‘నన్ను పూర్తిగా నిలువునా దోచేశారు.. నా భార్య లేకుంటే 10 కోట్లు నోక్కేసేవాళ్లు’

మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా గతిని మార్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. శివ మూవీతో సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్లను బద్ధలుకొట్టి .. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టెక్కించారు. టాలీవుడ్ చరిత్ర గురించి చెప్పాల్సి వస్తే శివ తర్వాత... శివ ముందు అన్నంతగా మార్చేశారు వర్మ. ఎవరికీ అర్ధం కానీ, అంతుచిక్కని పదార్ధంగా ఉండే ఆర్జీవీ.. ఎంతోమంది దర్శకులను, హీరోలను, హీరోయిన్లను, ఇతర టెక్నీషియన్లను భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన శిష్యులు కూడా వర్మ లాగే అంతుచిక్కరు. ఆర్జీవీ దగ్గర పనితో పాటు ఆయన మెంటాలిటీని కూడా బాగా నేర్చుకున్నట్లుగా కనిపిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు గుణశేఖర్.

వైవిధ్యానికి ఎప్పుడూ పెద్ద పీట వేసే దర్శకుల్లో గుణశేఖర్ ముందుంటారు. హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ పోతారు. తెలుగునాట హై బడ్జెట్ సినిమాలకు, విజువల్ ఎఫెక్ట్స్‌కు , భారీ సెట్టింగ్స్‌కు గుణశేఖర్ పెట్టింది పేరు. ఖర్చు పెరిగినా ప్రొడక్షన్ స్టాండర్డ్స్ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడరన్న పేరుంది. గుణశేఖర్ సినిమాలోని హీరోల క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా ఉండి, వారి ఇమేజ్‌ను రెట్టింపు చేసే విధంగా ఉంటుంది.

star Director Gunasekhar made sensational comments on movie production in film industry

లాఠీ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన గుణశేఖర్.. ఆ సినిమాతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కానీ నిరాశ చెందకుండా సొగసు చూడతరమా మూవీతో కొత్తతరహా కథను ప్రేక్షకులకు అందించారు. ఆ వెంటనే చిన్నారులతో రామాయణం, చూడాలనిఉంది, ఒక్కడు , సైనికుడు, అర్జున్ , మనోహరం, మృగరాజు, వరుడు, నిప్పు, రుద్రమదేవి, శాకుంతలం సినిమాలను తెరకెక్కించారు. కానీ వీటిలో సక్సెస్ అయినవి కొన్నే. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటాలని భావించిన గుణశేఖర్ ఎంతో నష్టపోయారు.

ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో నిర్మాతల ఇబ్బందులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ... ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును నిర్మాతగా మారి సినిమాపై పెట్టుబడి పెట్టానని చెప్పారు. కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలోగానే వృథా ఖర్చులు బాగా పెరిగిపోయాయని గుణశేఖర్ వెల్లడించారు.

షూటింగ్‌లో పాల్గొనేవారికి భోజన వసతి కల్పించేందుకు మెస్ ఓనర్లతో బేరాలు సాగించే దశలోనే లక్షలాది రూపాయలు మధ్యవర్తులకు అందేవని , ఈ సంగతి తనకు తెలిసి షాక్ అయ్యానని .. ఇది ఒకరకంగా దోపిడీయేనని గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక లాభం లేదనుకుని తన భార్యను రంగంలోకి దించానని.. ఆమె అద్భుతంగా ప్రొడక్షన్‌ని కంట్రోల్ చేసిందని ఆయన తెలిపారు. తన భార్య రావడం వల్ల దాదాపు రూ.10 కోట్లు సేవ్ అయ్యాయని .. లేదంటే ఎంతో నష్టపోయేవాడినని గుణశేఖర్ వ్యాఖ్యానించారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సినిమా లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

నా ఫ్యామిలీ ఇన్‌వాల్వ్ అయ్యారు కాబట్టే ఆ ఖర్చును తాను క్వాలిటీ కాపీ వైపు మళ్లించానని గుణశేఖర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇండస్ట్రీలో ఒక నిర్మాతను ఇంతలా దోచేస్తారా అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X