రాజమౌళికే ఆ టార్చర్ తప్పలేదు.. ఆయన ముందు నేను జుజూబీ.. డైరెక్టర్ బాబీ

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు ఫిల్మీబీట్‌తో దర్శకుడు బాబీ మాట్లాడుతూ...

గతంలో చిరంజీవి లాంటి మెగాస్టార్‌తో పనిచేశాను. ఆ సినిమా అనుభవం నాకు చాలా పనికి వచ్చింది. బాలకృష్ఠతో కలిసి పనిచేయడానికి మంచిగా హెల్ప్ అయింది. సెట్లో బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడితో పనిచేయడం వల్ల చాలా నేర్చుకొన్నాను. సినిమాకు ముందు ఆయనపై ఉన్న అభిప్రాయం ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. ఆయనతో వెంటనే సినిమా చేయాలనేంత కోరిక కలిగింది అని బాబీ తెలిపారు.

SS Rajamouli gets negative talk after Baahubali My Films are also same says Bobby

బాలకృష్ణ నుంచి చాలా నేర్చుకొన్నాను. ఆయనలో ఉండే డిసిప్లేన్ నన్ను ఆశ్చర్య పరిచింది. 50 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా చాలా డౌన్ టూ ఎర్త్ ఉండే నటుడు. డైరెక్టర్ అంటే ఎనలేని గౌరవం. డైరెక్టర్ కనిపిస్తే లేచి నిలబడుతాడు. చెప్పే విషయాన్ని సావధానంగా వింటాడు. అంతకంటే ముఖ్యంగా చాలా సరదాగా ఉంటారు. ఎలాంటి రిస్కీ షాట్స్ కూడా డూప్ లేకుండా చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఆయన పక్కా ప్రొఫెషనల్ అని బాబీ తెలిపారు.

నా కెరీర్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు.. డాకు మహారాజ్ మరో ఎత్తు. ఈ సినిమా తర్వాత గత సినిమాల్లో కంటే స్టోరీ,స్క్రీన్ ప్లే విషయంలో నా శైలి భిన్నంగా ఉంటుంది. హాలీవుడ్ స్థాయిలో విజువల్ ట్రీట్ ఉంటుంది. డైరెక్టర్‌గా ఎవరికైనా ఏదైనా అసంతృప్తి ఉంటే.. ఈ మూవీతో తొలిగిపోతుంది అని ఆయన అన్నారు.

నా ప్రతీ సినిమా రిలీజ్ రోజు నెగిటివ్ టాక్‌తోనే మొదలు అవుతాయి. ఆ తర్వాత డిజాస్టర్ టాక్‌ను అధిగమించి బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకొన్నాయి. అయితే అలాంటి టాక్ వచ్చినప్పుడు చా లా భయమేస్తుంది. కానీ సినిమా విషయంలో నాకు ఓ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే నా నమ్మకాన్ని నిలబెడుతుంది అని బాబీ అన్నారు.

అయితే నా సినిమాకు తొలి ఆట తర్వాత నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు టెన్షన్ పడిపోతుంటాను. అయితే బాహుబలి సినిమాకే రాజమౌళికి ఆ టార్చర్ తప్పలేదు. అలాంటి ఇండియన్ సినిమా గర్వించే దర్శకుడికే అలాంటి టార్చర్ తప్పనప్పుడు..ఆయన ముందు నేనెంత? జక్కన్న ముందు నేను జూజూబీనీ. ప్రతీ దర్శకుడికి అలాంటి అనుభవం తప్పకుండా ఉంటుంది. దానిని ఎవరు తప్పించుకోలేరు అని బాబీ తెలిపారు.

బాబీ దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ సినిమా రిలీజై మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం పాత సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ విజయం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తు్న్నది. బాలకృష్ణ కెరీర్‌లోనే కాకుండా బాబీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X