కాపీ కొట్టావని వారిని ప్రశ్నించగలరా? అంత దమ్ముందా? జీవితాలు నాశనం.. తమన్ ఫైర్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేతకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. పాటలకు, రీరికార్డింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు. ఈ చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. రికార్డులు కొత్తగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద సమేత విజయానందాన్ని పంచుకోవడానికి సంగీత దర్శకుడు తమన్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. సినిమా గురించిన ఆయన చెప్పిన విషయాలు ఇవే.

హీరోలపై ఫ్యాన్స్ ప్రభావం

హీరోలపై ఫ్యాన్స్ ప్రభావం

తెలుగు సినీ పరిశ్రమలో హీరోలపై అభిమానుల ప్రభావం ఉంటుంది. అందుకే హీరోలు, దర్శకులు కథ ఎలా ఉంటుంది? మ్యూజిక్ ఎలా వస్తుంది? అని చూసుకొంటారు. చాలా జాగ్రత్తలు తీసుకొంటారు. ఎందుకంటే ఫ్యాన్స్ నుంచి చాలా అంచనాలు ఉంటాయి. ఫ్యాన్స్ క్రేజ్‌ను తట్టుకోవడం చాలా కష్టం

మాస్ సాంగ్స్ దూరంగా

మాస్ సాంగ్స్ దూరంగా

సరైనోడు సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని చెప్పవచ్చు. నా మ్యూజిక్‌లో కొత్త రకమైన మార్పు మొదలైంది. ఫాస్ట్ బీట్ మానేసి రెండేళ్లు అవుతున్నది. మాస్ సాంగ్స్ దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. అనవసరంగా పాటలు ఇరికించడం లేదు. ఈ విషయంలో దర్శక, నిర్మాతలతో గొడవ పెట్టుకొంటున్నాను.

మ్యూజిక్‌లో మెచ్యురిటీ గురించి

మ్యూజిక్‌లో మెచ్యురిటీ గురించి

భాగమతి చిత్రం తర్వాత నా మ్యూజిక్‌లో పరిణితి కనిపించడానికి కారణం కథలో బలం ఉండటమే. కథనే సినిమాను నడిపించే చిత్రాలను ఎంచుకొంటున్నాను. దాంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి స్కోప్ ఏర్పడింది. ప్రతీ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో ఆకలి కనిపించాలి. అప్పుడే మ్యూజిక్ దర్శకులు క్వాలిటీ ఫుడ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది.

అందుకే పాటల్లో ఇంటెన్సిటీ

అందుకే పాటల్లో ఇంటెన్సిటీ

గతంలో పాత, బాలీవుడ్ సినిమాల పాటలను రెఫరెన్స్‌గా తీసుకొనేవాళ్లం. ఇటీవల కాలంలో అలాంటి వాటికి దూరంగా ఉంటున్నాం. తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప మార్పు కనిపిస్తున్నది. కంటెంట్‌ను బట్టే మ్యూజిక్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి మ్యూజిక్‌లో ఇంటెన్సిటీ కనిపిస్తున్నది.

కాపీ అంటే బాధ కలుగుతుంది

కాపీ అంటే బాధ కలుగుతుంది

సినిమాకు మ్యూజిక్ అందించే విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కాపీ అని విమర్శిస్తే చాలా బాధగా ఉంటుంది. బిజినెస్ మ్యాన్ సినిమాలో పిల్లా చావ్ అనే పాటను నేను తీసుకోలేదు. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇచ్చాడు. అదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి వివరణ కూడా ఇచ్చారు.

అంత దమ్ముందా?

అంత దమ్ముందా?

మ్యూజిక్ కాపీ కొట్టాడని నన్నే ఎందుకు టార్గెట్ చేసుకొంటారో అర్థం కాదు. అలా రాయడం వల్ల జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా నన్ను టార్గెట్ చేసినట్టు కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, ఏఆర్ రెహ్మాన్‌ గురించి రాయగలరా? వారికి అంత దమ్ము ఉందా అని తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ నాపై నమ్మకం ఉంది. నా డైరెక్టర్లకు నా గురించి తెలుసు. కాపీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే నేను 60 సినిమాలు చేయగలనా? అని అన్నారు.

అలా రాస్తే జీవితాలు నాశనం

అలా రాస్తే జీవితాలు నాశనం

తన మ్యూజిక్ గురించి ఏది పడితే అది రాయకూడదు. ఎలాంటి విషయంపైనైనా సద్విమర్శ చేయాలి. సోషల్ మీడియాలో మెమోలు పెట్టి నానా రకాలుగా రాస్తారు. అది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకరి జీవితాన్ని పణంగా పెట్టి వార్తలు రాయకూడదు. నన్ను ఒక్కరినే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఇలా రాస్తే జీవితాలు నాశనమవుతాయి అని తమన్ ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X