆ కోణంలో మేము భావోద్వేగాలను పండించడంలో సక్సెస్ అయ్యాం అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు.

అసురన్ సినిమాకు భారీ క్రేజ్ రావడంతో వెంకటేష్ బాబు, సురేష్ బాబు రీమేక్స్ రైట్స్ కొనుకొన్నారు. అయితే ఏదో పనిమీద వారిని కలిస్తే అసురన్ రీమేక్ గురించి చర్చ వచ్చింది. అయితే మీకు అభ్యంతరం లేకపోతే నేను చేస్తానని చెప్పాను. వారికి నాపై నమ్మకం కలిగింది. అలా ఈ సినిమాకు వెంకటేష్ అనుకొన్న తర్వాత నన్ను ఈ సినిమాకు తీసుకొన్నారు. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎమోషన్స్ పండించడం నాకు ఛాలెంజ్ అనిపించింది అని శ్రీకాంత్ అడ్డాల తెలిపారు.

Srikanth Addala about Venkateshs Narappa of Asuran Remake

ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాలన్న విషయాన్ని జీర్ణించుకోవడానికి రెండు రోజులు పట్టింది. నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలన్నది తమిళ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్ణయం. ఈ విషయంలో వెంకటేష్ కూడా కాస్త నిరాశపడ్డారు. పరిస్థితుల్లో తప్పని పరిస్థితి అని శ్రీకాంత్ అడ్డాల అన్నారు.

అసురన్ సినిమా చూసినప్పుడు తల్లి పాత్రకు ప్రియమణి అయితే బాగుంటుందనిపించింది. ఆమె పరుత్తీవీరన్ సినిమాలో నటించిన తీరు ఆకట్టుకొన్నాయి. అందుకే ప్రియమణిని తీసుకొన్నాం అని శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు. అలాగే వెంకటేష్ కొండల్లో గుట్టల్లో, ఇసుక, మురికి నీటిలో సీన్లు చేస్తూ చాలా కష్టపడ్డారు. ఆయన ఫెర్ఫార్మెన్స్ చూస్తే.. పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X