RRR రాంగోపాల్ వర్మ స్పూర్తితో అలాంటి అబద్దం చెప్పా.. మాట మార్చడంపై రాజమౌళి వివరణ
RRR సినిమా షూటింగులో ప్రతి రోజు అయ్యా బాబోయ్ అనిపించింది. ప్రతీ రాత్రి ఓ కాళరాత్రిగానే మారింది. షూటింగ్ జరిగిన రోజులు కష్టపడ్డాం. ఏ రోజు కూడా సులభం, సౌకర్యంగా సినిమా షూటింగ్ జరగలేదు. RRR లాంటి కథ రాయడం అందరి దర్శకులకు సాధ్యపడదు. ఇక ముందు మల్టీ స్టారర్ సినిమాలు వస్తాయి. క్రాస్ ఓవర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. RRR సినిమా కథలు అరుదుగా వస్తుంటాయి. తెర మీద ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయం కోసం ఎదురు చూస్తున్నాం అని ఎన్టీఆర్ అన్నారు. ఇంకా ఈ సినిమా గురించి రాజమౌళి, ఎన్టీఆర్ మాట్లాడుతూ..

జక్కన్న కాకుండా వేరే దర్శకుడు కథ చెబితే..
RRR సినిమా కథ వేరే దర్శకుడు చెబితే చేయకపోయి ఉండేవాడిని. ఎందుకంటే ఇలా కథ చెప్పడం, చెప్పిన కథను తెర మీద తీయడం రాజమౌళికే సాధ్యం. ఇక ముందు తెలుగు సినిమాలు అన్నీ ప్యాన్ ఇండియాగానే ఉంటాయి. ఇండస్ట్రీ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. తెలుగు సినిమా వస్తుందంటే అందరూ ఎదురు చూస్తున్నారు అని ఎన్టీఆర్ తెలిపారు.

వర్మను స్పూర్తిగా తీసుకొని..
మగధీర సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు, ఎక్కువ రోజులు సినిమా షూటింగ్ చేయకూడదని అనుకొన్నాను. దాని ప్రకారమే నేను ఈగ, మర్యాద రామన్న చిత్రాలు చేశాను. బాహుబలి తర్వాత నా వల్ల కావడం లేదు. భారీ బడ్జెట్ తీయను అని చెప్పడానికి రాంగోపాల్ వర్మను స్పూర్తిగా తీసుకొని ఓ అబద్దం చెప్పాను. ఇక బాహుబలి కంటే పెద్ద సినిమాగా ఉంటుంది. నేను ఎప్పుడూ రికార్డు కొల్లగొట్టే సినిమాలు తీస్తానని ముందు ఎప్పుడు చెప్పలేదు అని రాజమౌళి పేర్కొన్నారు.

RRR గ్లోబల్ సినిమా కాకపోవచ్చు
RRR సినిమా గ్లోబల్ సినిమా అంటే నేను ఒప్పుకొను. తెలుగు వాళ్లందరూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నారు కాబట్టి మన సినిమాలు చూస్తున్నారు. అంతా మాత్రాన మన సినిమా గ్లోబల్ సినిమా అవ్వదు. విదేశీ ఆడియెన్స్ చూస్తే అప్పుడు గ్లోబల్ సినిమా అవుతుంది. బాహుబలి విషయంలో అది జరిగింది. జపాన్‌లో ఎక్కువ మంది సినిమాను ఆదరించారు. కాబట్టి బాహుబలిని గ్లోబల్ సినిమా అని చెప్పవచ్చు అని రాజమౌళి అన్నారు.

రాంచరణ్, ఎన్టీఆర్ అలాంటి త్యాగం
RRR సినిమా చేయడానికి రాంచరణ్, ఎన్టీఆర్ ఒప్పుకోవడమే ఓ త్యాగం. దాదాపు నాలుగున్నర ఏళ్లు ఈ సినిమా షూటింగ్ కొనసాగింది. రెండేళ్లు కరోనా తీసేస్తే.. కనీసం రెండున్నర ఏళ్లలో మూడు సినిమాలు చేయాల్సి ఉండేది. ఈ సినిమా చేయడం వల్ల వచ్చే రెమ్యునరేషన్ కంటే.. మూడు సినిమాలు చేస్తే వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేది. రెమ్యునరేషన్, బడ్జెట్ విషయాలు పక్కన పెడితే ఈ సినిమా కోసం పనిచేయడం, ఒక ఎక్సైట్‌మెంట్ డిఫరెంట్ అని రాజమౌళి పేర్కొన్నారు.
Recommended Video


2 ఏళ్లు నష్టపోయాం
RRR సినిమా వల్ల నేను గానీ, రాంచరణ్ గానీ నష్టపోలేదు. ఎందుకంటే నాలుగున్నర ఏళ్లలో మేము పనిచేసింది. 240 కంటే పైగా రోజులు ఉంటాయేమో. అంతకు మించి పనిచేయలేదు. కానీ లాక్‌డౌన్ వల్ల ఎంటైర్ యూనిట్ 2 ఏళ్లు నష్టపోయింది. రాజమౌళి కారణంగా మేము విలువైన సమయాన్ని కోల్పోయామనేది తప్పు అని ఎన్టీఆర్ అన్నారు.


Click it and Unblock the Notifications











