#BRO మూవీ చూసి కంటతడి.. త్రివిక్రమ్ ఆ విషయం చెప్పగానే గూస్‌బంప్స్.. తమన్ (ఇంటర్వ్యూ)
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల మై డియర్ మార్కండేయ పాట విడుదలై ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మీడియాతో థమన్ బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమన్ మాట్లాడుతూ...
రీమేక్ సినిమాలకు మ్యూజిక్ చేయడం ఎవరెస్ట్ అధిరోహించినంత పని. పవన్ కల్యాణ్‌కు నేను చేసిన మూడు సినిమాలు రీమేక్స్ కావడం గమనార్హం. తొలుత వకీల్ సాబ్, ఆ తర్వాత భీమ్లా నాయక్, ప్రస్తుతం బ్రో సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాను. ప్రతీ సినిమాను మ్యూజికల్‌గా హిట్ చేయాలని చూస్తాను. వకీల్ సాబ్‌లో మగువ.. మగువను మ్యూజికల్‌గా సినిమాలో సెలబ్రేట్ చేశాం. రిలీజ్ తర్వాత బ్రో సినిమా అందర్నీ కదిలిస్తుంది. ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాను వేరే లెవెల్‌లో రాశారు. పవన్ కల్యాణ్ ఈ సినిమా రేంజ్, సైజును పెంచారు అని తమన్ తెలిపారు.

వినోదయ సీతమ్ ఒరిజినల్ వెర్షన్‌లో పాటలు లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా చేశారు. తమిళ వెర్షన్‌కు తగినట్టుగా మ్యూజిక్ చేశారు. ఇక్కడ పవన్ కల్యాణ్ సైజ్‌కు ఎక్కువగా పనిచేయాల్సి వచ్చింది. బ్రో సినిమాలో పవన్ కల్యాణ్ ఉన్నారంటే.. సినిమానే మ్యూజిక్‌ను డిమాండ్ చేస్తున్నది. ఫస్టాఫ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. స్క్రిప్టు ప్రకారమే ఈ సినిమాకు మ్యూజిక్ డిజైన్ చేశాం అని తమన్ చెప్పారు.
బ్రో సినిమాలో మ్యూజిక్‌కు చాలా స్కోప్ ఉంది. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌పై చిత్రీకరించిన పాటను మాస్‌గా చేయడానికి స్కోప్ లేదు. కేవలం సామెతల ఆధారంగా పాటను నడిపించాలని అనుకొన్నాం. కథనే పాటలను తీసుకెళ్తుంది. వారిద్దరి కాంబో సాంగ్‌ను మాస్ ప్రేక్షకుల నచ్చే విధంగా చేయలేం. బ్రో సినిమాకు కొన్ని పరిమితులు ఉన్నాయి అని తమన్ అన్నారు.

బ్రో సినిమా కోసం కాలం ఎంత విలువైనదనే బ్యాక్ డ్రాప్‌తో ఓ పాటను చేస్తున్నాం. అది కాకుండా మరో మూడు పాటలు చేస్తున్నాం. క్లైమాక్స్‌లో ఓ పాటను డిజైన్ చేస్తున్నాం. స్పెషల్ సాంగ్ చేయడానికి బ్రో అలాంటి సినిమా కాదు. సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్‌ను స్క్రీన్‌పై చూస్తే ముచ్చటగా ఉంది. వారిద్దరు ఇంట్లో మాట్లాడుకొన్నట్టు సన్నివేశాలు ఉంటాయి అని తమన్ పేర్కొన్నారు.
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాసి నేరేషన్ ఇచ్చినప్పుడే మాకు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రతీ ఒకరికి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతాయి. బ్రో సినిమాలో మంచి మూమెంట్స్ ఉన్నాయి. పవన్ కల్యాణ్ వేరే లెవల్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. పవన్ యాక్టింగ్ పరంగా కుమ్మేశాడు. పవన్ కల్యాణ్‌కు మ్యూజిక్ చేయడమంటే.. అభిమానిగా నాకు ప్రేజర్. ఆయన ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ ఉంటుంది. ఈ సినిమా విషయంలో మ్యూజిక్ పరంగా ప్రెజర్ ఉంది. కానీ నా అనుభవంతో ప్రెజర్‌ను డీల్ చేస్తున్నాను అని ఓ ప్రశ్నకు తమన్ సమాధానమిచ్చారు.


Click it and Unblock the Notifications











