For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR గురించి మరో షాకింగ్ న్యూస్.. ఒత్తిడికి తలవంచను.. తేల్చిచెప్పిన రాజమౌళి

  |

  దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ రంగాలపై కరోనావైరస్ భారీగా దెబ్బ కొట్టింది. పలు క్రేజీ ప్రాజెక్టులు, భారీ బడ్జెట్ చిత్రాల దారుణంగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది. షూటింగులు వాయిదా పడటంతో నిర్మాతలకు విపరీతంగా బడ్జెట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం RRRను వెంటాడుతున్నాయి. గతంలో పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్ర రిలీజ్ డేట్ ఇప్పుడు మరోసారి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే..

  సంక్రాంతి బరి నుంచి అవుట్

  సంక్రాంతి బరి నుంచి అవుట్

  కరోనా లాక్‌డౌన్ ముందు వరకు ఉన్న ప్రణాళికతో RRR సినిమాను 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. సంక్రాంతి రేసులో సినిమాను తీసుకొచ్చి లాంగ్ వీకెండ్‌లో భారీగా వసూళ్లను రాబట్టే ప్లాన్ చేశారు. అయితే లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ పనులు, గ్రాఫిక్, ఇతర విజువల్ ఎఫెక్ట్స్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దాంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

  ఒత్తిడికి తలవంచం

  ఒత్తిడికి తలవంచం

  RRR సినిమా పనులపై రాజమౌళి స్పందిస్తూ.. ఒకవేళ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసినా మేము తొందరపడి పనులను హడావిడిగా మొదలుపెట్టం. రిలీజ్ చేయాలనే ఒత్తిడి, ఇతర పరిస్థితులు మమల్ని వెంటాడుతున్నప్పటికీ.. క్వాలిటీ విషయంలో రాజీ పడం. మా టెక్నిషియన్లపై ఒత్తిడి పెంచబోం అని రాజమౌళి స్పష్టం చేశారు.

  ఓవర్సీస్ మార్కెట్‌లో పరిస్థితులను బట్టి

  ఓవర్సీస్ మార్కెట్‌లో పరిస్థితులను బట్టి

  RRR రిలీజ్ విషయం కేవలం మన దేశానికి సంబంధించి మాత్రమే కాదు. ఓవర్సీస్ మార్కెట్‌లో ఉండే పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. పలు దేశాల్లో మా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. వాటికి అనుగుణంగానే ఆయా దేశాల్లో లాక్‌డౌన్ తర్వాత ఉండే పరిస్థితి ఆధారంగానే బిజినెస్, రిలీజ్ లాంటి విషయాలపై ఆలోచన చేస్తాం అని జక్కన్న స్పష్టం చేశారు.

  పనులు రీ షెడ్యూల్ చేసుకొంటున్నాం

  పనులు రీ షెడ్యూల్ చేసుకొంటున్నాం

  RRR రిలీజ్ విషయంపై మళ్లీ స్పష్టమైన నిర్ణయం తీసుకొంటాం. ప్రణాళికలన్నీ మళ్లీ రీషెడ్యూల్ చేసుకొంటున్నాం. త్వరలోనే విడుదల తేదీపై నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటిస్తాం. త్వరలోనే మా యూనిట్ సభ్యులంతా కలిసి సినిమా పనుల పురోగతిని విశ్లేషించుకొంటాం. RRR సినిమా సాంకేతిక అంశాలపై ఆధారపడి ఉంది. వాటిని అంత త్వరగా పూర్తి చేసే అవకాశం లేదు అని రాజమౌళి చెప్పారు.

  జూలై 2021లో రిలీజ్?

  జూలై 2021లో రిలీజ్?

  ఇక RRR రిలీజ్ డేట్‌పై అనేక ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. చాలా వరకు వీఎఫ్ఎక్స్ పనులు, షూటింగ్ వర్క్ పెండింగ్‌లో ఉన్నందున ఈ సినిమా రిలీజ్ మరింత వెనక్కు జరిగే అవకాశం ఉంది. బహుశా రాజమౌళికి కలిసి వచ్చిన ఏప్రిల్ నెలలో గానీ లేదా జూలై 2021లో గానీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే మాట ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అలా అయితే దాదాపు ఈ సినిమా అనుకొన్న ప్లాన్ కంటే ఏడాది లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

  English summary
  RRR movie release postponed, SS Rajamouli movie to release on October 23rd. SS Rajamouli's RRR will be shot at real locations across the nation, unlike Baahubali which was shot at a grand set. The director's next, RRR will be produced by DVV Danayya having an enormous budget of nearly Rs 350 crore.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X