త్రివిక్రమ్ చేతిలో రైఫిల్.. అలా బుల్లెట్లు దించేస్తాడు.. తమన్ సెన్సేషనల్ కామెంట్స్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత చిత్రంలో కథతోపాటు పాటలకు మంచి గుర్తింపు లభిస్తున్నది. భావోద్వేగ సన్నివేశాల్లో తమన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత పేరు వచ్చింది. మ్యూజిక్ గొప్పగా రావడానికి కారణమైన ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. వారితో ఉన్న అనుబంధాన్ని, తదుపరి సినిమాల గురించి వివరిస్తూ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. అరవింద సమేత గురించి తమన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

అనిరుధ్‌ రవిచంద్రన్‌ను తప్పించి

అనిరుధ్‌ రవిచంద్రన్‌ను తప్పించి

అరవింద సమేత చిత్రానికి ముందు అనిరుధ్ రవిచంద్రన్‌ను తీసుకొన్నారు. ఆ తర్వాత తనను తప్పించి నన్ను తీసుకొన్నారు. నాలాగే అనిరుధ్ కూడా వెరీ టాలెంటెడ్. అందుకే త్రివిక్రమ్‌ అతడిని తీసుకోవాలనుకొన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు పనిచేయలేకపోయాడు.

అనిరుధ్ కాల్ చేసి ప్రశంస

అనిరుధ్ కాల్ చేసి ప్రశంస

అరవింద సమేత సినిమాకు నేను పనిచేయాల్సి వచ్చినప్పుడు అనిరుధ్‌ను కలిశాను. సినిమా చేసే క్రమంలో నెలకొన్న పరిస్థితులపై కలిసి మాట్లాడుకొన్నాం. తను కూడా దానిని పట్టించుకోలేదు. అరవింద సమేత సినిమా రిలీజ్ తర్వాత చూసి నాకు కాల్ చేసి అభినందించాడు.

ఛాలెంజ్‌గా తీసుకొన్నాను

ఛాలెంజ్‌గా తీసుకొన్నాను

అనిరుధ్‌ను మార్చిన తర్వాత అరవింద సమేత చిత్రానికి పనిచేయాల్సి రావడాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకొన్నాను. ఎన్టీఆర్ ప్రేమ, త్రివిక్రమ్‌ మీద అభిమానంతో ఫుల్ ఎనర్జీతో పనిచేశాను. ఏ సమయంలోనూ ఎలాంటి భయాందోళనలకు గురికాలేదు. టెన్షన్ పడలేదు.

 చివరి నిమిషంలో త్రివిక్రమ్ రాసిన పాటను

చివరి నిమిషంలో త్రివిక్రమ్ రాసిన పాటను

అరవింద సమేత క్లైమాక్స్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఊరికి ఉత్తరాన ఓ పాటను రీల్ పంపించడానికి చివరి 45 నిమిషాల్లో చేశాం. ఆ సీన్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంచకూడదు అని డిసైడ్ అయ్యాం. ఆ సీన్‌కు ముందు చాలా ఎమోషనల్‌ కంటెంట్ ఉంటుంది. అందుకే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండకూడదని అనుకొన్నాం.

త్రివిక్రమ్ చేతిలో రైఫిల్ మాదిరిగా

త్రివిక్రమ్ చేతిలో రైఫిల్ మాదిరిగా

సినిమా రిలీజ్‌కు పది రోజుల ముందు త్రివిక్రమ్‌కు పాట రాయమని చెప్పాను. ఆయన ఎవరు చెప్పినా చాలా ఓపిక్కగా వింటారు. ఏదైనా రాసేటప్పుడు ఆయన చేతిలో ఉండేది రీఫిల్ పెన్ను కాదు. అది రైఫిల్‌గా మారుతుంది. బుల్లెట్ల మాదిరిగా మాటలు దిగుతాయి. అందుకే రైఫిల్ రెడీగా పెట్టుకొమని అప్పడప్పుడూ ఆయనతో అంటున్నాను.

రవితేజతో కలిసి తొమ్మిదోసారి

రవితేజతో కలిసి తొమ్మిదోసారి

అరవింద సమేత చిత్రం తర్వాత వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాను. దాంతోపాటు అమర్ అక్బర్ ఆంథోని సినిమా చేస్తున్నాను. రవితేజతో కలిసి పనిచేయడం ఇది తొమ్మిదోసారి. ఈ సినిమా ద్వారా కొత్త శ్రీనువైట్లను చూస్తారు. చాలా మేకోవర్ అయ్యారు. రవితేజ ఇమేజ్‌కు తగినట్టుగా సినిమా ఉంటుంది అని తమన్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X