ఏసీపీ గోవింద్ మరో అగ్ని.. ఆ పాత్రకు మంచి పేరు వస్తుంది.. రాజా విక్రమార్క గురించి సుధాకర్ కోమాకుల
రాజా విక్రమార్క చిత్రంలో నేను ఏసీపీ రోల్లో కనిపిస్తాను. గోవింద్ అనే పాత్రలో నటించాను. ఈ సినిమాలో కీలకమైన పాత్ర. హోంమినిస్టర్కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటాను. సినిమాలో అన్ని పాత్రలతో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నా కెరీర్లో ఎప్పుడూ చేయని పాత్ర. నా లుక్కు కూడా మంచి పేరు వస్తుంది అని సుధాకర్ కోమాకుల ఆశాభావం వ్యక్తం చేశారు. నా కోసం ప్రత్యేకంగా సీన్లు రాయలేదు. సినిమాలో రోల్ నచ్చడంతో నేనే చేశా. ఆ పాత్రకు నేను అయితే బావుంటుందని అతను తీసుకున్నాడు. నా స్నేహితుడు నన్ను బాగా చూపిస్తాడనే నమ్మకంతో సినిమా చేశా. నటుడిగా నేను బాగా చేస్తే పెంచవచ్చు. సినిమా వరకూ మేమిద్దరం... నటుడు, దర్శకుడు. అంతే! నా కాస్ట్యూమ్స్, లుక్ పరంగా కేర్ తీసుకున్నాడు అన్నారు.
హీరోగా చేస్తూ చిన్న చిన్న పాత్రలు వేయడం తప్పేమీ కాదు. మంచి పాత్రలు లభిస్తే నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కార్తీకేయ యంగెస్ట్ సెన్సేషన్. అలాంటి హీరోతో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. గతంలో కూడా ఇలాంటి పాత్రల్లో నటించారు. క్రాక్ సినిమాలో మాదిరిగా నాకు మంచి పేరు వస్తుంది. క్రాక్ సినిమాలో కంటే మంచి క్యారెక్టర్ ఇది. సాయికుమార్ చెప్పినట్టు అగ్ని లాంటి పాత్ర. క్రాక్ సినిమాకు రాజా విక్రమార్కలోని పాత్రకు ఎలాంటి పోలీకలు ఉండవు అని సుధాకర్ కోమాకుల చెప్పారు. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారనే విషయం చెప్పకూడదు అని అన్నారు.

రాజా విక్రమార్క చిత్రం నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నాం. కానీ, కరోనా వల్ల రెండేళ్లు పట్టింది. ఇన్ని రోజులు బాడీ మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను. అయితే... మా నిర్మాత '88' రామారెడ్డి గారు, సమర్పకులు ఆదిరెడ్డి .టి సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడికి కావాల్సింది ఇచ్చి బాగా తీశారు అన్నారు.
సక్సెస్ లేకుండా లైఫ్ను కొనసాగించడం కష్టం. హృదయానికి టచ్ చేసే పాత్రల్లో నటించాలని ఉంది. నాకు నచ్చిన చిత్రాల్లో నటిస్తాను. బాక్సింగ్ నేపథ్యంగా ఓ సినిమా చేయాలని ప్రయత్నం చేశాం. కానీ అది కార్యరూపం దాల్చలేదు. త్వరలో అలాంటి చిత్రాల్లో నటిస్తాను అని సుధాకర్ కోమాకుల అన్నారు. నా కెరీర్కు, నాకు బిగ్గెస్ట్ సపోర్ట్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ.. చాలా దూరం ప్రయాణిస్తూ కూడా నాకు సపోర్ట్గా నిలిస్తున్నారు. సక్సెస్ లేకపోయినా ఇంకా సినిమాల కోసం ప్రయత్నించడం వెనుక నా భార్య ప్రోత్సాహం ఉంది. ఆమె నాకు బిగ్గెస్ట్ అసెట్ అని సుధాకర్ కోమాకుల చెప్పారు.
ఛాలెంజ్ సినిమాలోని ఇందువదన పాటకు స్టెప్పులు వేసిన భార్య హారిక గురించి సుధాకర్ చెబుతూ.. నా వైఫ్ హారిక చిన్నతనం నుంచి భరతనాట్యం, క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. తనకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ, తన ఫీల్డ్ ఇది కాదు. అందుకని, ఎప్పుడూ ఇటువైపు రాలేదు. సాంగ్ ఒక్కటి చేసింది అని అన్నారు.


Click it and Unblock the Notifications











